పంజాబ్ పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. దాదాపు 24 గంటల తర్వాత ఖలిస్తానీ నాయకుడు అమృతపాల్ సింగ్ అరెస్టును తప్పించుకోగలిగాడు. అయితే అతని సంస్థ 'వారిస్ పంజాబ్ దే'కి చెందిన 78 మందిని పోలీసులు అరెస్ట్ చేయగలిగారు.

ఖలిస్థాన్ వేర్పాటువాద నేత, వారిస్ పంజాబీ డే చీఫ్ అమృతపాల్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ వార్తలు వచ్చాయి. కానీ.. అమృతపాల్ సింగ్ ఇప్పటికీ పరారీలో ఉన్నాడని, అతని జాడ కోసం గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గత సాయంత్రం జలంధర్‌లో బైకుపై వేగంగా వెళ్తున్న అమృతపాల్ సింగ్‌ను పట్టుకోవడానికి భారీ ఆపరేషన్ ప్రారంభించినట్లు వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకూ అతని సంస్థ 'వారిస్ పంజాబ్ దే'కి చెందిన 78 మంది సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు.

మరికొందరిని విచారణ కోసం అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో ఆరు నుంచి ఏడుగురు అమృత్‌పాల్ సింగ్ ముష్కరులు కూడా ఉన్నారని జలంధర్ పోలీస్ కమిషనర్ కుల్దీప్ సింగ్ చాహల్ తెలిపారు. ఈ క్రమంలో ఖలిస్తానీ నేత ఆర్థిక వ్యవహారాలను నిర్వహిస్తున్న అమృతపాల్ సింగ్ సన్నిహితుడు దల్జీత్ సింగ్ కల్సిని కూడా హర్యానాలోని గుర్గావ్‌లో అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఏడు జిల్లాల సిబ్బందితో కూడిన రాష్ట్ర పోలీసు ప్రత్యేక బృందం శనివారం జలంధర్‌లోని షాకోట్ తహసీల్‌కు వెళుతుండగా.. ఖలిస్తానీ నాయకుడి కాన్వాయ్‌ను పోలీసులు అనుసరించారు.

పోలీసులు తమను వెంబడిస్తున్నారని పేర్కొంటూ అతని సహాయకులు సోషల్ మీడియాలో కొన్ని వీడియోలను పంచుకున్నారు. దీంతో షాకోట్‌లో తన మద్దతుదారులను గుమిగూడాలని కోరడంతో అధికారులు అనేక ప్రదేశాల్లో భద్రతను పెంచారు.అలాగే రాష్ట్రంలో ఇంటర్నెట్,SMS సేవలను నిలిపివేశారు. సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారం, పుకార్లు వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి రాష్ట్రంలో సోమవారం మధ్యాహ్నం వరకు ఇంటర్నెట్ సస్పెన్షన్ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. అలాగే.. అమృత్‌సర్‌లోని అమృత్‌పాల్ సింగ్ గ్రామం జల్లుపూర్ ఖైరా వెలుపల కూడా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. శాంతిభద్రతలను కాపాడాలని, ఎలాంటి వివాదాస్పద వీడియోలను షేర్ చేయవద్దని పోలీసులు పౌరులను కోరారు. 

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నేత్రుత్వంలో మార్చి 2న జరిగిన సమావేశంలో అమృతపాల్ సింగ్‌ను అరెస్టు చేసే ప్రణాళికపై హోం మంత్రి అమిత్‌తో చర్చించారని వర్గాలు చెబుతున్నాయి. శనివారం పోలీసులు అతని కోసం వెతకడానికి ముందు కేంద్రం పంజాబ్‌కు అదనపు బలగాలను పంపిందని వర్గాలు తెలిపాయి. అమృతపాల్ సింగ్ , అతని మద్దతుదారులు అతని సహాయకులలో ఒకరిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కత్తులు, తుపాకీలతో పోలీసు స్టేషన్‌లోకి చొరబడి ఆందోళన చేపట్టారు. ఈ ఘర్షణలో ఆరుగురు పోలీసు అధికారులు గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై పంజాబ్ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. 

గత ఏడాది ఫిబ్రవరిలో హత్యకు గురైన నటుడు, కార్యకర్త దీప్ సిద్ధూ ప్రారంభించిన "వారిస్ పంజాబ్ దే" అనే రాడికల్ సంస్థకు అమృత్ పాల్ సింగ్ నాయకత్వం వహిస్తున్నారు. ఖలిస్తాన్ అనుకూల భావజాలాన్ని ప్రోత్సహిస్తూ.. ఆందోళనలు వ్యక్తంచేస్తున్నారు. దీంతో పోలీసులు అతడిపై నిఘా పెట్టారు. అతన్ని అరెస్ట్ చేయాలని పోలీసులకు సవాల్ విసిరాడు. దీంతో పోలీసులు వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్ పాల్.. అతని అనుచరులను జలంధర్‌లో అరెస్ట్ చేశారు. అమృత్ పాల్ అరెస్ట్ నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వంతో కేంద్ర హోం శాఖ సంప్రదింపులు జరిపింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు నిశీతంగా గమనిస్తోంది.