మారుతున్న కాలానికి అనుగుణంగా రెడ్ క్రాస్ సొసైటీ కూడా మరాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుక్ మాండవీయ అన్నారు. పెరుగుతున్న సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సిన అసవరం ఉందని తెలిపారు. 

భారతీయ రెడ్‌క్రాస్ సొసైటీ (ఐఆర్‌సీఎస్) వినూత్న, సహకార వెంచర్‌ల ద్వారా విస్తృత జనాభాను చేరుకోవడానికి తనను తాను మెరుగుప‌ర్చుకోవాల‌ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మ‌న్సుఖ్ మాండ‌వీయ అన్నారు. సమ‌యంతో పాటు ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.

గాంధీ కుటుంబ స‌భ్యులెవ‌రూ కాంగ్రెస్ చీఫ్ కాకూడ‌ద‌ని రాహుల్ గాంధీ నాతో అన్నారు - అశోక్ గెహ్లాట్

సొసైటీ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల లీడర్ షిప్ సమ్మిట్ సమావేశాన్ని ప్రారంభించిన సందర్భంగా గురువారం ఆయన మాట్లాడారు. తనను తాను పునర్నిర్వచించుకోవడానికి వ‌ర్క్ ప్లాన్ రూపొందించుకోవాల‌ని చెప్పారు. మారుతున్న కాలానికి ఐఆర్‌సీఎస్ కూడా మారాల‌ని అన్నారు. ‘‘ ఐఆర్‌సీఎస్ మారుతున్న కాలానికి అనుగుణంగా ఉండకపోతే దాని ఔచిత్యం, గుర్తింపు కోల్పోవచ్చు. ఐఆర్‌సీఎస్ దాని బలాలు, బలహీనతలను ఆత్మపరిశీలన చేసుకోవాలి. కాలానుగుణంగా మారుతున్న పాత్రను స్వీకరించడానికి తనను తాను ఎలా పునర్నిర్వచించుకోవాలనే దానిపై కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలి ” అని ఆయన అన్నారు. 

పీఎప్ఐకి నిధులపై రంగంలోకి ఈడీ: అరెస్టైన వారి బ్యాంకు ఖాతాలపై ఆరా

దీని కోసం నిర్మాణ, సంస్థాగత నిర్మాణాలపై లోతైన అవగాహన అవసరం అని మ‌న్సుఖ్ మాండ‌వీయ అన్నారు. ఐఆర్‌సీఎస్ ప్రాంతీయ కేంద్రాల పనితీరులో క్రమశిక్షణ, నియామకాలలో పారదర్శకత, మెరుగైన ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం, పబ్లిక్ బేస్డ్ కార్యకలాపాలు ఉండాలని సూచించారు. దీని కోసం డిజిటల్ టెక్నాలజీని బాగా ఉపయోగించుకోవాలని అన్నారు. “ ఇతర దేశాల ఆరోగ్య సంరక్షణ నమూనాలను చూసి మేము ఎప్పుడూ సంతోషిస్తున్నాం.’’ అని అన్నారు. 

Rainfall: దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ వీకెండ్ వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు

‘‘ COVID మహమ్మారి మన వ్యవస్థ బ‌లం ఏంటో చూపించింది. ఈ విషయంలో అభివృద్ధి చెందిన దేశాల బలహీనతలను కూడా అందరికీ బహిర్గతం చేసింది. భారతదేశం కోవిడ్‌ను విజయవంతమైన ప్రాంతీయ నమూనాతో నిర్వహించింది. దీంతో పాటు ‘వ్యాక్సిన్ మైత్రి’ కింద మందులు, వ్యాక్సిన్‌లను ఇత‌ర దేశాల‌కు స‌ర‌ఫ‌రా చేసి సాయం అందించింది ’’ అని ఆయన చెప్పారు. 

Hijab Row : ఇరాన్ అధ్యక్షుడికే ఝలక్ ఇచ్చిన మహిళా జర్నలిస్ట్... ఖాళీ కుర్చీ ఫొటోను షేర్ చేస్తూ ట్వీట్..

ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ మానవాళికి అత్యవసర సమయాల్లో, అవసరమైనప్పుడల్లా సాయం చేయడానికి ప్రసిద్ధి చెందిందని మాన్సుక్ మాండవీయ తెలిపారు. కాగా.. స‌మ్మిట్ పై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఐఆర్‌సీఎస్‌ పనితీరును మెరుగుపరిచే మార్గాలు చర్చించడమే ఈ సమావేశం ఉద్దేశమని తెలిపింది.