Asianet News TeluguAsianet News Telugu

గాంధీ కుటుంబ స‌భ్యులెవ‌రూ కాంగ్రెస్ చీఫ్ కాకూడ‌ద‌ని రాహుల్ గాంధీ నాతో అన్నారు - అశోక్ గెహ్లాట్

తమ కుటుంబం నుంచి ఎవరూ కూడా రాబోయే కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టకూడదని రాహుల్ గాంధీ చెప్పారని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు. తాను త్వరలో కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం నామినేషన్ దాఖలు చేస్తానని తెలిపారు. 

Rahul Gandhi told me no Gandhi family member should be Congress chief - Ashok Gehlot
Author
First Published Sep 23, 2022, 12:14 PM IST

గాంధీ కుటుంబం నుంచి ఎవరూ పార్టీ అధ్యక్షుడు కాకూడదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోరు ముదురుతున్న తరుణంలో ఈ వ్యాఖ్య‌లు ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకున్నాయి.

పీఎప్ఐకి నిధులపై రంగంలోకి ఈడీ: అరెస్టైన వారి బ్యాంకు ఖాతాలపై ఆరా

కేరళలో శుక్రవారం మీడియాతో గెహ్లాట్ మీడియాతో మాట్లాడుతూ.. “కాంగ్రెస్ అధ్యక్షుడిగా అందరి ప్రతిపాదనను అంగీకరించాలని నేను అతడిని (రాహుల్ గాంధీని) చాలాసార్లు అభ్యర్థించాను. కానీ గాంధీ కుటుంబం నుండి ఎవరూ తదుపరి చీఫ్‌గా ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు అని ఆయన అన్నారు. తాను త్వరలో ఎన్నికలకు నామినేషన్‌ దాఖలు చేస్తానని గెహ్లాట్‌ తెలిపారు. దేశ ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రతిపక్షాలు బలంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

కాగా.. కాంగ్రెస్ అధ్యక్ష పదవికిి అశోక్ గెహ్లాట్, పార్టీ ఎంపీ శశిథరూర్‌లు రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కమిటీలు సమావేశాలు నిర్వహిస్తున్నాయి, అందులో ‘‘ తదుపరి కాంగ్రెస్ అధ్యక్షుడికి, పీసీసీ, ఏఐసీసీ స‌భ్యుల‌ను నియ‌మించేందుకు మేము అన్ని అధికారాలు ఇస్తున్నాం ’’ అని పేర్కొంటున్నారు. 

Rainfall: దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ వీకెండ్ వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు

పార్టీ మద్దతు ఉన్నప్పటికీ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేయాలనే నిర్ణయంపై రాహుల్ గాంధీ ఇటీవ‌ల వ్యాఖ్య‌లు చేశారు. తన నిర్ణయాన్ని ప్ర‌స్తావిస్తూ ‘‘ నేను (కాంగ్రెస్) అధ్యక్షుడిని అవుతానా లేదా అనేది అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగినప్పుడు స్పష్టంగా తెలుస్తుంది ’’ అని చెప్పారు. 

కన్యాకుమారిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తాను నామినేషన్ దాఖలు చేయకుంటే నాయకత్వానికి ఎందుకు వ్యతిరేకమో అడగాలని, అప్పుడు సమాధానం చెబుతానని అన్నారు. కాగా.. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అక్టోబర్ 17న ఎన్నికలు జరగనుండగా.. అక్టోబర్ 19న కౌంటింగ్ జరగనుంది.

Follow Us:
Download App:
  • android
  • ios