Asianet News TeluguAsianet News Telugu

పీఎప్ఐకి నిధులపై రంగంలోకి ఈడీ: అరెస్టైన వారి బ్యాంకు ఖాతాలపై ఆరా

పీఎఫ్ఐకి నిధుల విషయమై ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. ఎక్కడి నుండి నిధులు వచ్చాయనే విషయమై ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. నిన్న దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. 

Enforcement Directorate Investigation On PFI Funds
Author
First Published Sep 23, 2022, 11:22 AM IST

న్యూఢిల్లీ: పీఎఫ్ఐ సంస్థకు వచ్చిన నిధులపై ఈడీ అధికారులు  ఆరా తీస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఎన్ఐఏ అధికారులు పీఎఫ్ఐతోసంబంధాలు ఉన్నవారి ఇళ్లలో సోదాలు నిర్వహించారు.  దేశంలోని 15 రాష్ట్రాల్లో ఎన్ఐఏ అధికారులు నిన్న సోదాలు నిర్వహించారు. పీఎఫ్ఐతో సంబంధాలున్నవారికి విదేశాల నుండి నిధులు వస్తున్న విషయాన్ని ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. ఈ విషయమై ఈడీ అధికారులు రంగంలోకి దిగి విచారణను ప్రారంభించారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ , తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఉత్తర్ ప్రదేశ్ , రాజస్థాన్, ఢిల్లీ తదితర రాష్ట్రల్లో నిన్న ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. దేశ వ్యాప్తంగా సుమారు 106మందికి పైగా పీఎప్ఐతో సంబంధం ఉన్న వారిని అరెస్ట్ చేశారు ఎన్ఐఏ అధికారులు. పీఎఫ్ఐకి నిధులు ఎక్కడి నుండి వస్తున్నాయనే విషయమై ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. విదేశాల నుండి పీఎఫ్ఐకి నిధులు వస్తున్నాయనే విషయమై ఆరా తీస్తున్నారు. 

దేశంలో ఉగ్రవాదాన్ని పెంచిపోషించేందుకుగాను పీఎఫ్ఐ ప్రయత్నాలు చేస్తుందని ఎన్ఐఏ ఆరోపిస్తోంది.  పీఎఫ్ఐ తో సంబంధం ఉన్న వారికి వచ్చిన నిధుల విషయమై ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఏయే సమయాల్లో ఎక్కడి నుండి  నిధులు  వచ్చాయనే విషయమై ఆరా తీస్తున్నారు. అరెస్టైన పీఎఫ్ఐ కి చెందిన వారి బ్యాంకు ఖాతాలను ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు. 

పీఎఫ్ఐతో సంబంధం  ఉన్న వారి ఇళ్లలో సోదాలు చేసిన సమయంలో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. పలు చోట్ల కంప్యూటర్ల హర్డ్ డిస్కులను ఎన్ఐఏ అధికారులు సీజ్ చేశారు. ఎలక్ట్రిక్ డివైజ్ లతో పాటు మారణాయుధాలను కూడా ఎన్ఐఏ స్వాధీనం చేసుకున్నారు. పీఎఫ్ఐకి హవాలా రూపంలో నిధులు వచ్చాయని ఎన్ఐఏ అనుమానిస్తుంది.ఈ విషయమై ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నలుగురు, తెలంగాణ రాష్ట్రంలో ఒకరిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. తెలంగాణలోని హైద్రాబాద్ చాంద్రాయణగుట్టలోని  పీఎఫ్ఐ కార్యాలయాన్ని సీజ్ చేశారు. పీఎఫ్ఐ కార్యకర్తలు ఎన్ఐఏ సోదాలను తీవ్రంగా వ్యతిరేకించారు. పలు చోట్ల ఎన్ఐఏ సోదాలకు వ్యతిరేకంగా నిరసనకు దిగారు. పీఎప్ఐ కార్యకర్తల అరెస్ట్ ను నిరసిస్తూ కేరళలో నిరసనలు సాగుతున్నాయి. ఈ విషయమై కేరళ హైకోర్టు  సుమోటోగా తీసుకుంది. 

also read:పీఎఫ్‌ఐ కార్యకలాపాలపై ఎన్‌ఐఏ దాడులు‌.. 15 రాష్ట్రాల్లో 100 మందికి పైగా అరెస్ట్‌

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీఎఫ్ఐ కార్యకర్తల ఇళ్లలో సోదాలు నిర్వహించే సమయంలో కూడ నిరసనలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ఉద్దేశ్యపూర్వకంగా తమను  లక్ష్యంగా చేసుకొని సోదాలు నిర్వహిస్తున్నారని  పీఎఫ్ఐ సంస్థ ప్రతినిధులుఆరోపించారు. కొంత కాలం క్రితం నిజామాబాద్ జిల్లాలోని పీఎఫ్ఐకి సంబంధించిన కీలక వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios