Asianet News TeluguAsianet News Telugu

Hijab Row : ఇరాన్ అధ్యక్షుడికే ఝలక్ ఇచ్చిన మహిళా జర్నలిస్ట్... ఖాళీ కుర్చీ ఫొటోను షేర్ చేస్తూ ట్వీట్..

ఇరాన్ లో హిజాబ్ మీద చెలరేగుతున్న వివాదం.. తాజాగా న్యూయార్క్ కు పాకింది. ఈ క్రమంలో ఇరానియన్ మహిళా జర్నలిస్ట్ ఒకరు ఇరాన్ అధ్యక్షుడితోనే తాను హిజాబ్ ధరించనని చెప్పి షాక్ ఇచ్చింది. 

I am not Wear hijab, US journalist told ahead of interview with Iran President
Author
First Published Sep 23, 2022, 12:26 PM IST

న్యూయార్క్ : ఇరాన్ దేశంలో హిజాబ్ పై వివాదం రాజుకున్న నేపథ్యంలో ఓ మహిళా జర్నలిస్టు సాక్షాత్తు ఇరాన్ దేశ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీకి షాకిచ్చారు. ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీలో ప్రసంగించేందుకు ఇబ్రహీం రైసీ న్యూయార్క్ నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా యూఎస్ ఇరానియన్ అయినా సీఎన్ఎన్ చీఫ్ ఇంటర్నేషనల్ యాంకర్ క్రిస్టియానా అమన్ పూర్ కు ఇంటర్వ్యూ ఇచ్చేందుకు ఇరాన్ అధ్యక్షుడు అంగీకరించారు. అయితే ఇంటర్వెల్ కు ముందు  జుట్టును హిజాబ్ తో కప్పి ఉంచుకోవాలని ఇరాన్ అధ్యక్షుడి సహాయకురాలు క్రిస్టియానాకు ఆదేశించింది.

దీంతో  నేను హిజాబ్ ధరించను అని జర్నలిస్ట్ క్రిస్టియానా స్పష్టం చేసింది. హిజాబ్ ధరించడం ఉంటే ఇంటర్వ్యూ జరగదని అధ్యక్షుడు సహాయకురాలు స్పష్టం చేశారు. హిజాబ్ ధరించడం అని జర్నలిస్టు చెప్పడంతో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఇంటర్వ్యూ ఇవ్వకుండానే వెళ్ళిపోయారు. దీంతో జర్నలిస్ట్ క్రిస్టియానా ట్వీట్ లతో పాటు, ఇరాన్ ప్రెసిడెంట్ రైసీ ఇంటర్వ్యూ కోసం ఉంచిన ఖాళీ కుర్చీల ముందు హిజాబ్ లేకుండా కూర్చున్న తన ఫోటోను పోస్టు చేసింది. ‘నన్ను హిజాబ్ ధరించాలని కోరితే దాన్ని మర్యాదగా తిరస్కరించాను. న్యూయార్క్ లో ఉన్నాం, ఇక్కడ హిజాబ్ కు సంబంధించి ఎలాంటి చట్టం లేదా సంప్రదాయం లేదు’  అని బ్రిటిష్ ఇరానియన్ జర్నలిస్ట్ ట్విట్టర్లో రాశారు.

ప్రధాని మోడీ పై పాక్ మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ ప్ర‌శంస‌లు.. ఏమ‌న్నారంటే ?

నేను ఇరాన్ వెలుపల వారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు మునుపటి ఇరాన్ అధ్యక్షులు ఎవరూ హిజాబ్ ధరించాల్సిన  అవసరం లేదనే విషయాన్ని తాను ఎత్తి చూపానని క్రిస్టియానా చెప్పారు. హిజాబ్ పై ఇరాన్ దేశంలో నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో న్యూయార్క్లో సాక్షాత్తూ ఇరానియన్ మహిళా జర్నలిస్టు ఇరాన్ దేశ అధ్యక్షుడుకే ఝలక్ ఇచ్చింది.


 

Follow Us:
Download App:
  • android
  • ios