దాదాపు 45 ఏళ్లుగా యూపీలోని రాంపూర్ అసెంబ్లీ స్థానంపై ఆధిపత్యం చెలాయించిన సమాజ్ వాాదీ పార్టీ సీనియర్ నేత ఆజాంఖాన్ కుటుంబం ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. 1977 తరువాత ఇలా జరగడం ఇదే మొదటి సారి. 

ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. అయితే ఈ నియోజకవర్గంపై సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆజం ఖాన్ కుటుంబానికి పట్టు ఉంది. 1977 నుంచి ఆ కుటుంబానికి చెందిన సభ్యులే ఇక్కడి నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే తాజాగా ఇక్కడ పరిణామాలు అన్నీ మారిపోయాయి. తాజాగా జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఆ కుటుంబం నుంచి ఈ సారి ఎవరూ బరిలో నిలవడం లేదు. ఇలా జరగడం 45 ఏళ్లలో ఇదే మొదటి సారి. 

రెండు పెళ్లిళ్లు, ముగ్గురు పిల్లలు.. మరో వ్యక్తితో సహజీనవం.. పెళ్లిచేసుకోమంటే వదిలేసి పోయాడని.. ఆమె చేసిన పని

రాంపూర్ నుంచి ఆజం ఖాన్ ఎమ్మెల్యేగా ఉండేవారు. అయితే ద్వేషపూరిత ప్రసంగం కేసులో దోషిగా తేలడంతో ఆయన శాసన సభ సభ్యత్వం రద్దయ్యింది. దీంతో ఆ నియోజకవర్గానికి ఎన్నికలు అనివార్యం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉప ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబర్ 5వ తేదీన ఆ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. 

45 ఏళ్లుగా రాంపూర్ స్థానంపై ఆజం ఖాన్ కుటుంబం ఆధిపత్యం చెలాయించింది. అయితే ఈ సారి సమాజ్‌వాదీ పార్టీ తన అభ్యర్థిగా అజంఖాన్ సన్నిహితుడు అసీమ్ రజాను ప్రతిపాదించింది. 1977 నుంచి ఆజం ఖాన్, లేకపోతే ఆయన కుటుంబ సభ్యులు ఈ స్థానం నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు. 1977 నుండి 2022 వరకు ఆజం ఖాన్ 12 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. అందులో 10 సార్లు ఎన్నికల్లో విజయం సాధించారు. రెండు సార్లు మాత్రమే ఓడిపోయారు.

నువ్వు దేవుడురా సామి.... సైకిల్ మీద 9మంది పిల్లలను ఎక్కించుకొని....!

వాస్తవానికి డెబ్బైలు, ఎనభైలలో కాంగ్రెస్ ఆధిపత్యం చెలాయించింది. అయితే 1980 నుంచి 1993 వరకు ఆజం ఖాన్ వరుసగా ఐదుసార్లు రాంపూర్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. 1996లో కాంగ్రెస్ అభ్యర్థి అఫ్రోజ్ అలీఖాన్ చేతిలో ఓడిపోయారు. దీంతో ఆజం ఖాన్‌ను సమాజ్ వాదీ పార్టీ రాజ్యసభకు పంపించింది. తరువాత 2002 నుంచి 2022 వరకు కూడా వరుసగా ఎమ్మెల్యేగా ఐదు సార్లు గెలిచాడు. అయితే 2019లో ఆజం ఖాన్ ఎంపీగా కూడా గెలుపొందారు. దీంతో ఆయన భార్యను రాంపూర్ స్థానం నుంచి పోటీలో దింపారు. ఆ ఎన్నికల్లో ఆమె గెలుపొందారు. అయితే తాజాగా ఆజం ఖాన్‌కు సన్నిహితుడైన అసీమ్ రజా ఈ ఉప ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

ఆజం ఖాన్, అతడి కుటుంబం చట్టపరమైన కేసులను ఎదుర్కొంటోంది. 2014లో అఖిలేష్ యాదవ్ ప్రభుత్వంలో ఆజం ఖాన్ మంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలతో ఆజం ఖాన్ భార్య, ఆయన కుమారుడిపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. తాజాగా విద్వేషపూరిత ప్రసంగం కేసులో స్థానిక కోర్టు ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ఆయన శాసన సభ సభ్యత్వం రద్దయ్యింది.

బస్సు వైపు ఆగ్రహంతో దూసుకొచ్చిన ఏనుగు.. రివర్స్ గేరులో 8 కిలోమీటర్లు వెనక్కి తీసిన డ్రైవర్ (వీడియో)

కాగా.. రాంపూర్ ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థిగా గతంలో ఈ స్థానం నుంచి పోటీ చేసిన ఆకాష్ సక్సేనాను మరోసారి ప్రకటించింది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఎన్నికల్లో ఆజం ఖాన్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఇదిలా ఉండగా.. డిసెంబర్ 5వ తేదీన జరిగే ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 8వ తేదీన వెలువడనున్నాయి.