Asianet News TeluguAsianet News Telugu

బస్సు వైపు ఆగ్రహంతో దూసుకొచ్చిన ఏనుగు.. రివర్స్ గేరులో 8 కిలోమీటర్లు వెనక్కి తీసిన డ్రైవర్ (వీడియో)

కేరళలో అడవిమార్గం గుండా వెళ్లుతున్న ఓ బస్సును ఏనుగు అడ్డుకుంది. ఆ బస్సును వెంటాడటంతో డ్రైవర్ దాన్ని రివర్స్‌లో తీసుకెళ్లాడు. ఇలా 8 కిలోమీటర్ల వరకు వెళ్లితేగానీ ఆ ఏనుగు దాని దారిన అది పోలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
 

wild tusker chased bus for 8 kms in kerala video going viral
Author
First Published Nov 17, 2022, 6:05 AM IST

తిరువనంతపురం: కేరళలో ఓ గజరాజు బస్సును పరుగు పెట్టించింది. అడవి మార్గం గుండా వెళ్లుతున్న బస్సు ముందు హఠాత్తుగా ఓ ఏనుగు ప్రత్యక్షమైంది. పొడవైన దంతాలతో ఉన్న ఆ ఏనుగు ఆగ్రహంతో బస్సు వైపు దూసుకువెళ్లింది. దీంతో ఆ డ్రైవర్‌కు ఏం చేయాలో పాలుపోలేదు. ఎదురుగా బస్సు వైపు వస్తుండటంతో డ్రైవర్ ఆ బస్సును మెల్లగా రివర్స్ గేర్ వేసి వెనక్కి తీశాడు. కానీ, ఆ ఏనుగు అంతటితో వెనక్కి వెళ్లిపోలేదు. ఆ బస్సునే వెంటాడింది. దీంతో బస్సును మరింత వేగంతో వెనక్కి పోనివ్వాల్సి వచ్చింది. అలా ఏకంగా ఎనిమిది కిలోమీటర్లు ఆ బస్సును వెనక్కి తీసుకెళ్లాల్సి వచ్చింది.

కేరళలో చాలకుడి నుంచి వాల్పరాయ్ దారిలో ఈ ఘటన జరిగింది. ఈ రూట్ గుండా 40 మంది ప్రయాణికులతో ఓ బస్సు ప్రయాణిస్తున్నది. ఆ సమయంలో ఓ ఏనుగు దారిపైకి వచ్చి బస్సుకు ఆటంకం కలిగించింది. బస్సును చూసి కాసేపు ఆగి దాని వైపే నడక ప్రారంభించింది. ఆ ఏనుగును తప్పించి ముందుకు వెళ్లే అవకాశం లేదు. దీంతో బస్సు డ్రైవర్ రివర్స్ తీశాడు. కానీ, ఆ గజరాజు ఎంతకు తన దారిన తానను పోవడం లేదు. ఈ బస్సునే వెంటాడింది. బస్సులో డ్రైవర్ సహా ప్రయాణికులందరికీ ముచ్చెమటలు పడ్డాయి. కానీ, వారి ముందు ఉన్న ఏకైక మార్గం బస్సును వెనక్కి వెళ్లనివ్వడమే. ఆ ఏనుగు వెంబడించడం ఆగే వరకు రివర్స్ వెళ్లడమే వారికి ఉన్న అవకాశం. అందుకే ఆ ఏనుగు వెంటాడినంత దూరం బస్సును వెనక్కి పోనిచ్చాడు.

Also Read: హృదయవిదారక ఘటన .. భారీ చెట్టు కూల్చివేత‌.. వంద‌లాది పక్షుల మృత్యువాత‌

దీంతో ఆ రోడ్డు సరిగ్గా లేకున్నా.. ఇరుగ్గా, ఇతర సమస్యలు ఉన్నప్పటికీ బస్సును వెనక్కి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో కొన్ని ఊర్లే దాటేశాడు. దాదాపు 8 కిలోమీటర్ల మేరకు బస్సు వెనక్కి వెళ్లిపోయిన తర్వాత ఓ గ్రామ సమీపానికి రాగానే ఆ ఏనుగు అడవిలోకి వెళ్లిపోయింది. దీంతో బస్సులోని వారంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఆ ఏనుగు పేరు కబాలి అని స్థానికులు చెప్పారు. రెండు సంవత్సరాలుగా ఆ కబాలి ఇక్కడి ప్రజలను వెంటాడుతూనే ఉన్నదని వాపోయారు. 

Follow Us:
Download App:
  • android
  • ios