Asianet News TeluguAsianet News Telugu

రెండు పెళ్లిళ్లు, ముగ్గురు పిల్లలు.. మరో వ్యక్తితో సహజీనవం.. పెళ్లిచేసుకోమంటే వదిలేసి పోయాడని.. ఆమె చేసిన పని

అప్పటికే రెండు పెళ్లిళ్లయిన ఓ మహిళ మరో యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతనితో వెళ్లిపోయి సహజీవనం చేసింది. తీరా అతడిని పెళ్లి చేసుకోమంటే.. అతడేం చేశాడంటే... 

girlfriend sitting in front of boyfriend's house over he abandoned her in bihar
Author
First Published Nov 17, 2022, 10:08 AM IST

బీహార్ : ఆమెకు అప్పటికే రెండు సార్లు వివాహం అయింది. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయినా మరో యువకుడితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. తననే పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి చేసింది. తప్పనిసరి పరిస్థితిలో ఆ యువకుడు తన ప్రియురాలిని బైక్ ఎక్కించుకున్నాడు. మార్గమధ్యలో చేతికి హెల్మెట్ ఇచ్చాడు.  పెట్రోల్ కొట్టించుకుని వస్తానంటూ వెళ్ళాడు. అయితే ఎంతకూ రాకపోవడంతో ఆ మహిళ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

బీహార్ భాగల్పూర్ కు చెందిన మహిళకు కద్వాల్ లోని పచ్ గాచియాకు చెందిన వ్యక్తితో కొన్ని రోజుల క్రితం వివాహమైంది. అయితే కొన్ని నెలల తరువాత మనస్పర్థల కారణంగా అతడిని ఆమె విడిచిపెట్టింది ఈ క్రమంలో 5 ఏళ్ల క్రితం ఖగారియాలోని పస్రాహాలో ఓ రైతుతో రెండో వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇదిలా ఉండగా, రెండేళ్ల క్రితం ధోల్ బజ్జకు చెందిన సంతోష్ అనే వ్యక్తి.. కడ్వా  గ్రామంలో జరుగుతున్న ఆనకట్ట పనుల కోసం వచ్చాడు. ఆ పనులు చేసే క్రమంలో అతడు ఆమెకు పరిచయం అయ్యాడు. భర్త, పిల్లలు ఉన్నారనే విషయాన్ని పక్కన పెట్టి సంతోషంతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. 

బస్సు వైపు ఆగ్రహంతో దూసుకొచ్చిన ఏనుగు.. రివర్స్ గేరులో 8 కిలోమీటర్లు వెనక్కి తీసిన డ్రైవర్ (వీడియో)

కొన్నాళ్ల తర్వాత భర్తను, పిల్లల్ని వదిలేసి.. అతనితో పాటు వెళ్లి వివిధ ప్రదేశాలను మారుస్తూ సహజీవనం సాగించింది. అయితే పది రోజుల క్రితం వారిద్దరి మధ్య గొడవలు తలెత్తాయి. దీంతో సంతోష్ ఆమెను వదిలించుకోవాలని చూశాడు. అయితే, ఆమె మాత్రం తనను పెళ్లి చేసుకోవాలంటూ గొడవ చేయడం మొదలు పెట్టింది. ఈ క్రమంలో స్థానికులు కలగజేసుకుని పంచాయితీ పెట్టించే ప్రయత్నం కూడా చేశారు. దీంతో ప్రియురాలికి ఫోన్ చేసి తనతో పాటు రావాలని చెప్పి బీహారీగంజ్ అనే ప్రాంతానికి తీసుకు వెళ్ళాడు. 

అయితే మార్గ మధ్యలో ఆమెను హెల్మెట్ పట్టుకుని ఉండు, పెట్రోల్ కొట్టించుకుని వస్తానని చెప్పాడు. అది నమ్మిన ఆమె అలాగే నిలబడింది. కానీ ఆ యువకుడు అటు నుంచి అటే ఉడాయించాడు.  దీంతో బాధితురాలు తన ప్రియుడి ఇంటి ఎదుట ధర్నాకు దిగింది.  ఈ క్రమంలో కొందరు పెద్దలు కలగజేసుకుని బాధితురాలి కుటుంబ సభ్యులకు సంతోష్ కుటుంబ సభ్యుల నుంచి కొంత ఆర్థిక సహాయాన్ని అందించారు. దీంతో బాధితురాలిని ఆమె కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకువెళ్లారు. గొడవకు సంబంధించిన సమాచారం అందిందని, దీనిపై ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios