Asianet News TeluguAsianet News Telugu

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నికలు: ఎన్డీఏ అభ్యర్థి హరివంశ్ నారాయణ సింగ్ విజయం

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ గా ఎన్డీఏ అభ్యర్థి హరివంశ్ నారాయణసింగ్ ఎన్నికయ్యారు. ఎన్డీఏ అభ్యర్ధిగా బరిలో నిలిచిన హరివంశ్ నారాయణసింగ్‌కు 125 ఓట్లు వచ్చాయి.కాంగ్రెస్ అభ్యర్ధికి బీకే హరిప్రసాద్‌కు 105 ఓట్లు వచ్చాయి.
 

rajyasabha deputy chairman elections: harivansh singh wins


న్యూఢిల్లీ:  రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ గా ఎన్డీఏ అభ్యర్థి హరివంశ్ నారాయణసింగ్ ఎన్నికయ్యారు. ఎన్డీఏ అభ్యర్ధిగా బరిలో నిలిచిన హరివంశ్ నారాయణసింగ్‌కు 125 ఓట్లు వచ్చాయి.కాంగ్రెస్ అభ్యర్ధికి బీకే హరిప్రసాద్‌కు 105 ఓట్లు వచ్చాయి.

గురువారం నాడు  రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడు  తీర్మానాల ద్వారా రాజ్యసభ డిప్యూటీ  ఛైర్మెన్  ఎన్నికను నిర్వహించారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్ పార్టీకి మద్దతును ప్రకటించింది.టీఆర్ఎస్ మాత్రం ఎన్డీఏకు ఓటేసింది. వైసీపీ మాత్రం ఈ ఎన్నికలకు దూరంగా ఉంది. 

విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా  కాంగ్రెస్ అభ్యర్థి బీకే హరిప్రసాద్, ఎన్డీఏ అభ్యర్థిగా  హరివంశ్ నారాయణసింగ్  పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికలకు ఆప్, వైసీపీ దూరంగా ఉన్నాయి. అధికారపక్షం తరుపున4, విపక్షం తరపున 5 తీర్మానాలు ప్రవేశపెట్టారు. 

మొత్తం 222 మంది సభ్యులు  సభలో ఉన్నారు. ఎన్డీఏ అభ్యర్థికి 125 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థికి 105 వచ్చాయి. తొలుత రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్ ఎన్నికల్లో పొరపాట్లు చోటు చేసుకొన్నాయి. దీంతో మరోసారి రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నికను నిర్వహించారు.

దీంతో ఎంపీలు రెండోసారి ఓట్లు వేశారు.  ఓటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత   రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్‌గా  హరివంశ్ నారాయణ సింగ్ ఎన్నికైనట్టుగా  రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. 

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ గా ఎన్నికైన తర్వాత పలు పార్టీల ఎంపీలు హరివంశ్ నారాయణ సింగ్‌ను అబినందించారు. 

ఈ వార్త చదవండి:కాంగ్రెస్‌కు షాకిచ్చిన ఆప్: రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నికకు దూరం

                             కాంగ్రెస్‌కు విపక్షాలు షాక్: ఎన్డీఏ అభ్యర్థికే ఛాన్స్ 

                               కాంగ్రెస్‌కు షాకిచ్చిన ఆప్: రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నికకు దూరం 

                             రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నికలు: ఓటింగ్‌కు దూరంగా వైసీపీ

Follow Us:
Download App:
  • android
  • ios