Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్‌కు విపక్షాలు షాక్: ఎన్డీఏ అభ్యర్థికే ఛాన్స్

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్  ఎన్నికలు  గురువారం నాడు  జరిగాయి. ఎన్డీఏ అభ్యర్ధిగా జెడి(యూ) ఎంపీ హరివంశ్ నారాయణసింగ్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా బీకే హరిప్రసాద్ పోటీ చేశారు. ఈ ఎన్నికలకు వైసీపీ, ఆప్ ‌లు దూరంగా ఉన్నాయి.
 

Rajya Sabha deputy chairman election:YSR Congress to abstain from voting; BJP issues 3-line whip to MPs


న్యూఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్  ఎన్నికలు  గురువారం నాడు  జరిగాయి. ఎన్డీఏ అభ్యర్ధిగా జెడి(యూ) ఎంపీ హరివంశ్ నారాయణసింగ్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా బీకే హరిప్రసాద్ పోటీ చేశారు. ఈ ఎన్నికలకు వైసీపీ, ఆప్ ‌లు దూరంగా ఉన్నాయి.

ఏపీ రాష్ట్రానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు  నష్టం చేశాయనే ఉద్దేశ్యంతోనే  ఓటింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా  వైసీపీ ప్రకటించింది. మరోవైపు  తమ ప్రతిపాదనలపై కాంగ్రెస్ పట్టించుకోలేదనే  ఆరోపిస్తూ   ఓటింగ్ కు దూరంగా ఉండాలని   ఆప్ నిర్ణయం తీసుకొంది.

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నికలను కాంగ్రెస్, ఎన్డీఏలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి. కాంగ్రెస్ పార్టీ తమ ఎంపీలకు విప్ జారీ చేసింది. రాజ్యసభ ప్రారంభానికి ముందు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా  తమ పార్టీ ఎంపీలకు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నికల సందర్భంగా  అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్ధేశం చేశారు. 


రాజ్యసభలో 244 మంది సభ్యులున్నారు. రాజ్యసభ ఉపాధ్యక్ష పదవి దక్కాలంటే 123 ఎంపీల మద్దతు అవసరం. యూపీఏ అభ్యర్థి బీకే హరిప్రసాద్‌కు టీడీపీ మద్దతు ప్రకటించింది. బీజేడీ, టీఆర్ఎస్‌ పార్టీలు  ఎన్డీఏకు మద్దతు ప్రకటిస్తే 122 మంది సభ్యులు ఎన్డీఏకు వస్తాయి.  అయితే  ఆప్, వైసీపీలు  ఓటింగ్‌కు దూరంగా ఉన్నందున గెలుపుకు అవసరమైన ఓట్ల సంఖ్య తగ్గనుంది. ఈ రెండు పార్టీలు ఓటింగ్‌కు దూరం కావడం కూడ ఎన్డీఏకు పరోక్షంగా కలిసి వచ్చినట్టైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
 

 

Follow Us:
Download App:
  • android
  • ios