రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నికలకు  వైసీపీ దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకొంది.  కాంగ్రెస్, బీజేపీలు ఏపీ రాష్ట్రానికి అన్యాయం చేసినందున  ఈ రెండు పార్టీలకు  మద్దతివ్వకూడదని నిర్ణయం తీసుకొన్నట్టుగా ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రకటించారు.


అమరావతి:రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నికలకు వైసీపీ దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకొంది. కాంగ్రెస్, బీజేపీలు ఏపీ రాష్ట్రానికి అన్యాయం చేసినందున ఈ రెండు పార్టీలకు మద్దతివ్వకూడదని నిర్ణయం తీసుకొన్నట్టుగా ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రకటించారు.

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధికి వ్యతిరేకంగా ఓటు చేయాలని వైసీపీ నిర్ణయం తీసుకొంది. అయితే కాంగ్రెస్ పార్టీ కూడ విపక్షాల తరుపున అభ్యర్థిని బరిలోకి దింపింది. దీంతో వైసీపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులకు ఓటు వేయకూడదని వైసీపీ నిర్ణయం తీసుకొంది.

ఏపీ రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు తాము మద్దతివ్వబోమని రెండు రోజుల క్రితం వైసీపీ ప్రకటించింది. అయితే విపక్షాల అభ్యర్ధికి మద్దతిస్తామని ప్రకటించారు. అయితే యూపీఏ నేతృత్వంలోని అభ్యర్ధికి ఓటు చేస్తామని ప్రకటించారు. అయితే ఆఖరు క్షణంలో ఓటింగ్‌కు దూరంగా దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయం తీసుకొంది.

అయితే యూపీఏ ఉనికి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న విపక్షాల అభ్యర్ధి బరిలో ఉంటే తాము మద్దతిచ్చేవారమని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఏపీకి కాంగ్రెస్, బీజేపీలు నష్టం చేశాయని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చెప్పారు. ఈ కారణంగానే తాము రాజ్యసభ డిప్యూటీ ఎన్నికల్లో ఓటింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకొన్నట్టు ఆయన చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ, టీడీపీ అభ్యర్ధులు మినహా రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నికల్లో పోటీ చేస్తే తాము మద్దతిచ్చే వారమని విజయసాయిరెడ్డి చెప్పారు. ఈ కారణంగానే డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నికల్లో ఓటింగ్ కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకొన్నామని విజయసాయిరెడ్డి చెప్పారు.