Asianet News TeluguAsianet News Telugu

చలితో వణుకుతున్న రాజస్థాన్‌.. ఫతేపూర్‌లో - 4.7, చురులో -2.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు..

రాజస్థాన్ లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. వీపరీతమైన చల్లగాలులు వీస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

Rajasthan shivering with cold..Fatepur - 4.7 degrees, Churu -2.7 degree temperature recorded..
Author
First Published Jan 15, 2023, 4:26 PM IST

రాజస్థాన్‌ రాష్ట్రం మొత్తం చలితో వణికిపోతోంది. విపరీతమైన చల్లగాలులు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. రోజు రోజుకు ఈ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో మైనస్ డిగ్రీలకు పడిపోతోంది. దీంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వృద్ధులు, చిన్నారులు అనారోగ్యాలకు గురువుతున్నారు. 

ఆదివారం ఉదయం రాజస్థాన్ లోని ఫతేపూర్‌లో - 4.7 డిగ్రీల సెల్సియస్‌, అదే రాష్ట్రంలోని చురు ప్రాంతంలో - 2.7 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. పశ్చిమ రాజస్థాన్‌లోని అనేక చోట్ల నేలపై మంచు పేరుకుపోయింది. దీని వల్ల అజ్మీర్, కోటా, ఉదయ్‌పూర్ డివిజన్‌లలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయానని వాతావరణ శాఖ ప్రతినిధి తెలిపారు.

ఎన్సీపీ ఎంపీ సూప్రియా సూలే చీరకు అంటుకున్న మంటలు.. తప్పిన పెను ప్రమాదం..

చిత్తోర్‌గఢ్‌లో - 1.4 డిగ్రీలు, సికార్‌లో - 0.5 డిగ్రీలు, భిల్వారాలో - 0.6 డిగ్రీలు, బికనీర్‌లో 1.2 డిగ్రీలు, పిలానీలో 1.6 డిగ్రీలు, బరాన్‌లో 1.7 డిగ్రీలు, సంగరియాలో 1.8 డిగ్రీలు నమోదయ్యాయని ఐఎండీ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో ఆదివారం కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువగా నమోదైందని తెలిపింది. రాష్ట్ర రాజధాని జైపూర్‌లో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రత వరుసగా 19.5,5.6 డిగ్రీలుగా నమోదైందని పేర్కొంది. 

ఇదిలా ఉండగా వాయువ్య భారతదేశంలో నేటి నుంచి దట్టమైన పొగమంచు, చలి పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే అనేక ప్రాంతాల్లో మూడు రోజుల పాటు వాయువ్య భారతదేశంలోని అనేక ప్రాంతాలలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని అంచనా వేసింది. నేటి నుంచి 18వ తేదీ వరకు రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలలో, జనవరి 16,17 తేదీలలో పంజాబ్, హర్యానా-చండీగఢ్ రాష్ట్రాల్లో, జనవరి 16, 18 తేదీలలో ఢిల్లీలో తీవ్రమైన చలిగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.

మన సైన్యాన్ని చూసి ప్రతి భారతీయుడు గర్వపడుతున్నాడు: ఆర్మీ డే సందర్భంగా ప్రధాని మోడీ

నేటి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ మీదుగా వివిక్త పాకెట్లలో కూడా ఉష్ణోగ్రతలు పడిపోతాయని ఐఎండీ పేర్కొంది. జనవరి 16, 17 తేదీల్లో పశ్చిమ మధ్యప్రదేశ్, జనవరి 17, 18 తేదీల్లో పశ్చిమ ఉత్తరప్రదేశ్, నేడు కర్ణాటకలో చల్లగాలులు వీస్తాయని తెలిపింది. 

తమిళుల మనోభావాలను గౌరవించడం నేర్చుకోండి - గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిపై డీఎంకే కనిమొళి ఆగ్రహం

దేశంలోని ప‌లు ప్రాంతాల‌తో పాటు ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్)లో ఆదివారం నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుతాయని భార‌త వాతావరణ శాఖ (ఐఎండీ) ముందుగానే అంచనా వేసింది. సోమవారం నుంచి బుధవారం వరకు ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో చలిగాలులు వీచే అవకాశం ఉందనీ, అయానగర్, రిడ్జ్ వద్ద కనిష్ఠ ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్ర‌స్తుత వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు దృష్ట్యా ప్రజలు తమ బహిరంగ కార్యకలాపాలను పరిమితం చేసుకోవాల‌ని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాగా నేటి ఉదయం మొత్తం ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. దీంతో రోడ్లపై వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios