Asianet News TeluguAsianet News Telugu

తమిళుల మనోభావాలను గౌరవించడం నేర్చుకోండి - గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిపై డీఎంకే కనిమొళి ఆగ్రహం

తమిళనాడు రాష్ట్రంలో ఉండే గవర్నర్ ఎవరైనా తమిళుల మనోభావాలను గౌరవించాలని డీఎంకే ఎంపీ కనిమొళి అన్నారు. భారత రాష్ట్రపతి ప్రతినిధి ఎవరైనా ఈ విషయాన్ని గ్రహించాలని ఆమె సూచించారు.

Learn to respect Tamil sentiments -  DMK Kanimozhi is angry with Governor RN Ravi
Author
First Published Jan 15, 2023, 2:45 PM IST

తమిళనాడు గవర్నర్ పై డీఎంకే ఎంపీ కనిమొళి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ ఎవరైనా తమిళనాడులో ఉన్న సమయంలో తమిళుల మనోభావాలను గౌరవించాల్సిందేనని ఆమె విరుచుకుపడ్డారు. తమిళులను బాధపెట్టడం వల్ల అభిప్రాయ భేదాలు ఏర్పడతాయని ఆమె నొక్కి చెప్పారు.

రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోం - బీఎస్పీ అధినేత్రి మాయావతి

తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిపై డీఎంకే నేత శివాజీ కృష్ణమూర్తి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై వివాదం చెలరేగిన నేపథ్యంలో కనిమొళి ఈ విధంగా మాట్లాడారు. ప్రజల గురించి అగౌరవంగా మాట్లాడేవారిని పార్టీ ప్రోత్సహించదని స్పష్టం చేశారు. ‘‘ కానీ పేరు మార్చడానికి ప్రయత్నించడం లేదా మా సొంత రాష్ట్రాన్ని ఏమని పిలవాలో చెప్పడం ద్వారా ప్రజలు తమిళుల మనోభావాలను దెబ్బతీయలేరు. భారత రాష్ట్రపతి ప్రతినిధి ఎవరైనా ఈ విషయాన్ని గ్రహించాలి’’ అని ఆమె అన్నారు.

ఒక రాష్ట్రంలో ఉన్నప్పుడు అక్కడి ప్రజల మనోభావాలను గౌరవించాలని, లేకపోతే దానిని నేర్చుకోవాలని కనిమొళి వ్యాఖ్యానించారు. మమ్మల్ని దెబ్బతీయాలనుకుంటూ భిన్నాభిప్రాయాలను సృష్టిస్తున్నారని తెలిపారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి అసెంబ్లీలో తన ప్రసంగంలోని కొన్ని భాగాలను దాటవేయడంపై రాష్ట్రానికి చెందిన కొందరు నాయకులు రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించడంపై కనిమొళి స్పందిస్తూ.. ‘‘ కొంతమంది ఎంపీలు, ఫ్లోర్ లీడర్ టీఆర్ బాలు పార్టీకి ప్రాతినిధ్యం వహించారు. తప్పకుండా చర్యలు తీసుకుంటారని మేము ఆశిస్తున్నాము’’ అని అన్నారు.

కన్నీటి సాగు.. ఒక్క మరఠ్వాడలోనే 2022లో 1,023 మంది రైతు ఆత్మహత్యలు

కాగా.. గవర్నర్‌పై దుర్భాషలాడి, పరువు నష్టం కలిగించేలా మాట్లాడిన డీఎంకే నేత శివాజీ కృష్ణమూర్తిని వెంటనే అరెస్ట్ చేయాలని తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలై రాష్ట్ర పోలీసు చీఫ్ సి.శైలేంద్రబాబును కోరారు. అయితే శివాజీ కృష్ణమూర్తిని డీఎంకే సస్పెండ్ చేసింది. పార్టీ కార్యకలాపాలను ఉల్లంఘించినందుకు ఆయన నుంచి అన్ని బాధ్యతలను ఉపసంహరించుకుంది.

Follow Us:
Download App:
  • android
  • ios