Asianet News TeluguAsianet News Telugu

మన సైన్యాన్ని చూసి ప్రతి భారతీయుడు గర్వపడుతున్నాడు: ఆర్మీ డే సందర్భంగా ప్రధాని మోడీ

New Delhi: భారత సైన్యం మొదటి కమాండర్ ఇన్ చీఫ్ - జనరల్ (తరువాత ఫీల్డ్ మార్షల్) కె.ఎం.కరియప్ప సాధించిన విజయాలకు గుర్తుగా భారతదేశం ప్రతి సంవత్సరం జనవరి 15న సైనిక దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ రోజున, 1947 యుద్ధంలో భారత దళాలను విజయం వైపు నడిపించిన కరియప్ప, 1949 లో చివరి బ్రిటిష్ కమాండర్-ఇన్-చీఫ్ జనరల్ సర్ ఎఫ్ఆర్ఆర్ బుచర్ నుండి భారత సైన్యం  కమాండ్ అధికారాల‌ను స్వీకరించారు.
 

Every Indian is proud of our army: PM Modi Narendra  on Army Day
Author
First Published Jan 15, 2023, 3:12 PM IST

Army Day-Narendra Modi: ఆర్మీ డే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం భారత సైన్యాన్ని ప్రశంసించారు. సైనికులు ఎల్లప్పుడూ మన దేశాన్ని సురక్షితంగా ఉంచారని, సంక్షోభ సమయాల్లో వారి సేవలకు విస్తృతంగా ప్రశంసలు లభిస్తాయని అన్నారు.భారత సైన్యం మొదటి కమాండర్ ఇన్ చీఫ్ - జనరల్ (తరువాత ఫీల్డ్ మార్షల్) కె.ఎం.కరియప్ప సాధించిన విజయాలకు గుర్తుగా భారతదేశం ప్రతి సంవత్సరం జనవరి 15న సైనిక దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ రోజున, 1947 యుద్ధంలో భారత దళాలను విజయం వైపు నడిపించిన కరియప్ప, 1949 లో చివరి బ్రిటిష్ కమాండర్-ఇన్-చీఫ్ జనరల్ సర్ ఎఫ్ఆర్ఆర్ బుచర్ నుండి భారత సైన్యం  కమాండ్ అధికారాల‌ను స్వీకరించారు.

 

ప్ర‌తి భార‌తీయుడు మ‌న సైన్యాన్ని చూసి ప్ర‌తి భార‌తీయుడు గ‌ర్వ‌ప‌డుతున్నాడ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్నారు. 'ఆర్మీ డే సందర్భంగా సైనికులందరికీ, అనుభవజ్ఞులకు, వారి కుటుంబాలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి భారతీయుడు మన సైన్యాన్ని చూసి గర్వపడుతున్నాడు" అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. వారు ఎల్లప్పుడూ మన దేశాన్ని సురక్షితంగా ఉంచారని, సంక్షోభ సమయాల్లో వారి సేవలకు విస్తృతంగా ప్రశంసలు లభిస్తాయని ఆయన అన్నారు.

సైన్యం ధైర్యానికి, శౌర్యానికి సెల్యూట్.. 

ఆర్మీ డే సంద‌ర్భంగా భారత ఆర్మీ సిబ్బందికి, వారి కుటుంబాలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ శుభాకాంక్షలు తెలిపారు. "వారి అసమాన ధైర్యానికి, శౌర్యానికి, త్యాగాలకు-సేవకు దేశం సెల్యూట్ చేస్తుంది. భారతదేశాన్ని సురక్షితంగా, శాంతియుతంగా ఉంచడానికి భారత సైన్యం చేస్తున్న ప్రయత్నాలకు మేము గర్విస్తున్నాము" అని పేర్కొన్నారు. 

 

 

జ‌న‌వ‌రి 15న ఎందుకు ఇండియ‌న్ ఆర్మీ డే ను జ‌రుపుకుంటారు..? 

భారత సైన్యం మొదటి కమాండర్ ఇన్ చీఫ్ - జనరల్ (తరువాత ఫీల్డ్ మార్షల్) కె.ఎం.కరియప్ప సాధించిన విజయాలకు గుర్తుగా భారతదేశం ప్రతి సంవత్సరం జనవరి 15న సైనిక దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ రోజున, 1947 యుద్ధంలో భారత దళాలను విజయం వైపు నడిపించిన కరియప్ప, 1949 లో చివరి బ్రిటిష్ కమాండర్-ఇన్-చీఫ్ జనరల్ సర్ ఎఫ్ఆర్ఆర్ బుచర్ నుండి భారత సైన్యం  కమాండ్ అధికారాల‌ను స్వీకరించారు. స్వతంత్ర భారతదేశ మొదటి భారతీయ కమాండర్-ఇన్-చీఫ్ గా అయ్యారు. కరియప్పను, రక్షణ దళాలను గౌరవించడానికి ప్రతి సంవత్సరం ఆర్మీ డే జరుపుకుంటాయి. 

జనవరి 15న జరిగే ఆర్మీ డే పరేడ్ లో ఎనిమిది కవాతు బృందాలు పాల్గొంటాయి. గ‌తేడాదివరకు ఢిల్లీలోని కరియప్ప పరేడ్ మైదానంలో ప్రధాన ఆర్మీ డే పరేడ్ నిర్వహించేవారు. అక్కడ ఆర్మీ చీఫ్ లు భారత సైన్యానికి నివాళులు అర్పించారు. ఆర్మీ డే పరేడ్ భారత సైన్యం ఇన్వెంటరీలో ఉన్న వివిధ ఆయుధ వ్యవస్థల పరిణామాన్ని ప్రదర్శిస్తుంది. సైనికులకు శౌర్య పురస్కారాలు, సేన పతకాలతో ఈ రోజును గౌర‌వ స‌త్కారాలు చేస్తారు.

Follow Us:
Download App:
  • android
  • ios