Asianet News TeluguAsianet News Telugu

ఎన్సీపీ ఎంపీ సూప్రియా సూలే చీరకు అంటుకున్న మంటలు.. తప్పిన పెను ప్రమాదం..

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ కుమార్తె, ఆ పార్టీ ఎంపీ సుప్రియా సూలే‌కు పెను ప్రమాదం తప్పింది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న సూప్రియా సూలే చీరకు మంటలు అంటుకున్నాయి. అయితే మంటను సకాలంలో ఆర్పివేయడంతో ప్రమాదం తప్పింది.

NCP MP Supriya Sule saree catches fire at event in pune and she says I am safe
Author
First Published Jan 15, 2023, 4:06 PM IST

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ కుమార్తె, ఆ పార్టీ ఎంపీ సుప్రియా సూలే‌కు పెను ప్రమాదం తప్పింది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న సూప్రియా సూలే చీరకు మంటలు అంటుకున్నాయి. అయితే మంటను సకాలంలో ఆర్పివేయడంతో ప్రమాదం తప్పింది. తాను క్షేమంగా ఉన్నానని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సుప్రియా సూలే ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలు.. సూప్రియా సూలే ఆదివారం మహారాష్ట్ర పూణెలోని హింజావాడిలో కరాటే పోటీని ప్రారంభించే కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ప్రారంభించడంలో భాగంగా వేదికపై టేబుల్‌ మీద ఉంచిన ఛత్రపతి శివాజీ మహారాజ్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 

సూప్రియా టేబుల్ దగ్గరికి వెళ్లగానే అక్కడున్న దీపానికి ఆమె చీర తగిలి మంటలు అంటుకున్నాయి. అయితే మంటలు పెద్దవి కాకముందే ఆమె తన చేతులతో దానిని ఆర్పివేశారు. ఈ ఘటనతో అక్కడ కాసేపు గందరగోళం నెలకొంది. సూప్రియా మంటలను ఆర్పుతున్నట్లుగా కనిపిస్తున్న వీడియో వైరల్‌గా మారింది.

‘‘కరాటే పోటీల ప్రారంభోత్సవంలో.. నా చీరకు ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. అయితే సకాలంలో మంటలు ఆర్పివేయబడ్డాయి. నేను క్షేమంగా ఉన్నందున ఆందోళన చెందవద్దని శ్రేయోభిలాషులు, పౌరులు, పార్టీ కార్యకర్తలు, నాయకులందరినీ అభ్యర్థిస్తున్నాను’’ అని సూపప్రియా సూలే పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios