కరడుగట్టిన కాంగ్రెస్ వాదిగా గుర్తింపు తెచ్చుకున్న గ్వాలియర్ రాజవంశీయుడు జ్యోతిరాదిత్య సింధియా ఆ పార్టీని వీడి బీజేపీలో చేరడంతో దేశ రాజకీయాలను ఒక కుదుపు కుదిపింది. సింధియా నిర్ణయం అసలే కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీని పాతాళంలోకి నెట్టింది.

సరిగ్గా ఇదే సమయంలో కాంగ్రెస్‌లో మరో యువనేత, రాజస్ధాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ సింధియా వ్యవహారంపై స్పందిస్తూ ట్వీట్ చేశారు. జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ను వీడటం దురదృష్టకరమన్న సచిన్ పార్టీలో ఉన్న అన్ని సమస్యలు పరస్పరం సహకరించుకోవాలని ఆకాంక్షించారు.

Also Read:సింథియా రాజీనామా: సచిన్ పైలట్ వ్యాఖ్యలపై నగ్మా సంచలనం

ఆయన ట్వీట్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న గ్రూపు తగాదాలను తెలుపుతోంది. కాగా సచిన్ పైలట్‌ రాజస్ధాన్‌లోని సొంత ప్రభుత్వంపై గతంలో సంచలన విమర్శలు చేశారు.

జేకే లోన్ ప్రభుత్వాసుపత్రిలో వందమంది శిశువులు మరణించిన ఘటనపై స్పందించిన పైలట్.. చిన్నారుల మరణానికి మనమే బాధ్యత వహించాలన్నారు. ప్రతి దానికీ గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కూర్చుంటే సరిపోదని ఆయన వ్యాఖ్యానించడం అప్పట్లో కలకలం రేపింది.

Also Read:మధ్యప్రదేశ్‌ సంక్షోభం: కమల్‌నాథ్ సర్కార్‌కు 16న బలపరీక్ష..?

రాజస్ధాన్‌లో చాలా ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన సచిన్ పైలట్‌కు పార్టీలో సరైన ప్రాధాన్యత లేదనే వాదనలు వినిపిస్తున్నాయి,

దీనికి తోడు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌తో సచిన్ పైలట్‌కు కోల్డ్ వార్ జరుగుతోంది. వీరిద్ధరి మధ్య విభేదాలను ఉపయోగించుకుని భారతీయ జనతా పార్టీ రాజస్థాన్‌లోనూ ఆపరేషన్ కమల్‌ను స్టార్ట్ చేయవచ్చునని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.