జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ను వీడి బీజేపీ తీర్ధం పుచ్చుకోవడంతో పాటు తన పాటు మరో 20 మంది ఎమ్మెల్యేలను లాక్కెళ్లిపోవడంతో మధ్యప్రదేశ్‌లోని కమల్‌నాథ్ సర్కార్‌ సంక్షోభంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే.

తమకు పూర్తి స్థాయి సభ్యుల బలం ఉందని కమల్ చెబుతున్న నేపథ్యంలో ఆయన ప్రభుత్వానికి ఈ నెల 16న బలపరీక్ష నిర్వహించాలని రాష్ట్ర గవర్నర్‌ను కోరనున్నట్లు బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ చీఫ్ నరోత్తమ్ మిశ్రా తెలిపారు. కాగా గురువారం నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

Also Read:ఒకప్పటిలా లేదు.. నా కలలన్నీ కల్లలయ్యాయి: కాంగ్రెస్‌పై సింధియా వ్యాఖ్యలు

ప్రస్తుతం 22 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు గవర్నర్, స్పీకర్ వద్ద ఉన్నాయని దీనిపై వారు ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని నరోత్తమ్ చెప్పారు. మధ్యప్రదేశ్‌లో సంక్షోభంపై మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ గురువారం రాత్రి గవర్నర్‌ను కలిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

మరోవైపు రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు తన ముందు హాజరవ్వాలని ఎన్‌పీ ప్రజాపతి ఆదేశించారు. వారు స్వచ్ఛందంగానే పదవుల నుంచి వైదొలిగారా..? ఒత్తిడితో రాజీనామా చేశారా..? అనేది తెలిపాల్సి ఉంటుందన్నారు.

Also Read:మధ్యప్రదేశ్ రాజకీయాల్లో బుడతడి సంచలనం.. ఈ బుడ్డోడు కూడా ఎమ్మెల్యేనా?

228 సభ్యులున్న మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 114 కాగా.. నలుగురు స్వతంత్రులు, ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేలు, ఒక ఎస్పీ ఎమ్మెలో్యే ఉన్నారు. ఒకవేళ స్పీకర్ కనుక 22 మంది రాజీనామాలను ఆమోదిస్తే అప్పుడు రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య 206కు చేరుకుంటుంది.

అప్పుడు కాంగ్రెస్ బలం 92కి చేరుతుంది. ఈ నేపథ్యంలో అధికారం అందుకోవడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 104. దీంతో 107 మంది సభ్యుల బలంతో బీజేపీ అధికారం కైవసం చేసుకుంటుంది. ప్రస్తుతం కమల్‌నాథ్‌కు మద్ధతుగా వున్న స్వతంత్రులు, ఎస్పీ, బీఎస్పీ సభ్యులు కూడా బీజేపీకి మద్ధతుగా నిలిచే అవకాశం కనిపిస్తోంది.