Asianet News TeluguAsianet News Telugu

రాహుల్ గాంధీ ప్రధానిగా బాధ్యతలు తీసుకుంటే తొలి నిర్ణయం ఇదే..! రాహుల్ సమాధానమిదే

రాహుల్ గాంధీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు తీసుకుంటే తొలి నిర్ణయం ఏం తీసుకుంటారని, ఏ ఆదేశాలను వెలువరిస్తారని వేసిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. తన తొలి నిర్ణయం మహిళలకు రిజర్వేషన్ అని వెల్లడించారు. తమిళనాడు స్కూల్ నుంచి ఢిల్లీ వెళ్లిన ఓ బృందం రాహుల్ గాంధీతో చిట్ చాట్ చేసింది. ఆ వీడియోను రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో పోస్టు చేశారు.
 

rahul gandhis first decision as prime minister would be women reservation
Author
New Delhi, First Published Nov 7, 2021, 12:42 PM IST

న్యూఢిల్లీ: Congress మాజీ అధ్యక్షుడు Rahul Gandhi ప్రధాన మంత్రిగా బాధ్యతలు తీసుకుంటే తొలి నిర్ణయం ఏం తీసుకుంటారు? ఈ ప్రశ్న నేరుగా ఆయన ముందే ప్రస్తావించారు. దీనికి రాహుల్ గాంధీ సమాధానమిచ్చారు. తాను Prime Ministerగా బాధ్యతలు తీసుకుంటే తొలి Decisionగా మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తానని వెల్లడించారు. ఇంకా పలు కీలక ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

రాహుల్ గాంధీ ఈ ఏడాది తొలినాళ్లలో తమిళనాడు‌లో క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా ఆయన కన్యాకుమారి జిల్లా ములగుమూడులోని సెయింట్ జోసెఫ్ హైయర్ సెకండరీ స్కూల్‌కు వెళ్లారు. అక్కడ పుష్ అప్స్ తీసి అందరినీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. విద్యార్థులతో సన్నిహితంగా మాట్లాడారు. తాజాగా, ఆ స్కూల్ నుంచే కొందరు రాహుల్ గాంధీని కలవడానికి ఢిల్లీ వెళ్లారు. దీపావళి సందర్భంగా ఆ బృందంతో రాహుల్ గాంధీ చిట్ చాట్ చేశారు. ఆ వీడియోను రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

వారి రాక ఈ దీపావళి వేడుకను మరింత ఉజ్వలం చేసిందని, ప్రత్యేకతను తెచ్చిందని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఇలాంటి విభిన్న సంస్కృతే మన దేశ బలమని పేర్కొన్నారు. దీన్ని కచ్చితంగా కాపాడి తీరాలని వివరించారు. ఈ వీడియోలో బృంద సభ్యులు రాహుల్ గాంధీని ప్రశ్నలు వేశారు. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అయ్యాక తొలి నిర్ణయం ఏం తీసుకుంటారని, ఏ ఆదేశాలను వెలువరిస్తారని అడిగారు. దానికి రాహుల్ గాంధీ సమాధానమిచ్చారు. దానికి సమాధానంగా తాను Women Reservation ఇస్తామని కేరళ వయానాడు ఎంపీ రాహుల్ గాంధీ వివరించారు.

Also Read: జైల్లో ఆర్యన్ ఖాన్: షారుఖ్‌కు రాహుల్ లేఖ, ఇప్పుడు వెలుగులోకి.. ఏం రాశారంటే..?

రాహుల్ గాంధీ ఆయన పిల్లలకు ఏ విషయాలను బోధిస్తారని ఇంకొకరు ప్రశ్నించారు. నేను నా పిల్లలకు ఏం నేర్పుతారని ఎవరు అడిగినా వారికి ఓ సమాధానమిస్తాను. వారికి వినయాన్ని నేర్పుతానని కచ్చితంగా చెబుతాను. ఎందుకంటే వినయం ద్వారానే అన్ని విషయాలను అర్థం చేసుకోవడం సాధ్యమవుతుందని తెలిపారు.

ప్రియాంక గాంధీ వాద్రా, రాహుల్ గాంధీ రైతుల ఆందోళనలకు మద్దతునివ్వడాన్ని ఒకరు ప్రశంసించారు. ప్రజలతో వారు మమేకమైన తీరును ఇది విశదపరుస్తున్నదని వివరించారు. ప్రస్తుతం జరుగుతున్న రైతు ఆందోళనలకు వారు మద్దతు ఇవ్వడం అభినందనీయం అని అభిప్రాయపడ్డారు.

మాట్లాడుతుండగానే ఆకస్మికంగా డిన్నర్ ప్లాన్ చేశారు. రాహుల్ గాంధీ అధికారిక నివాసంలో ఛోలే భాతుర్‌ను అతిథులతో కలిసి రాహుల్ గాంధీ తిన్నారు. తమిళనాడు స్కూల్ నుంచి వెళ్లిన బృందంతో ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఇంటరాక్ట్ అయ్యారు. దీపావళి శుభాకాంక్షలు చెబుతున్నప్పుడూ వారితో కలిసే ఉన్నారు.

Also Read: ‘నాకేమైనా జరిగితే ఏడవొద్దు..’ ఉద్వేగపూరిత వీడియోతో ఇందిరా గాంధీకి రాహుల్ నివాళి

2024లో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ సారి కచ్చితంగా మెజార్టీ సాధించి కేంద్రంలో అధికారాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ సంకల్పించింది. కానీ, బీజేపీ కూడా తగిన వ్యూహాలను ఇప్పటికే అమలు జరుపుతున్నది. 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ తర్వాతి ఎన్నికలు 2019లోనూ అఖండ మెజార్టీతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నరేంద్ర మోడీ సారథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ రెండు సార్లు అజేయంగా నిలిచింది.

Follow Us:
Download App:
  • android
  • ios