Asianet News TeluguAsianet News Telugu

జైల్లో ఆర్యన్ ఖాన్: షారుఖ్‌కు రాహుల్ లేఖ, ఇప్పుడు వెలుగులోకి.. ఏం రాశారంటే..?

బాలీవుడ్ (bollywood) సూపర్‌స్టార్ షారుక్ ఖాన్‌కు (shahrukh khan) కాంగ్రెస్ (congress) అగ్రనేత రాహుల్ గాంధీ (rahul gandhi) లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది. షారుక్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ (aryan khan) .. ఎన్‌సీబీ కస్టడీలో ఉన్న సమయంలో రాహుల్ లేఖ రాసినట్లు తెలుస్తోంది

shahrukh khan Received Letter From Rahul Gandhi On Son Aryans Arrest
Author
Mumbai, First Published Nov 3, 2021, 7:34 PM IST

బాలీవుడ్ (bollywood) సూపర్‌స్టార్ షారుక్ ఖాన్‌కు (shahrukh khan) కాంగ్రెస్ (congress) అగ్రనేత రాహుల్ గాంధీ (rahul gandhi) లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది. షారుక్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ (aryan khan) .. ఎన్‌సీబీ (ncb) కస్టడీలో ఉన్న సమయంలో రాహుల్ లేఖ రాసినట్లు తెలుస్తోంది. ‘‘ ఇలాంటి కఠిన సమయంలో దేశం మొత్తం షారుక్‌కు అండగా ఉంది’’ అని రాహుల్ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. దీనిని రాహుల్ అక్టోబర్ 14న రాసినట్లుగా సమాచారం. 

కాగా.. ముంబై నుంచి గోవా వెళ్తున్న క్రూయిజ్ షిప్‌లో రైడ్ చేసిన ఎన్సీబీ అధికారులు డ్రగ్స్‌ వినియోగించిన ఆరోపణలపై ఆర్యన్‌ ఖాన్‌తో పాటుగా మరికొందరిని అరెస్ట్ చేశారు. అక్టోబర్ 3వ తేదీన వీరి అరెస్ట్‌ను ఎన్సీబీ ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే (sameer wankhede) ధ్రువీకరించారు. దీంతో ఒక్కసారిగా షారుఖ్ అభిమానుల్లో, బాలీవుడ్‌లో కలకలం రేగింది. అయితే ఆర్యన్ ఖాన్ తరఫు లాయర్లు మాత్రం.. అతడు డ్రగ్స్ వినియోగించలేదని, అందుకు ఎలాంటి వాదనలు కోర్టులో వాదనలు వినిపించారు. తొలుత కోర్టు ఆర్యన్‌ ఖాన్‌కు అక్టోబర్ 7 వరకు కస్టడీ విధించింది. ఆ తర్వాత మరో 14 రోజుల పాటు కస్టడీకి ఆదేశించింది. దీంతో అక్టోబర్ 8న ఆర్యన్ ఖాన్ ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలుకు తరలించారు. ఇక, ఆర్యన్ తరఫున దాఖలైన బెయిల్ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది.

Also Read:ఫలించిన 23 రోజుల నిరీక్షణ.. ఆర్యన్ ఖాన్‌కు ఊరట, బెయిల్ మంజూరు చేసిన బాంబే హైకోర్ట్

అక్టోబర్ 26న బాంబే హైకోర్టులో (bombay high court) ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఆర్యన్ తరఫున సీనియర్ లాయర్లు ముకుల్ రోహత్గీ (mukul rohatgi) , సతీశ్ మానెశిందే వాదనలు వినిపించారు. మరుసటి రోజు కూడా కోర్టులో వాదనలు జరిగాయి. ఆ తర్వాత ఎన్సీబీ తరఫు న్యాయవాదులు కూడా కోర్టుకు వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే గత గురువారం బాంబే కోర్టు ఆర్యన్ ఖాన్‌తో సహా నిందితులుగా మరో ఇద్దరికి బెయిల్ మంజూరు చేసింది. దీంతో షారుఖ్ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.

ఆర్యన్ ఖాన్ బెయిల్ ప్రక్రియ పూర్తి చేయడంలో బాలీవుడ్ నటి జూహీ చావ్లా (juhi chawla) కీలక భూమిక పోషించారు. ఆర్యన్‌కు బెయిల్‌ కోసం ఆమె పూచీకత్తు ఇచ్చారు. శుక్రవారం ముంబై సెషన్‌ కోర్టుకు వెళ్లారు. అక్కడ ఆర్యన్‌ బెయిల్‌కు పూర్తి బాధ్యత వహిస్తూ లక్ష రూపాయల బాండ్‌ పేపర్లపై సంతకం చేశారు. అయితే గత శనివారం ఉదయం బెయిల్ ప్రక్రియ పూర్తికావడంతో అర్థర్‌ రోడ్‌ జైలు అధికారులు ఆర్యన్ ఖాన్‌ను విడుదల చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios