ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా రాహుల్ గాంధీ ఉద్వేగపూరిత వీడియోను యూట్యూబ్‌లో షేర్ చేశారు. తన మరణానికి రెండు మూడు గంటల ముందు తనకేమైనా జరిగితే ఏడవొద్దు అని చెప్పినట్టు రాహుల్ గాంధీ గుర్తుచేసుకున్నారు. ఆమె మరణాన్ని ఆమె ముందుగానే పసిగట్టినట్టు అర్థమవుతున్నదని వివరించారు.  

న్యూఢిల్లీ: దివంగత ప్రధాని Indira Gandhi వర్ధంతి సందర్భంగా Congress మాజీ అధ్యక్షుడు Rahul Gandhi ఉద్వేగపూరిత వీడియో షేర్ చేశారు. ఇందిరా గాంధీ అంత్యక్రియలకు సంబంధించిన క్లిప్స్ అందులో ఉన్నాయి. తనకేమైనా జరిగితే ఏడవొద్దు అని నానమ్మ ఇందిరా గాంధీ సూచించినట్టు రాహుల్ గాంధీ గుర్తు తెచ్చుకున్నారు. ఈ మాట అన్న రెండు మూడు గంటల తర్వాతే ఆమె చనిపోయారని, అందుకే తాను ముఖాన్ని దాచుకుంటూ ఏడ్చాననీ వీడియోలో చెప్పారు.

ఇదే రోజున 1984న ఇందిరా గాంధీ హత్యగావించబడ్డారు. ఆమె వర్ధంతి సందర్భంగా ఆమె మనవడు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ Tributes అర్పించారు. అనంతరం ఓ వీడియో షేర్ చేశారు. అందులో ఇందిరా గాంధీ Funerals క్లిప్స్, ఆయన మాటలూ ఉన్నాయి. మూడు నిమిషాల నిడివి గల ఈ వీడియోలో ఇందిరా గాంధీ గురించి మాట్లాడారు. 

ఆమె మరణం తన జీవితంలో రెండో అతిపెద్ద బాధాకరమైన రోజు అని పేర్కొన్నారు. తన తండ్రి రాజీవ్ గాంధీ మరణించిన రోజూ తన లైఫ్‌లో అతి క్లిష్టమైన రోజు అని వివరించారు. 

Also Read: ఎమర్జెన్సీ విధించడం తప్పే, నాన్నమ్మ కూడా అంగీకరించారు: రాహుల్ సంచలనం

ఆమె మరణానికి ముందు తనకు ఏమీ జరిగినా నన్ను ఏడవవద్దు అని సూచించారని రాహుల్ గాంధీ గుర్తుచేసుకున్నారు. అందుకే తన ముఖాన్ని దాచుకుంటూ ఏడుస్తూ గడిపానని వివరించారు. ఆమె అప్పుడు అలా ఎందుకు అన్నారో తనకు తర్వాత అర్థమైందని తెలిపారు.

YouTube video player

అలా చెప్పిన రెండు.. మూడు గంటల తర్వాత ఆమె మరణించారని రాహుల్ చెప్పారు. తాను మరణించిబోతున్నట్టు ఆమె ముందుగానే పసిగట్టినట్టు అనిపించిందని వివరించారు. అందరం తినడానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు ఆమె ఒక మాట చెప్పారని, అతి పెద్ద శాపమేదైనా ఉంటే అది రోగంతో మరణించడమే అని అన్నారు. అంటే ఆమె దృక్కోణంలో ఆమెది గొప్ప చావేనని భావించినట్టు అర్థమవుతున్నది. తన దేశం కోసం ఆమె ఆదర్శాలను ఎత్తిపట్టి ప్రాణాలు కోల్పోవడమే ఉత్తమమని ఆమె భావించి ఉంటారని వివరించారు. అప్పుడు ఆమె చెప్పిన మాట ఇప్పుడు అర్థమవుతున్నదని తెలిపారు.

ఇంట్లో నాన్న చాలా స్ట్రిక్ట్. ఎప్పుడు నాన్న నాపై సీరియస్ అయినా సూపర్ మదర్ నన్ను వెనుకేసుకువచ్చేదని రాహుల్ చెప్పారు. ఆమె నాకు రెండో తల్లివంటిదని వివరించారు.

ప్రియాంక గాంధీ కూడా ఈ రోజు ఇందిరా గాంధీకి నివాళులు అర్పించిన తర్వాత ట్విట్టర్‌లో ఓ ఫొటో షేర్ చేశారు. ఇందిరా గాంధీతో ఆమె ఆడుతున్న బ్లాక్ అండ్ వైట్ ఫొటోనూ షేర్ చేసి ధైర్యం, సాహసం, దేశభక్తికి నీ జీవితమే ఒక సందేశమని పేర్కొన్నారు. ఆదర్శవంతమైన దారిలో నడుస్తూ న్యాయం కోసం పోరాడటమే నీ జీవితమిస్తున్న సందేశమని వివరించారు.

Scroll to load tweet…

Also Read: నేను ఇందిరాగాంధీ మనమరాలిని, భయపడను: యూపీ సర్కార్‌కి ప్రియాంక వార్నింగ్

మనదేశానికి ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొట్టతొలి మహిళా ఇందిరా గాంధీ. ఇప్పటి వరకే మహిళా ప్రధాన మంత్రిగా ఆమెనే నిలిచారు. ఆపరేషన్ బ్లూస్టార్‌కు ప్రతీకారంగా ఇద్దరు సిక్కు బాడీగార్డులు ఇందిరా గాంధీపై కాల్పులు జరిపారు. అనంతరం సిక్కులను లక్ష్యంగా చేసుకుని ఊచకోత జరిగింది. ఇందులో కనీసం మూడు వేల మంది మరణించారు. గురుద్వారాలు, ఇళ్లు, దుకాణాలను ధ్వంసం చేశారు.