Asianet News TeluguAsianet News Telugu

భార‌త్ జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీ కొత్త అవ‌తారంలో క‌నిపిస్తారు - దిగ్విజయ్ సింగ్

భారత్ జోడో యాత్ర ముగిసిన తరువాత రాహుల్ గాంధీలో కొత్త అవతారంలో కనిపిస్తారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఈ యాత్ర వల్ల పార్టీ బలోపేతం అవుతోందని తెలిపారు. 

Rahul Gandhi will be seen in a new avatar after Bharat Jodo Yatra - Digvijay Singh
Author
First Published Oct 9, 2022, 3:56 PM IST

రాహుల్ గాంధీ భారత్ జోడో (భారతదేశ ఐక్యత) చిహ్నంగా మారారని, కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర ముగిసిన తరువాత ఆయ‌న కొత్త అవతారంలో కనిపిస్తారని ఆ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఆదివారం ఆయ‌న వార్తా సంస్థ ‘పీటీఐ’కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాట్లాడారు. 

కేరళలో బుర్ఖా ధరించిన ఆలయ పూజారీ.. ఎందుకో తెలుసా?

ర‌త్ జోడో యాత్ర ఖచ్చితంగా కాంగ్రెస్‌పై సానుకూల ప్రభావం చూపిందని అన్నారు. చాలా సంవత్సరాల తర్వాత  కాంగ్రెస్ పార్టీ గురించి దేశ వ్యాప్తంగా ఇంత‌లా చ‌ర్చించ‌డం ఇదే మొద‌టి సారి అని తెలిపారు. మారుమూల ప్రాంతాలు, గ్రామాల్లోని అన్ని మార్గాల్లో రాహుల్ గాంధీ న‌డుస్తూ ప్ర‌జ‌ల‌ను ఆకట్టుకుంటున్నారు. ఈ యాత్ర పార్టీ బలోపేతానికి దోహదపడుతుందని ఆశాభావం వ్య‌క్తం చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో సిద్ధాంతాలు, నాయకత్వం పట్ల నిబద్ధత కొరవడిందని చెప్పారు.

‘‘ ఈ దేశంలో ఎవరైనా త్యాగం చేస్తే ఎప్పుడూ పూజ్యమే.. సోనియాగాంధీ ప్రధాని పదవిని త్యాగం చేశారు. ఇప్పుడు రాహుల్ గాంధీ వేడికి చెమటలు కక్కుతూ, వర్షంలో తడుస్తూ నడుస్తున్నారు. అన్ని రకాల ఫేక్ న్యూస్, పరువు నష్టంతో పోరాడుతూ కూడా ఆయ‌న భారత్ జోడోకు చిహ్నంగా మారారు ’’ అని దిగ్విజయ్ సింగ్ తెలిపారు. ఈ యాత్ర రాహుల్ గాంధీకి ఏ విధంగా సాయం చేస్తుంద‌ని పీటీఐ అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇస్తూ.. ఈ యాత్ర ముగిసిన త‌రువాత రాహుల్ గాంధీని కొత్త అవ‌తార్ లో చూస్తారు అని అన్నారు. 
రూ. 300 కోట్ల లంచం ఆఫ‌ర్.. ఈ కేసులో మాజీ గ‌వ‌ర్న‌ర్ సత్యపాల్ మాలిక్ ను సీబీఐ ఎందుకు ప్రశ్నించిందో తెలుసా?

రాహుల్ గాంధీ త‌న‌కు చాలా కాలంగా తెలుస‌ని, ఒక ఆయ‌న ఏదైనా చేయాలని నిర్ణయించుకుంటే దానిని సాధించకుండా వ‌దిలిపెట్ట‌ర‌ని అన్నారు. ‘‘ నిజంగా చెప్పాలంటే, నేను అతడిని ఎప్పుడూ సైద్ధాంతికంగా నిబద్ధతతో కూడిన అత్యంత పరిశోధనాత్మక మనస్సుతో చూశాను. ఆయ‌న సమాధానాలు చెప్పే వరకు మిమ్మల్ని వెళ్ళనివ్వడు. ఆయ‌న‌ ఫలవంతమైన అధ్యాత్మిక నాయ‌కుడు కూడా ’’ అని దిగ్విజయ్ సింగ్ అన్నారు. 

యాత్ర కోసం తాము ప్రతీ రాష్ట్రం, జిల్లాకు సమన్వయకర్తలను నియమించామని, పార్టీ ఫ్రంట్ బాడీలు, సెల్‌లు కూడా అలా చేస్తున్నాయని, ఇది అట్టడుగు స్థాయిలో సంస్థ నిర్మాణాన్ని బలోపేతం చేయడానికి దోహదపడుతుందని ఆయన అన్నారు. అనేక గృహాలను సందర్శిస్తూ, వారి అభిప్రాయాలను తెలుసుకునేందుకు నాయకులకు పనులు కేటాయించామని చెప్పారు. ప్రస్తుతం మీడియా తమ వైపు చూడటమే యాత్ర సాధించిన అతి పెద్ద ఘనత అని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పుడు ఇంటి నుంచి బయటకు వచ్చి, వీధుల్లో, రోడ్లపై తిరుగుతున్నారని తెలిపారు.

భార‌తీయ జాల‌ర్ల‌ను చంప‌డానికి ప్ర‌య‌త్నించిన పాకిస్థాన్ నేవీ సిబ్బంది.. ఎఫ్ఐఆర్ న‌మోదు చేసిన గుజ‌రాత్ పోలీసులు

తనపై పెట్టిన ఏడు పరువునష్టం కేసుల విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ.. పదవిలో ఉన్నా లేకపోయినా వీధుల్లో తిరుగుతూ వారితో పోరాడుతానని దిగ్విజ‌య్ సింగ్ అన్నారు. ఇదిలా ఉండగా కన్యాకుమారి నుంచి ప్రారంభమైన యాత్ర జమ్మూ కాశ్మీర్‌లో ముగియనుంది. ఈ యాత్ర 3,500 కిలో మీట‌ర్ల పాటు సాగ‌నుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios