Asianet News TeluguAsianet News Telugu

రూ. 300 కోట్ల లంచం ఆఫ‌ర్.. ఈ కేసులో మాజీ గ‌వ‌ర్న‌ర్ సత్యపాల్ మాలిక్ ను సీబీఐ ఎందుకు ప్రశ్నించిందో తెలుసా?

గత రెండేళ్లుగా మాలిక్ కేంద్ర ప్రభుత్వం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ముఖ్యంగా రైతుల ఉద్యమం తర్వాత మాలిక్ నేరుగా ప్రధానిని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి నిరంతరం కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. బహిరంగ వేదికపై నుంచి ప్రభుత్వంపై పలు తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పుడు సీబీఐ విచారణ తర్వాత అనేక రకాల ఊహాగానాలు మొదలయ్యాయి.

300 Crore Rupees, Ambani And RSS, Know Why The CBI Interrogated The Satyapal Malik
Author
First Published Oct 9, 2022, 3:21 PM IST

జమ్మూ కాశ్మీర్, బీహార్, మేఘాలయ గవర్నర్‌గా పనిచేసిన సత్యపాల్ మాలిక్ పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురుస్తుంది. అక్టోబరు 4న మాలిక్‌ గవర్నర్‌గా ఐదేళ్ల పదవీకాలం పూర్తయింది. పదవీ విరమణ తర్వాత ఆయ‌న‌పై సీబీఐ యాక్షన్  ప్రారంభించింది. రెండు రోజుల క్రితం ఆయ‌న ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో ఆయ‌న‌ విచారణ జరిగినట్లు సమాచారం.

గత రెండేళ్లుగా మాలిక్ కేంద్ర ప్రభుత్వం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ముఖ్యంగా రైతుల ఉద్యమం తర్వాత మాలిక్ నేరుగా ప్రధానిని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి నిరంతరం కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. బహిరంగ వేదికపై నుంచి ప్రభుత్వంపై పలు తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పుడు సీబీఐ విచారణ తర్వాత అనేక రకాల ఊహాగానాలు మొదలయ్యాయి. సత్యపాల్ మాలిక్‌ను ఎందుకు విచారిస్తున్నారనే ప్రశ్న తలెత్తుతోంది. సిబిఐ ఏ కేసులో విచారిస్తోంది. ఆయన ఏవిధ‌మైన‌ స్టేట్‌మెంట్‌ను ఇచ్చారు. తరువాత ఎలాంటి ప‌రిణామాలు జ‌ర‌గ‌బోతున్నాయనే ప‌లు ప్ర‌శ్న‌లు త‌లెత్తున్నాయి. 

ముందుగా సత్యపాల్ మాలిక్ గురించి తెలుసుకుందాం...
 
సత్యపాల్ మాలిక్ 24 జూలై 1946న బాగ్‌పత్‌లో జన్మించారు. ఆయ‌న‌ మీరట్ కళాశాలలో  BSc , LLB పూర్తి చేసాడు. విద్యార్థి జీవితం నుంచే ఆయ‌ను రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్య‌వ‌హ‌రించారు. 1968-69లో విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. క‌ళాశాల జీవితం అనంత‌రం.. ప్ర‌త్యేక్ష రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించారు. ఆ తర్వాత 1974 తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు.

అనంత‌రం 1980లో రాజ్యసభ ఎంపీ అయ్యారు. 1989లో జనతాదళ్ టికెట్‌పై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. 1996లో సమాజ్‌వాదీ పార్టీ టిక్కెట్‌పై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. అనంత‌రం బీజేపీలో చేరి .. క్ర‌మంగా ఎదుగుతూ.. 2012లో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక‌య్యారు. పార్టీ అభ్యున్న‌తికి 
వివిధ స్థాయిలో ప‌ని చేశారు. దీని తరువాత.. సెప్టెంబర్ 30, 2017 న, ఆయ‌న‌ బీహార్ గవర్నర్‌గా నియమితులయ్యారు.  ఆ తరువాత.. ఆగస్టు 23, 2018 న జమ్మూ మరియు కాశ్మీర్ గవర్నర్‌గా నియమించబడ్డాడు.

ఆగస్టు 2019లో జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370లోని ర‌ద్దు అనంత‌రం మార్పుల వ‌ల్ల  .. ఆయ‌న  నవంబర్ 3, 2019 న గోవా గ‌వ‌ర్న‌ర్ నియ‌మించబ‌డ్డారు. అదే స‌మ‌యంలో ఆగస్టు 18, 2020 న మేఘాలయ గవర్నర్‌గా నియమించబడ్డారు. ఈ విధంగా త‌న‌ ఐదేళ్ల పదవీ కాలంలో నాలుగు రాష్ట్రాలకు గ‌వ‌ర్న‌ర్ గా వ్య‌వ‌హ‌రించారు. 
 
సత్యపాల్ మాలిక్‌ను సీబీఐ ఎందుకు ప్రశ్నిస్తోంది?

వాస్తవానికి.. సత్యపాల్ మాలిక్‌ జమ్మూ కాశ్మీర్ గవర్నర్‌గా ఉన్న సమయంలో (ఆగస్టు 23, 2018 నుంచి అక్టోబర్ 30, 2019 మధ్య కాలం) రెండు ఫైళ్లను క్లియర్ చేయడానికి రూ. 300 కోట్ల లంచం ఇస్తామ‌ని త‌న‌కు  ఆఫ‌ర్ చేశార‌ని సత్యపాల్ మాలిక్‌ ఆరోప‌ణ‌లు చేశారు. 

అంబానీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చెందిన రెండు ఫైళ్లను క్లియర్ చేస్తే రూ.300 కోట్లు లంచం ఇస్తానని చెప్పారని 2021 అక్టోబర్‌లో మాలిక్ ఆరోపించారు. మాలిక్ ఆరోపణల ఆధారంగా కేంద్ర ఏజెన్సీ ఈ ఏడాది ఏప్రిల్‌లో రెండు కేసులను దాఖలు చేసింది. 

జమ్మూ, కాశ్మీర్ ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ బీమా పథకం కోసం ప్రైవేట్ సంస్థ రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి కాంట్రాక్టును ఇవ్వడానికి సంబంధించిన కేసులలో ఒకటి. ప్రభుత్వ ఉద్యోగులు,  వారి కుటుంబాలకు ఆరోగ్య బీమా కవరేజీని అందించడానికి ఉద్దేశించిన ఈ పథకం అక్టోబర్ 2018లో రూపొందించబడింది. కానీ మోసం ఆరోపణల కారణంగా ఒక నెల తర్వాత రద్దు చేయబడింది.

కిరు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం రూ. 2,200 కోట్ల విలువైన కాంట్రాక్టును ఇవ్వడంలో అవినీతి జరిగిందని ఆరోపించిన మరో కేసు. పటేల్ ఇంజినీరింగ్ లిమిటెడ్ అనే కంపెనీకి ప్రాజెక్టును అప్పగించినప్పుడు ఆన్‌లైన్ టెండర్ ప్రక్రియను అనుసరించలేదని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆరోపించింది. 

అక్టోబరు 4న మేఘాలయ గవర్నర్‌గా పదవీకాలం పూర్తయిన తర్వాత కేంద్ర ఏజెన్సీ మాలిక్‌ను ప్రశ్నించింది. ఆయ‌న చేసిన ఆరోప‌ణ‌లు కాబట్టి..  కేసుల్లో సాక్షిగా ఆయనను సీబీఐ అధికారులు విచారించారు.

సెంట్రల్ ఏజెన్సీ ప్రకారం.. జాయింట్ వెంచర్ కంపెనీ చీనాబ్ వ్యాలీ పవర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ లేదా సీవీవీపీపీఎల్(CVVPPL) బోర్డు జూన్ 2019లో ఇ-టెండర్ ప్రక్రియ ద్వారా అన్ని ప్రధాన ప్రాజెక్టులకు టెండర్లు ఇవ్వాలని నిర్ణయించింది, అయితే ఆగస్టు 2019లో ఈ నిర్ణయం మార్చబడింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ లో ఆ నిర్ణయాన్ని రద్దు చేసిన తర్వాత ప్రాజెక్టును పటేల్ ఇంజినీరింగ్‌కు ఇచ్చారని ఆరోపించారు.

ఈ కేసు విష‌యంలో ఏప్రిల్‌లో కేంద్ర ఏజెన్సీ 14 ప్రాంతాల్లో సోదాలు కూడా నిర్వహించింది. ఇందులో ఐఏఎస్ ఆఫీసర్ నవీన్ చౌదరి, CVPPPL మాజీ చైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్  ఎంఎస్ బాబు, డైరెక్టర్లు ఎంకే  మిట్టల్ , అరుణ్ మిశ్రా కూడా వివ‌రించినట్లు తెలుస్తోంది. 

శ్రీనగర్‌లో నమోదైన మరో ఫిర్యాదులో.. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ , ట్రినిటీ రీఇన్స్యూరెన్స్ బ్రోకర్స్ లిమిటెడ్‌లను నిందితులుగా పేర్కొంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios