Asianet News TeluguAsianet News Telugu

పార్టీ జాతీయ అధ్య‌క్షుడిగా రాహుల్ గాంధే ఉండాలి- రాజ‌స్థాన్ కాంగ్రెస్ తీర్మానం

రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా తిరిగి ఎంపిక చేయాలని రాజస్థాన్ పీసీసీ ఏకగ్రీవంగా ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ మేరకు సీఎం అశోక్ గెహ్లాట్ ఆధ్వర్యంలో శనివారం సమావేశం అయిన ఆ రాష్ట్ర నాయకులు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. 

Rahul Gandhi should be the national president of the party - Rajasthan Congress resolution
Author
First Published Sep 18, 2022, 9:58 AM IST

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక్షుడిగా రాహుల్ గాంధీకే త‌మ మ‌ద్ద‌తు అని రాజ‌స్థాన్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) తెలిపింది. ఈ మేర‌కు ఆ రాష్ట్ర యూనిట్  శనివారం ఏకగ్రీవంగా ఓ తీర్మానాన్నిఆమోదించింది. పార్టీ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభం కావడానికి కొద్ది రోజుల ముందు రాజస్థాన్ పీసీసీ ఈ తీర్మానం చేయ‌డం గమనార్హం.

లోన్ రికవరీ ఏజెంట్ అమానవీయ చర్య.. ట్రాక్టర్ చక్రాల కింద నలిగి చనిపోయిన గర్భిణి

‘‘రాష్ట్ర అధ్యక్షుడి నియామకంతో పాటు జాతీయ అధ్యక్షుడు ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ కట్టుబడి ఉంటారని తీర్మానం ఆమోదించాం. రాహుల్ గాంధీని పార్టీ అధ్యక్షుడిగా నియమించాలని సీఎం (అశోక్ గెహ్లాట్) చేసిన మరో తీర్మానం కూడా ఆమోదం లభించింది. ’’ అని రాజస్థాన్ మంత్రి పీఎస్చ చరియావాస్ అన్నారు. కాగా..రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తదుపరి కాంగ్రెస్ అధ్యక్షుడని ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఈ తీర్మానం రావడం ఇక్కడ ఆసక్తికరం.

400 మంది రాజస్థాన్ పీసీసీ ప్రతినిధుల సమక్షంలో అశోక్ గెహ్లాట్ స్వయంగా తీర్మానాన్ని సమర్పించారు. అంతకు ముందు రాజస్థాన్ సీఎం మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేయడం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల కోరిక అని అన్నారు. ‘‘రాహుల్ గాంధీ పార్టీ చీఫ్ కావాలని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఇది పార్టీని బలోపేతం చేస్తుంది. ’’ అని అశోక్ గెహ్లాట్ భార‌త్ జోడో యాత్ర ప్రారంభానికి ముందు క‌న్యాకుమారిలో అన్నారు. 

8 చిరుత‌లైతే వ‌చ్చాయి.. కానీ 16 కోట్లు ఉద్యోగాలు ఎందుకు రాలేదు ? - పీఎం మోడీపై రాహుల్ గాంధీ ఫైర్

కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి అక్టోబర్ 17వ తేదీన ఎన్నిక‌లు నిర్వ‌హించి, 19వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వ‌హించాల‌ని గ‌తంలో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) నిర్ణయించడం గమనార్హం. అయితే పార్టీ అధ్యక్ష పదవి కోసం రాహుల్ గాంధీకి రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ పదేపదే మద్దతు పలికారు. గత నెలలో ఆయ‌న మాట్లాడుతూ.. తమ పార్టీ రాహుల్ గాంధీని ఏక‌గ్రీవంగా అధ్యక్షుడిగా ఎంపిక చేయడానికి అనుకూలంగా ఉంద‌ని తెలిపారు. ‘పార్టీ కార్యకర్తల సెంటిమెంట్‌ను పరిగణనలోకి తీసుకుని రాహుల్ గాంధీ పాత్రను అంగీకరించాలి’ అని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడిగా రాకపోతే దేశంలోని కాంగ్రెస్ నాయకులకు నిరాశ తప్పదని గెహ్లాట్ చెప్పారు. 

ప్రియుడి మోజులో... కట్టుకున్నోడికి కరెంట్ షాకిచ్చి కడతేర్చిన కసాయి భార్య

శ‌నివారం ఈ తీర్మానం ఆమోదించేందుకు ఏర్పాటు చేసిన స‌మావేశంలో ఓ ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది. పీసీసీ సభ్యుల తొలి సమావేశంలో రిటర్నింగ్ అధికారి, రాష్ట్ర ఇన్ చార్జి అజయ్ మాకెన్.. పార్టీ జాతీయ అధ్య‌క్షుడు, సభ్యులను ఎంపిక చేసే హక్కు పార్టీ హైకమాండ్ కే వదిలేశారు. అయితే ఈ తీర్మానం ఆమోదం పొందటంతో ఆయ‌న సమావేశం నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత రాహుల్ గాంధీని అధ్యక్షుడిగా చేయాలని గెహ్లాట్ ప్రతిపాదించారు. అదే సమయంలో రాహుల్‌ను అధ్య‌క్షుడిని చేయాలని కాంగ్రెస్‌ సభ్యులంతా కోరుకుంటున్నారని రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు గోవింద్‌ దోటసార అన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios