Asianet News TeluguAsianet News Telugu

8 చిరుత‌లైతే వ‌చ్చాయి.. కానీ 16 కోట్లు ఉద్యోగాలు ఎందుకు రాలేదు ? - పీఎం మోడీపై రాహుల్ గాంధీ ఫైర్

భారత్ కు ఎనిమిది చిరుతలను తీసుకొచ్చిన ప్రభుత్వం.. 16 కోట్ల ఉద్యోగాలను ఎందుకు తీసుకురాలేదని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. గత ఎనిమిదేళ్లలో 22 కోట్ల మంది ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటే కేవలం  7 లక్షల మందికే ఉపాధి కల్పించారని ఆరోపించారు. 

 

8 cheetahs came.. but why 16 crore jobs did not come? - Rahul Gandhi fire on PM Modi
Author
First Published Sep 18, 2022, 8:59 AM IST

భారత్‌లోకి చిరుతలను తీసుకురావ‌డం ప‌ట్ల ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. ఎనిమిదేళ్లలో 16 కోట్ల ఉద్యోగాలు ఎందుకు సృష్టించలేదని ఆయ‌న ప్రశ్నించారు. నమీబియా నుంచి తీసుకొచ్చిన ఎనిమిది చిరుతలను మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్క్‌లో ప్రధాని మోదీ విడుదల చేసిన నేప‌థ్యంలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రియుడి మోజులో... కట్టుకున్నోడికి కరెంట్ షాకిచ్చి కడతేర్చిన కసాయి భార్య

‘‘ఎనిమిది చిరుతలు వచ్చాయి. ఎనిమిదేళ్లలో 16 కోట్ల ఉద్యోగాలు ఎందుకు రాలేదో ఇప్పుడు చెప్పండి ’’ అంటూ ‘‘ యువవోన్ కీ హై లాల్కర్, లే కర్ రహేంగే రోజ్‌గార్ (తమకు ఉపాధి కావాలని యువత కేకలు), రాష్ట్రీయ బెరోజ్‌గర్ దివాస్ (జాతీయ నిరుద్యోగ దినోత్సవం) అనే హ్యాష్‌ట్యాగ్‌ని ఉప‌యోగిస్తూ రాహుల్ గాంధీ హిందీలో ట్వీట్ చేశారు. ఆయ‌న ఆధ్వ‌ర్యంలో కొన‌సాగుతున్న భార‌త్ జోడో యాత్ర కేర‌ళ‌లో కొనసాగుతోంది. ఆ యాత్ర‌లోనే ఆయ‌న ట్వీట్ చేశారు.

పోలీస్​స్టేషన్​పై గ్రామస్తుల దాడి.. ఏడుగురు పోలీసుల‌కు తీవ్ర గాయాలు.. కార‌ణ‌మదేనా?

దేశంలో ఆందోళనకరంగా ఉన్న నిరుద్యోగ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని యువత ప్రధాని జన్మదినాన్ని ‘జాతీయ నిరుద్యోగ దినోత్సవం’గా జరుపుకుంటున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ప్ర‌భుత్వ హామీ మేర‌కు ఉపాధి క‌ల్పించాల‌ని డిమాండ్ చేసింది. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని మోదీ హామీ ఇచ్చారని, అయితే గత ఎనిమిదేళ్లలో కేవలం ఏడు లక్షల మందికి మాత్రమే ఉపాధి కల్పించారని పేర్కొంది. అయితే దేశంలో 22 కోట్ల మంది ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపింది.

ఇటీవ‌ల 8 చిరుతల‌ను ఆఫ్రికాలోని నమీబియా నుంచి తీసుకొచ్చారు. దీని కోసం ఏడాది ప్రారంభంలో మ‌న దేశం ఒప్పందం కుదుర్చుకుంది. భారతదేశంలో దీనిని ప్రాజెక్ట్ చిరుత అని పిలుస్తున్నారు. దేశంలోని వన్యప్రాణులకు మరింత వైవిధ్యాన్ని తీసుకురావడం ఈ ప్రాజెక్టు ఉద్దేశ్యం. అయితే చిరుతలను త‌ర‌లించ‌డానికి చేప‌ట్టిన తొలి ఖండాంతర ప్రాజెక్ట్ ఇదే. ఇందులో ఐదు ఆడ, మూడు మగ చిరుత‌లు ఉన్నాయి. 30 నుండి 66 నెలల మధ్య వయస్సు గల ఈ చిరుత‌ల‌ను ప్రత్యేక విమానంలో నమీబియా నుండి భారతదేశానికి త‌ర‌లించారు. దేశంలో ఏడు దశాబ్దాల తరువాత కునో నేషనల్ పార్క్‌లో పీఎం న‌రేంద్ర మోడీ ఈ చిరుతల‌ను విడుద‌ల చేశారు.

మ‌ద్యం మ‌త్తులో 70 ఏండ్ల‌ వృద్దురాలిపై యువ‌కుడి అత్యాచారం.. ప‌రిస్థితి విష‌మం..

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోడీ మాట్లాడుతూ.. భారతదేశం, ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన జంతువు జనాభాను పునరుద్ధరించడానికి గత ప్రభుత్వాలు ఎలాంటి నిర్మాణాత్మక ప్రయత్నాలూ చేయలేదని ప్రధాని మోడీ అన్నారు. ‘‘ 1952లో చిరుతలు అంతరించిపోయాయని మనం ప్రకటించడం దురదృష్టకరం. కానీ దశాబ్దాలుగా వాటిని భారతదేశంలో తిరిగి రప్పించడానికి నిర్మాణాత్మక ప్రయత్నాలు జరగలేదు. అయితే అమృత్ కాల్ లో కొత్త బలం, శక్తితో దేశం చిరుతల జనాభాను పునరుద్ధరించే ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. ’’ ఆయన అన్నారు.

‘‘ దశాబ్దాల తర్వాత చిరుతలను భారత గడ్డపై తిరిగి ప్రవేశపెట్టడానికి సాయం చేసిన మా మిత్ర దేశం నమీబియాకు, అక్కడి ప్రభుత్వానికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను ’’ అని మోడీ అన్నారు. దురదృష్టవశాత్తు 1947లో భారతదేశ అడవిలో కేవలం మూడు చిరుతలు మాత్రమే మిగిలిపోయాయని అన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios