ప్రియుడి మోజులో కట్టుకున్న వాడినే కడతేర్చిందో కసాయి భార్య. ప్రియుడితో కలిసి భర్తకు కరెంట్ షాక్ ఇచ్చి అతి దారుణంగా హతమార్చి అందమైన జీవితాన్ని చేజేతులా అందకారంలోకి నెట్టుకుంది. 

ఉత్తరప్రదేశ్ : ఆనందంగా సాగుతున్న జీవితాల్లో అక్రమ సంబంధం చిచ్చు పెడుతోంది. జీవితాంతం కలిసి బ్రతకాల్సిన భార్యాభర్తలు వివాహేతన సంబంధాల కారణంగా ఒకరినొకరు చంపుకునే స్థాయికి మానవ సంబంధాలు దిగజారాయి. అక్రమ సంబంధాలు హత్యలకు దారితీసిన దారుణాలు ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేకం వెలుగుచూడగా తాజాగా ఉత్తర ప్రదేశ్ లో మరో అమానుషం బయటపడింది. ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తకు అతి దారుణంగా కరెంట్ షాక్ ఇచ్చి చంపిందో కసాయి భార్య. చాలాకాలం తనకేమీ తెలియదన్నట్లు నాటకమాడినా చివరకు ఆమె పాపం పండి కటకటాల పాలయ్యింది.

పోలీసులు, బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం... ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బల్దేవ్ పరిధిలోని సేల్ ఖేడా గ్రామానికి చెందిన మాన్వేంద్రకు ఈ ఏడాదే పెళ్లయ్యింది. అయితే అతడి భార్య పెళ్లికి ముందే మరో యువకుడితో ప్రేమలో వుంది. ఇలా పూర్తిగా ప్రియుడి మోజులో వున్న యువతి భర్తను వదిలించుకుని ప్రియుడితో జీవించాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే దారుణానికి ఒడిగట్టింది. 

ప్రియుడితో కలిసి భర్త హత్యకు కుట్ర పన్నింది యువతి. ఇందులో భాగంగానే ఏకాంతంగా గడుపుదామని చెప్పి ఓ రోజు ఊరికి దూరంగా వున్న మరో ఇంటికి భర్త మాన్వేంద్రను తీసుకెళ్లింది. అప్పటికే ఆ ఇంటికి చేరుకున్న యువతి ప్రియుడు మాన్వేంద్ర హత్యకు అంతా రెడీ చేసాడు. అర్ధరాత్రి భర్త గాడనిద్రలో వుండగా యువతి ప్రియుడికి సమాచారమిచ్చింది. దీంతో అతడు ముందుగానే రెడీచేసిన కరెంట్ తీగలను మాన్వేంద్రకు తాకించాడు. ఇలా ప్రియుడితో కలిసి భర్తకు కరెంట్ షాక్ ఇచ్చి అతి దారుణంగా చంపింది ఆ కసాయి భార్య. 

read more మ‌ద్యం మ‌త్తులో 70 ఏండ్ల‌ వృద్దురాలిపై యువ‌కుడి అత్యాచారం.. ప‌రిస్థితి విష‌మం..

తన అక్రమసంబంధం, భర్త హత్య విషయం బయటపడకుండా యువతి కొత్తనాటకం ఆడింది. భర్తను చంపిన రాత్రే అత్తామామల వద్దకు వెళ్లి విద్యుతాఘాతానికి గురయి మాన్వేంద్ర చనిపోయినట్లు బోరున విలపిస్తూ చెప్పింది. దీంతో ఆమె మాటల నిజమేనని అత్తామామలు కూడా నమ్మి కొడుకు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. 

అయితే భర్త చనిపోయాక కోడలు ప్రవర్తనలో చాలా మార్పు రావడం అత్తామామలు గమనించారు. తరచూ ఎవరితోనో ఫోన్ మాట్లాడుతుండటం... అనుమానాస్పదంగా మాట్లాడుతుండటం మామ సుబేధార్ సింగ్ గమనించాడు. దీంతో కోడలు ఇంట్లో లేని సమయంలో ఫోన్ ను పరిశీలించగా ఆమె మాట్లాడిని ఫోన్ రికార్డింగ్స్ బయటపడ్డారు. అందులో ''నువ్వు చెప్పినట్లే కరెంట్ షాక్ ఇచ్చి ఇచ్చి చంపాను'' అంటూ ఓ వాయిస్ రికార్డింగ్ బయటపడింది. దీంతో ఈ ఫోన్ ను తీసుకుని నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన కొడుకు మృతికి కోడలే కారణమంటూ సుబేదార్ సింగ్ ఫిర్యాదు చేసాడు. 

కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టగా మాన్వేంద్ర భార్యకు అతేంద్ర అనే యువకుడితో వివాహేతర సంబంధం వున్నట్లు గుర్తించారు. పుట్టింటికి వెళుతున్నట్లు చెప్పిన ఆమె ప్రియుడితోనే వున్నట్లు గుర్తించారు. ముమ్మరంగా గాలించి వారి ఆఛూకీ తెలుసుకున్న పోలీసులు నిందితులిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇలా ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తను చంపి
జీవితాన్ని నాశనం చేసుకుంది యువతి.