పరువునష్టం కేసులో సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి శిక్ష ఖరారు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ భారీ నిరసనలు నిర్వహించాలని నిర్ణయించింది. అందులో భాగంగా శుక్రవారం ఢిల్లీలోని విజయ్ చౌక్ వద్ద ఆందోళన చేపట్టింది. సోమవారం నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ చీఫ్ లు తీర్పునకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టాలని యోచిస్తున్నారు. 

2019 పరువునష్టం కేసులో రాహుల్ గాంధీ దోషిగా తేలారు. అయితే దీనికి వ్యతిరేకంగా వ్యూహాన్ని నిర్ణయించడానికి కాంగ్రెస్ పార్టీ శుక్రవారం విపక్ష నేతలందరితో సమావేశానికి పిలుపునిచ్చింది. ఈ తీర్పుతో కలత చెందిన కాంగ్రెస్ శుక్రవారం ఢిల్లీలోని విజయ్ చౌక్ వద్ద గుజరాత్ కోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా మార్చ్ నిర్వహించాలని నిర్ణయించింది.

షాకింగ్... తల్లిదండ్రుల లేని మేనకోడలిని వ్యభిచార గృహానికి అమ్మిన అత్త.. !

ఈ కేసును న్యాయపరంగా, రాజకీయంగా ఎదుర్కొంటామని కాంగ్రెస్ తెలిపింది. తీర్పు వెలువడిన వెంటనే పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే తన నివాసంలో సీనియర్ నేతలు, ఎంపీలతో సమావేశమయ్యారు. ఈ అంశంపై సోమవారం ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఆందోళనలు చేపడతామని ఈ సమావేశానికి హాజరైన జైరాం రమేష్ అన్నారు. ఇది కేవలం న్యాయపరమైన సమస్య మాత్రమే కాదని, దేశంలో ప్రజాస్వామ్య భవిష్యత్తుతో ముడిపడి ఉన్న తీవ్రమైన రాజకీయ సమస్య అని తెలిపారు.

Scroll to load tweet…

కాగా.. దేశ రాజధానిలో నిరసన ర్యాలీతో పాటు, ఇతర రాష్ట్రాల్లోని కాంగ్రెస్ చీఫ్ లు కూడా సూరత్ కోర్టు తీర్పు, రాహుల్ గాంధీ శిక్షకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని యోచిస్తున్నారు. ఇదిలా ఉండగా.. 52 ఏళ్ల కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ 2019 ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీపై వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో ‘రాహుల్ గాంధీ దొంగలందరికీ మోడీ అనే సాధారణ ఇంటిపేరు ఎలా వచ్చింది’’ అని ప్రశ్నించారు. ‘‘నీరవ్ మోడీ, లలిత్ మోడీ, నరేంద్ర మోడీ... వారందరికీ మోడీని ఒక ఉమ్మడి ఇంటిపేరుగా ఎలా కలిగి ఉన్నారు? దొంగలందరికీ మోడీ అనే ఉమ్మడి ఇంటిపేరు ఎలా ఉంటుంది?’’ అని అన్నారు.

వేయికి పైగా కొత్త కేసులు.. కోవిడ్-19 తో ఇద్ద‌రు మృతి

ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే, గుజరాత్ మాజీ మంత్రి పూర్ణేష్ మోడీ పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష పడింది. కోర్టు తీర్పుపై రాహుల్ గాంధీ 30 రోజుల్లోగా పై కోర్టులో అప్పీల్ చేసుకోవడానికి అవకాశం కల్పించేందుకు శిక్షను 30 రోజుల పాటు సస్పెండ్ చేశారు.

పార్లమెంటులో రాహుల్ గాంధీ.. ‘వాళ్లు నా ముక్కు తుడుచుకున్నానని అంటారు’: ఖర్గేతో రాహుల్

ఇదిలా ఉండగా.. పరువునష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు దోషిగా తేల్చిన తర్వాత కాంగ్రెస్ ఎంపీ ఆటోమేటిక్ గా పార్లమెంటు సభ్యుడిగా అనర్హుడవుతారని ప్రముఖ న్యాయవాది, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ అన్నారు. కపిల్ సిబల్ గతంలో కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్న సంగతి తెలిసిందే.