రాహుల్ గాంధీ పార్లమెంటులో మల్లికార్జున్ ఖర్గే చాంబర్‌లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సమావేశానికి హాజరయ్యారు. సమావేశం అనంతరం, వారు మెట్లు దిగి బయటకు వస్తుండగా రాహుల్ గాంధీ ఆయనపై చేయి వేసి సహరించారు. కానీ, తాను టచ్ చేస్తే.. మీకు ముక్కు తన ముక్కు తుడిచినట్టు చిత్రిస్తారని రాహుల్ అన్నారు. 

న్యూఢిల్లీ: 2019లో నమోదైన డిఫమేషన్ కేసులో సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా తేల్చిన మరుసటి రోజు పార్లమెంటులో కనిపించారు. పార్లమెంటులో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చాంబర్‌లో పార్టీ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఆ సమావేశానికి సోనియా గాంధీ కూడా హాజరయ్యారు. పార్టీ సమావేశం ముగిసిన తర్వాత వారు బయటకు వస్తుండగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
Scroll to load tweet…

సమావేశం తర్వాత వారు బయటకు వస్తుండగా మెట్ల వద్ద రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గేకు సహకరించారు. మల్లికార్జున్ ఖర్గే జాగ్రత్తగా మెట్లు దిగడానికి ఆయన చేయి వేసి సహకరించారు. అదే సమయంలో ఓ తప్పుడు వీడియోను గుర్తు చేశారు. ‘ఇప్పుడు నేను మిమ్మల్ని టచ్ చేస్తే.. మీ వీపునకు నా ముక్కు తుడుచుకుంటున్నానని వారు అంటారు. మీరది చూశారా? నేను మీకు సహాయం చేస్తున్నాను.. వారేమో నేను నా ముక్కు మీకు తుడుస్తున్నానని ఆరోపించారు’ అని రాహుల్ గాంధీ అన్నారు.

Scroll to load tweet…

Also Read: దేశంలో కొత్తగా 1,249 కరోనా కేసులు.. 8 వేలకు చేరువైన యాక్టివ్ కేసులు

రాహుల్ గాంధీ ముక్కు తుడిచారనే కామెంట్ ఇటీవలే బీజేపీ ఓ వీడియోకు ట్విస్ట్ ఇచ్చి పోస్టు చేసిన దానికి సంబంధించినది. మల్లికార్జున్ ఖర్గేను ఇంటి వద్ద డ్రాప్ చేస్తుండగా రాహుల్ గాంధీ తన చేతిని మల్లికార్జున్ వెనుక ఉంచాడు. ఆ వీడియోను బీజేపీ కొత్త ట్విస్ట్ ఇచ్చి సోషల్ మీడియాలో వదిలింది. రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గేను ఒక టిష్యూ పేపర్‌లా వాడుకుంటున్నాడని ఆరోపించింది. ఒక కన్నడిగుడైన మల్లికార్జున్‌ ఖర్గేకు అవమానం జరగడం బాధాకరమని పేర్కొంది.