Asianet News TeluguAsianet News Telugu

ఆప్ ను వ‌దిలేసి బీజేపీలో చేరితే సీబీఐ, ఈడీ కేసుల‌ను ఎత్తేస్తామ‌న్నారు - మ‌నీష్ సిసోడియా

ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరితే తనపై నమోదైన సీబీఐ, ఈడీ కేసులు ఎత్తేస్తామని తనకు సందేశం అందిందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అన్నారు. తలను అయినా నరక్కుంటాను గానీ అవినీతిపరుల మందు మోకాలు వంచలేను అని ఆయన తెలిపారు. 

CBI and ED cases will be lifted if he leaves AAP and joins BJP - Manish Sisodia
Author
First Published Aug 22, 2022, 12:08 PM IST

ఆమ్ ఆద్మీ పార్టీని విడిచిపెట్టి, బీజేపీలో చేరితే సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ న‌మోదు చేసిన కేసుల‌ను ఎత్తేస్తామ‌ని త‌నకు సందేశం అందింద‌ని ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా అన్నారు. లిక్క‌ర్ పాల‌సీ ఉల్లంఘనలకు సంబంధించి సిసోడియాపై సీబీఐ, ఈడీ ద‌ర్యాప్తు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంపై బీజేపీ, ఆప్ మధ్య యుద్ధం కొన‌సాగుతోంది. ఈ నేప‌థ్యంలో మ‌నీష్ సిసోడియా వ్యాఖ్య‌లు ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకున్నాయి.

గేట్లు తెరవడం ఆలస్యమయిందని.. సెక్యూరిటీ గార్డుల మీద మహిళ వీరంగం.. అరెస్ట్...

‘‘ ఆప్ (ఆమ్ ఆద్మీ పార్టీ)ని  విచ్చిన్నం చేసి బీజేపీలో చేరండి అని నాకు సందేశం వచ్చింది. మీపై  సీబీఐ, ఈడీలు పెట్టిన అన్ని కేసులను మూసివేసేలా చూస్తాం బీజేపీ తెలిపింది ’’ అని సిసోడియా ట్వీట్ చేశారు. తనపై ఉన్న కేసులన్నీ అబద్ధాలేనని నొక్కి చెప్పిన ఆయన కాషాయపార్టీకి సవాల్ విసిరారు. ‘‘బీజేపీకి నా సమాధానం చెప్తున్న. నేను మహారాణా ప్రతాప్ వారసుడిని. రాజపుత్రుడిని. తల నరుక్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కానీ కుట్రదారులు, అవినీతిపరుల ముందు ఎప్పటికీ మోకరిల్లలేను. నాపై ఉన్న కేసులన్నీ అవాస్తవాలే. మీరు ఏమి చేయాలనుకుంటున్నారో అది చేయండి’’ అని ఆయన హిందీలో ట్వీట్ చేశారు.

ఎనిమిదేళ్ల బాలికపై హత్యాచారం.. రెండు వారాలక్రితం తప్పిపోయి, మృతదేహంగా లభ్యం..

ఆప్ ప్రజాదరణను చూసి బీజేపీ భయపడుతున్నందునే తనపై కేసు పెట్టార‌ని సిసోడియా ఆరోపించారు. 2024 సార్వత్రిక ఎన్నికలు కేజ్రీవాల్, ప్రధాని నరేంద్ర మోడీ మధ్య పోటీగా మారబోతున్నాయని, ఆప్ నేతను అడ్డుకునేందుకు బీజేపీ కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు.

ఈ ఏడాది ప్రారంభంలో ప్రవేశపెట్టిన ఢిల్లీ మద్యం పాలసీలో అవకతవకలు, అవినీతికి సంబంధించిన కేసులో ఆప్ సీనియర్ నేతపై సీబీఐ గత శుక్రవారం రైడ్ చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 ఉత్త‌మ‌మైన‌ద‌ని, చివ‌రి నిమిషంలో మాజీ లెఫ్ట‌నెంట్ గ‌వ‌ర్న‌ర్ నిర్ణయం మార్చుకోక‌పోతే ప్రతీ ఏడాది రూ.10,000 కోట్లు సంపాదించేదని సిసోడియా గత వారం అన్నారు. అనధికార ప్రాంతాల్లో మద్యం దుకాణాలను తెరవడంపై మాజీ ఎల్జీ అనిల్ బైజాల్ తన వైఖరిని మార్చుకున్నారని, దీని వ‌ల్ల నగర ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల న‌ష్టం జ‌రిగింద‌ని ఆయ‌న ఆరోపించారు.

కుమార్తె దురుసు ప్రవర్తన.. తలదించుకున్న మిజోరాం ముఖ్యమంత్రి.. బహిరంగ క్షమాపణ చెబుతూ ట్వీట్..

కాగా.. ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ కూడా నేడు బీజేపీపై విరుచుకుపడ్డారు. దేశ ప్ర‌జ‌లంతా ఆకాశాన్నంటుతున్న ద్రవ్యోల్బణం, రూపాయి ప‌త‌నం అవుతోంద‌ని బాధ‌ప‌డుతుంటే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయ‌డంలో, అలాగే ఎన్నికైన ప్రభుత్వాలను పడగొట్టడానికి మార్గాలను రూపొందించడంలో బిజీగా ఉందని తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. ‘‘ సామాన్యుడు ద్రవ్యోల్బణంతో పోరాడుతున్నారు. కోట్లాది మంది యువత నిరుద్యోగులుగా ఉన్నారు. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగం, ద్రవ్యోల్బణంపై పోరాడాలి.  కానీ దానికి బదులుగా వారు (కేంద్రం) ప్రతీ ఉదయం ఈ సీబీఐ- ఈడీ ఆటను ఆడుతోంది ’’ అని ఆయన పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios