Asianet News TeluguAsianet News Telugu

ప్రభుత్వం కంటే పార్టీ పెద్దది - యూపీ డిప్యూటీ సీఎం కేశ‌వ్ ప్ర‌సాద్ మౌర్య

యూపీ బీజేపీ అధ్యక్షుడి ఎవరనే అంశంపై మెళ్ల మెళ్లగా క్లారిటీ వస్తోంది. ప్రస్తుత యోగి ప్రభుత్వంలో నెంబర్ 2గా ఉన్న డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య బీజేపీ చీఫ్ గా నియామకం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Party is bigger than government - UP Deputy CM Keshav Prasad Maurya
Author
First Published Aug 22, 2022, 1:21 PM IST

ఉత్తరప్ర‌దేశ్ కొత్త బీజేపీ అధ్యక్షుడిపై పేరుపై కొన‌సాగుతున్న ఊహాగానాల మ‌ధ్య ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య చేసిన ట్వీట్ రాజ‌కీయ సందేశం అందిస్తోంది. సోమ‌వారం ఉద‌యం ఆయ‌న ట్విట్ట‌ర్ లో ‘‘ప్రభుత్వం కంటే సంస్థ పెద్దది’’ అని ట్వీట్ చేశారు. ఇది యూపీ బీజేపీ కొత్త అధ్య‌క్షుడి ఊహాగానాలకు తెర‌దించుతోంది. త్వ‌ర‌లోనే ఆయ‌నే ఆ బాధ్య‌త‌లను చేప‌డుతార‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

ఒడిశా వాసి ప్రైవేట్ పార్ట్‌లో స్టీల్ గ్లాస్.. పది రోజుల తర్వాత సర్జరీతో తొలగింపు

నిజానికి యూపీలో కొత్త అధ్యక్షుడి కోసం బీజేపీ వెతుకుతోంది. ప్ర‌స్తుతం ఉత్తరప్రదేశ్ కేబినెట్‌లో మంత్రిగా ఉన్న స్వతంత్ర దేవ్ సింగ్ గతంలో రాష్ట్ర బీజేపీ చీఫ్ పదవికి రాజీనామా చేశారు. అప్ప‌టి నుంచి ఆ ప‌ద‌వి ఖాళీగానే ఉంది. కొత్త అధ్యక్షుడి పేరుపై ఐదు నెలలుగా మేథోమథనం సాగుతోంది. మిషన్ -2024ను దృష్టిలోష్టి ఉంచుకుని సంస్థను బలోపేతం చేసే వ్య‌క్తి కోసం పార్టీ వెతుకుతోంది. ఇటీవల పార్టీ కొత్త జ‌న‌ర‌ల్ ను కూడా నియ‌మించుకుంది. ఇప్పుడు అధ్యక్షుడి అన్వేషణ కూడా త్వరగా పూర్తి చేయాల‌ని చూస్తోంది. 

బీజేపీ వర్గాల సమాచారం ప్రకారం.. పార్టీ అధ్యక్షుడి నియ‌మించేందుకు ప్రజాదరణ, అనుభవం క‌లిగిన వ్య‌క్తి కోసం వెతుకుతున్నారు. అలాగే నూతన అధ్య‌క్షుడి నియామకంలో సామాజిక‌వ‌ర్గంను కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ అంశాల‌న్నీ కేశ‌వ్ ప్ర‌సాద్ మౌర్య‌కు స‌రిపోతాయని హైక‌మాండ్ భావిస్తోంది. మౌర్య ప్రభావవంతమైన ఓబీసీ నాయకుడు. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ రాష్ట్రానికి బీజేపీ చీఫ్‌గా పనిచేశారు.

గేట్లు తెరవడం ఆలస్యమయిందని.. సెక్యూరిటీ గార్డుల మీద మహిళ వీరంగం.. అరెస్ట్...

గత ప్ర‌భుత్వంలో, బీజేపీలో కూడా నెంబ‌ర్ 2గా ఉన్న ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. ఆయ‌న సిరతు నియోజ‌క‌వ‌ర్గం నుంచి అసెంబ్లీ బ‌రిలో నిలిచారు. అయితే ఆయ‌న ప్ర‌త్య‌ర్థి, అప్నాదళ్ (కామెరవాడి)కి చెందిన అభ్య‌ర్థి ప‌ల్ల‌వి పటేల్ చేతిలో సుమారు 7,000 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. అప్నాద‌ళ్ (కే) స‌మాజ్ వాదీ పార్టీకి మిత్ర‌ప‌క్షంగా ఉంది. ఆయ‌న ఓడిపోయిన‌ప్ప‌టికీ గ‌త ప్ర‌భుత్వంలో ఇచ్చిన ప్రియారిటీనే ఆయ‌న‌కు ఇచ్చారు. ప్ర‌స్తుతం డిప్యూటీ సీఎంగా కొన‌సాగుతున్నారు.  కాగా.. కొత్త అధ్యక్షుడిగా బ్రాహ్మణులు, దళితుల పేర్లను కూడా పార్టీ ప‌రిశీలిస్తుంద‌నే చ‌ర్చ కూడా సాగుతోంది. కానీ ఆ సామాజిక వర్గాల నుంచి అధ్య‌క్షుడి ఎంపికకు చాలా త‌క్కువ అవ‌కాశాలు ఉన్నాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios