Asianet News TeluguAsianet News Telugu

Tiffin Bomb: పాకిస్తాన్ బార్డర్ సమీపంలో టిఫిన్ బాంబ్ స్వాధీనం.. ఉగ్రకుట్ర భగ్నం

పంజాబ్‌లో ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఇండియా, పాకిస్తాన్ సరిహద్దు సమీపంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో దాచిన టిఫిన్ బాంబును స్వాధీనం చేసుకున్నారు. జలాలాబాద్ బ్లాస్ట్ కేసును విచారిస్తున్న పోలీసులకు నిందితుల నుంచి కీలక సమాచారం అందింది. వారి దగ్గర టిఫిన్ బాంబ్ ఉన్నదని, దాన్ని పంజాబ్‌లోని ఫెరోజ్‌పుర్ జిల్లాలో ఓ పంట పొలంలో దాచిపెట్టినట్టు తెలిపారు.
 

punjab police recovered tiffin bomb in field
Author
Chandigarh, First Published Nov 5, 2021, 12:49 PM IST

న్యూఢిల్లీ: పోలీసులు మరో ఉగ్రకుట్ర భగ్నం చేశారు. దేశంలో Bombతో పేలుడుకు పాల్పడాలన్న Terrorists యత్నాన్ని తిప్పికొట్టారు. ఇండియా - పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో Punjabలోని వ్యవసాయ క్షేత్రంలో దాచిన Tiffin Bombను స్వాధీనం చేసుకుని మరో టెర్రరిస్టుల దాడిని అడ్డుకోగలిగారు. ఈ విషయాన్ని పంజాబ్ Policeలు వెల్లడించారు. దేశమంతా దీపావళి వేడుకలు జరుపుకున్న గురువారానికి ఒక రోజు ముందే ఫెరోజ్‌పుర్ జిల్లాలో ఈ టిఫిన్ బాంబును పోలీసులు స్వాధీనం చేశారు.

Jalalabad Bomb Blast Caseను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడిగా ఉన్న రంజిత్ సింగ్ అలియాస్ గోరాకు పరోక్షంగా సహకరించారన్న ఆరోపణలపై లూధియానా పోలీసులు ఇదే వారంలో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. రంజిత్ సింగ్‌కు ఆవాసం, ఇతర లాజికల్ సపోర్టు ఇచ్చినట్టు వీరిపై ఆరోపణలు ఉన్నాయి. ఫెరోజ్‌పుర్ వాస్తవ్యుడు జస్వంత్ సింగ్ అలియాస్ షిండా బాబా, లూధియానాకు చెందిన బల్వంత్ సింగ్‌ను అరెస్టు చేశారు.

వీరిని విచారిస్తున్నప్పుడు కొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ నిందితుల దగ్గర ఓ టిఫిన్ బాంబు ఉన్నట్టు తెలిసింది. వివరాలు ఆరా తీయగా ఆ టిఫిన్ బాంబును ఓ వ్యవసాయ క్షేత్రంలో దాచి పెట్టినట్టు తెలియవచ్చింది.

Also Read: దేశంలో పేలుళ్లకు స్కెచ్: ఉగ్రవాదుల కుట్ర భగ్నం, ఢిల్లీ పోలీసుల అదుపులో ఆరుగురు టెర్రరిస్టులు

ఈ విషయం తెలియగానే కౌంటర్ ఇంటెలిజెన్స్ బృందాలు రంగంలోకి దిగాయి. ఫెరోజ్‌పుర్, లూధియానా, అలీ కే గ్రామంలోనూ గాలింపులు ముమ్మరం చేశారు. ఫెరోజ్‌పుర్ జిల్లాలోని అలీ కే గ్రామంలో ఇండియా, పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఓ వ్యవసాయ
క్షేత్రంలో టిఫిన్ బాంబును కనుగొన్నారు. దాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్నదని ఇంటర్నల్ సెక్యూరిటీ ఏడీజీపీ ఆర్ఎన్ ధోకే వివరించారు. త్వరలోనే మరిన్ని అరెస్టులూ జరుగుతాయని చెప్పారు.

సెప్టెంబర్ 15న జలాలాబాద్ పట్టణంలో ఓ మోటార్‌సైకిల్ బ్లాస్టు జరిగింది. ఇందులో బల్విందర్ సింగ్ దుర్మరణం పాలయ్యారు. బల్విందర్ సింగ్‌కు క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నది. జలాలాబాద్ బ్లాస్ట్ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేశారు. ఒక టిఫిన్ బాంబ్, రెండు పెన్ డ్రైవ్‌లను, నగదును వారి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Also Read: ఆయుధాలు సప్లై చేసే డ్రోన్ కూల్చివేత: సరిహద్దులో హైటెన్షన్

గతంలోనూ ఇలాంటి టిఫిన్ బాంబులు రికవరీలు జరిగాయి. అమృత్‌సర్ రూరల్, కపుర్తలా, ఫజిల్కా, తర్న్ తరణ్‌లలోనూ ఇటీవలి నెలల్లోనే ఇలాంట టిఫిన్ బాంబులను పోలీసులు రికవరీ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios