Asianet News TeluguAsianet News Telugu

జమ్మూకు చేరుకొన్న మోడీ: ఆర్మీ జవాన్లతో దీపావళి వేడుకల్లో ప్రధాని

ప్రధాని నరేంద్ర మోడీ దీపావళి పర్వదినాన్ని ఆర్మీ జవాన్లతో కలిసి జరుపుకొంటారు. గురువారం నాడు ఉదయంజమ్మూ కాశ్మీర్ లోని నౌషీరా, రాజౌరీలలో ఆర్మీ జవాన్లతో దీపావళి వేడుకల్లో మోడీ పాల్గొంటారు.

Prime Minister Narendra Modi to celebrate Diwali with army jawans in Rajouri today
Author
New Delhi, First Published Nov 4, 2021, 11:05 AM IST

న్యూఢిల్లీ: ప్రధానమంత్రిNarendra Modi గురువారం నాడు జమ్మూకాశ్మీర్ లోని నౌషీరాకు చేరుకొన్నారు. దీపావళి పర్వదినాన్ని ఆయన జవాన్లతో కలిసి  జరుపుకొంటారు. Nowshera, Rajouriలో జవాన్లతో ప్రధాని మోడీ దీపావళి వేడుకల్లో పాల్గొంటారు.

2014లో కేంద్రంలో అధికారాన్ని చేపట్టిన తర్వాత ప్రతి దీపావళి ప్రధాని నరేంద్ర మోడీ ఆర్మీ జవాన్లతో జరుపుకొంటున్నారు. ఈ సంప్రదాయానికి కొనసాగింపుగా ఇవాళ రాజౌరీ, నౌషీరీలలో  సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో నరేంద్ర మోడీ పాల్గొంటారు.

also read:ఇంటింటికీ వ్యాక్సిన్.. అపోహలను తొలగించడానికి మత పెద్ద సాయం తీసుకోండి.. ప్రధాని మోదీ..

గత ఏడాది రాజస్థాన్ Jaisalmerలోని లాంగేవాలా సరిహద్దులో ఆర్మీ జవాన్లతో కలిసి నరేంద్ర మోడీ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఇవాళ ఎల్ఓసీ వద్ద నౌషీరా, రాజౌరీ సరిహద్దు వద్ద జవాన్లతో దీపావళి వేడుకల్లో ఆయన పాల్గొంటారు.ఇటీవల కాలంలో పూంచ్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ జరిగి ఇవాళ్టికి 24 రోజులు అవుతుంది. 

ఇటీవల కాలంలో పూంచ్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ జరిగి ఇవాళ్టికి 24 రోజులు అవుతుంది. మోడీ పర్యటనకు ముందు ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణె నిన్ననే జమ్మూకు చేరుకొన్నారు. ప్రధాని టూర్ కు అన్ని ఏర్పాట్లు చేశారు. భద్రతను సమీక్షించారు.రాజౌరీ, పూంచ్ జిల్లాల్లో ఇటీవల కాలంలో ఎన్‌కౌంటర్లు  జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్లలో మూడు వారాలుగా 11 మంది సైనికులు మరణించారు.

గత 24 రోజులుగా పూంచ్ ,రాజౌరీ అటవీ ప్రాంతంలో సైన్యం సుదీర్ఘమైన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ నిర్వహిస్తోంది. ఈ ఆపరేషన్ లో తొమ్మిది మంది సైనికులు మరణించారు. ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల ఏరివేత కోసం ఆర్మీ ప్రయత్నాలు చేస్తోంది.

2019 లో రాజౌరీలోని ఆర్మీ ప్రధాన విభాగంలో ప్రధాని మోడీ దీపావళిని జరుపుకొన్నారు. ఈ దఫా ఎల్ఓసీకి దగ్గరగా నౌషీరాలో సైనికులతో కలిసి ఆయన దీపావళి వేడుకల్లో పాల్గొంటారు.గత వారం ఇదే సెక్టార్‌లో జరిగిన మందుపాతర పేలుడులో ఓ అధికారి సహా ఇద్దరు సైనికులు మరణించారు.

చాంద్రమాన క్యాలెండర్ లో అత్యంత పవిత్రమైన మాసమైన కార్తీక మాసం 15 వ రోజున దీపావళిని జరుపుకొంటారు. చీకటిపై కాంతి, చెడుపై మంచి, అజ్ఞానంపై  జ్ఞానం విజయం సాధించిన గుర్తుగా ప్రజలు దీపావళిని జరుపుకొంటారు. దీపావళిని పురస్కరించుకొని ప్రజలు తమ ఇళ్లను అందంగా అలంకరించుకొంటారు.

ప్రధాని నరేంద్ర మోడీ ఆర్మీ జవాన్లలో ఆత్మస్తైర్యం నింపేందుకు ప్రతి దీపావళి పర్వదినం సందర్భంగా వేడుకల్లో పాల్గొంటారు.  ఇవాళ దీపావళి వేడుకల్లో పాల్గొన్న తర్వాత రేపు కేదారీనాథ్ ను మోడీ సందర్శిస్తారు.  కేదారీనాథ్ లో ఆదిశంకరాచార్యుల విగ్రహన్ని  ప్రదాని మోడీ రేపు ఆవిష్కరిస్తారు.

ఉత్తరాఖండ్‌లో 2013లో  వచ్చిన వరదలతో కేదార్ నాథ్ లో ధ్వంసమైన ఆదిశంకరాచార్య సమాధిని పునర్నిర్మించారు. సంగంఘాట్ పునరాభివృద్ది సహా రూ. 180 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను ప్రధాని మోడీ రేపు శంకుస్థాపన చేస్తారు.2013లో కేదార్‌నాథ్ లో ప్రకృతి వైపరీత్యం సంబవించిన తర్వాత పునర్నిర్మాణ కార్యక్రమాలు 2014లో ప్రారంభమయ్యాయి. ఈ పనులను ప్రధాని మోడీ ఎప్పటికప్పుడూ సమీక్షిస్తున్నారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios