Asianet News TeluguAsianet News Telugu

ఇంటింటికీ వ్యాక్సిన్.. అపోహలను తొలగించడానికి మత పెద్ద సాయం తీసుకోండి.. ప్రధాని మోదీ..

కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్‌కు పుకార్లు, అపోహలు పెద్ద సవాలుగా ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించడమే దీనికి పరిష్కారమని  తెలిపారు. ఇందుకోసం స్థానిక మత పెద్దల సహాయం తీసుకోవాలని సూచించారు.

PM Modi Asks officials to take Covid vaccination drive door-to-door
Author
New Delhi, First Published Nov 3, 2021, 3:30 PM IST

కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్‌కు పుకార్లు, అపోహలు పెద్ద సవాలుగా ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించడమే దీనికి పరిష్కారమని  తెలిపారు. ఇందుకోసం స్థానిక మత పెద్దల సహాయం తీసుకోవాలని సూచించారు. ఇంటింటికీ టీకాలు వేయాలని, అవగాహన కల్పించాలని ఆరోగ్య కార్యకర్తలను కోరారు. దేశంలో కోవిడ్ వ్యాక్సిన్‌లు మారుమూల ప్రాంతాలకు చేరేందుకు అధికారులు, ఆశా వర్కర్లు చేసిన కృషిని ప్రశంసించారు. కోవిడ్ వ్యాక్సినేషన్ తక్కువగా జరిగిన జిల్లాల (low vaccine coverage) అధికారులతో ప్రధాని మోదీ బుధవారం వర్చువల్ సమీక్ష నిర్వహించారు. 100 కోట్లు డోసుల పంపిణీ చేశామని నిర్లక్ష్యం వహిస్తే కొత్త సంక్షోభం రావచ్చని ప్రధాని మోదీ హెచ్చరించారు. వ్యాధులతో, శత్రువులతో చివరి వరకు పోరాడాలని పిలుపునిచ్చారు. 

‘కోవిడ్ వ్యాక్సినేషన్ (Covid Vaccination) పెంచడానికి జిల్లా అధికారులు వినూత్న మార్గాలతో ముందుకు సాగాలి. కావాలంటే మీ జిల్లాల్లోని ప్రతి గ్రామం, ప్రతి పట్టణానికి భిన్నమైన వ్యూహాన్ని రూపొందించండి. మీరు ప్రాంతాన్ని బట్టి 20-25 మంది వ్యక్తులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేయడం ద్వారా కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగించవచ్చు. ఈ బృందాల మధ్య ఆరోగ్యకరమైన పోటీని నెలకొల్పడానికి ప్రయత్నించండి. ఇప్పటివరకు మీరు టీకా కేంద్రాలకు ప్రజలను తీసుకెళ్లారు.. కానీ ఇప్పుడు ఇంటింటికీ వ్యాక్సిన్ కోసం.. ప్రతి ఇంటికి చేరుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

Also read: విదేశీ పర్యటన ముగించుకుని ఢిల్లీకి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ..

కోవిడ్-19 వ్యాక్సినేషన్‌కు సంబంధించి కొన్ని చోట్ల పుకార్లు, అపోహలు పెద్ద సవాలుగా మారాయి. వీటిని అధిగమించడానికి స్థానిక మత పెద్దల సహాయం తీసుకోవచ్చు. వీరితో చిన్న వీడియోలను రూపొందించి.. వాటిని ప్రసారం కూడా చేయవచ్చు. కొద్ది రోజుల క్రితం.. నేను వాటికన్‌ సిటీలో పోప్ ఫ్రాన్సిస్‌ని కలిశాను. వ్యాక్సిన్‌పై మత పెద్దల సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంపై కూడా మనం ప్రత్యేక దృష్టి పెట్టాలి.

మొదటి డోస్ వ్యాక్సిన్‌తో పాటుగా.. రెండో డోస్‌పై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇన్ఫెక్షన్ కేసులు తగ్గడం ప్రారంభమైతే.. కొన్నిసార్లు ఆవశ్యకత భావన తగ్గిపోతుంది. ఇప్పుడు అంత తొందేమిటి అని జనాలు భావిస్తారు’ మోదీ తెలిపారు.  ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. వ్యాక్సినేషన్‌లో 48 జిల్లాలు వెనుకబడి ఉన్నట్లు గుర్తించబడ్డాయి. వీటిలో మొదటి డోస్ కవరేజీ ఇప్పటికీ 50 శాతం కంటే తక్కువగా ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios