ఈజిప్టు ప్రధాని ముస్తఫా మద్బౌలీ, కేబినెట్ మంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశం అయ్యారు. వాణిజ్య సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై ఆ దేశ నాయకులతో చర్చలు జరిపారు. 

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈజిప్టులో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా వాణిజ్య సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై ఆ దేశ ప్రధాని ముస్తఫా మద్బౌలీ, కేబినెట్ మంత్రులతో ఆయన శనివారం చర్చలు జరిపారు. ఈజిప్టు గ్రాండ్ ముఫ్తీ డాక్టర్ షవ్కీ ఇబ్రహీం అబ్దెల్ కరీం అల్లంతో సమావేశమైన ప్రధాని ప్రవాస భారతీయులతో మాట్లాడారు. ప్రవాస భారతీయులు, బోహ్రా కమ్యూనిటీ సభ్యులను ఆయన కలుసుకున్నారు.

బీహార్ లో భారీ పేలుడు.. 17 ఏళ్ల బాలుడు మృతి, ముగ్గురికి గాయాలు

భారతదేశానికి చెందిన దావూదీ బోహ్రా కమ్యూనిటీ సహాయంతో పునరుద్ధరించిన కైరోలోని చారిత్రాత్మక అల్-హకీం మసీదును ఆదివారం సందర్శించడానికి ముందు బోహ్రా కమ్యూనిటీ సభ్యులతో ప్రధాని సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. భారతదేశంలోని బోహ్రా కమ్యూనిటీ వాస్తవానికి ఫాతిమా రాజవంశం నుండి ఉద్భవించింది. వారు 1970 ల నుండి మసీదును పునరుద్ధరించారు.

Scroll to load tweet…

అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్ సీసీ ఆహ్వానం మేరకు మోడీ ఈజిప్టులో పర్యటిస్తున్నారు. 26 ఏళ్లలో భారత ప్రధాని ఈజిప్టులో పర్యటించడం ఇదే తొలిసారి. అంతకు ముందు విమానాశ్రయంలో మోదీకి ఈజిప్టు ప్రధాని ఘనస్వాగతం పలికి, గౌరవ వందనం స్వీకరించారు. ఈ పర్యటన ఈజిప్టుతో భారత్ సంబంధాలను బలోపేతం చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ‘‘అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్ సీసీతో చర్చలు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నేను ఎదురుచూస్తున్నాను’’ అని కైరోలో దిగిన తర్వాత ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.

ప్రాణాలను ఫణంగా పెట్టి.. నీటిలో మునిగిపోతున్న చిన్నారులను కాపాడిన కానిస్టేబుల్.. జుహూ బీచ్ లో ఘటన

భారతదేశంతో సంబంధాలను మరింత మెరుగుపరచడానికి మార్చిలో అధ్యక్షుడు ఎల్-సీసీ ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి మంత్రుల బృందం ఇండియా యూనిట్ తో మోడీ మొదటి అధికారిక సమావేశం. ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా ఎల్-సీసీ భారత పర్యటన సందర్భంగా సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచాలని ఇరువురు నేతలు నిర్ణయించారు.

మోడీతో భేటీకి మాడ్బౌలీ నేతృత్వంలోని ఈజిప్టు కేబినెట్ లోని ఏడుగురు సభ్యులు హాజరయ్యారు. ప్రధాని మాడ్బౌలీ, ఆయన మంత్రివర్గ సహచరులు భారత యూనిట్ చేపడుతున్న కార్యక్రమాలను వివరించారని, సహకారానికి కొత్త రంగాలను ప్రతిపాదించారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. భారత యూనిట్ ఏర్పాటును ప్రధాన మంత్రి మోడీ అభినందించారు. భారత దేశంతో ద్వైపాక్షిక సంబంధాల ను ముందుకు తీసుకువెళ్లే ఈ ప్రభుత్వ విధానాన్ని మోడీ స్వాగతించారు.

‘రాహుల్ గాంధీ మీకింకా సమయం మించి పోలేదు, పెళ్లి చేసుకోండి’- పాట్నా సమావేశంలో లాలూ ప్రసాద్ యాదవ్.. వీడియో వైరల్

పరస్పర ప్రయోజనాలున్న వివిధ రంగాల్లో ఈజిప్టుతో కలిసి పనిచేసేందుకు భారత్ సంసిద్ధతను ఆయన పంచుకున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్, ఐటీ, డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్స్, ఫార్మా, ప్రజల మధ్య సంబంధాలు వంటి రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసే మార్గాలపై చర్చించారు. ఈజిప్టు విదేశాంగ మంత్రి సమేహ్ షౌక్రీ, ఆర్థిక మంత్రి మహ్మద్ మైత్, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి అహ్మద్ సమీర్ సహా ఏడుగురు ఈజిప్టు కేబినెట్ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాగా.. ఆదివారం ఈజిప్టు అధ్యక్షుడు ఎల్ సీసీతో మోడీ భేటీ కానున్నారు.