ఓ కానిస్టేబుల్ సమయస్పూర్తి ఇద్దరు చిన్నారులను కాపాడింది. నీటిలో మునిగిపోతున్న ఇద్దరు చిన్నారులను కాపాడేందుకు ఆయన తన ధైర్య సాహసాలను ప్రదర్శించారు. ఆ పిల్లలిద్దరినీ సురక్షితంగా రక్షించాడు. 

మహారాష్ట్రలోని శాంతాక్రజ్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ సకాలంలో స్పందించిన తీరు జుహు బీచ్ లో ఇద్దరు పిల్లల ప్రాణాలను కాపాడింది. నీటిలో మునిగిపోతున్న ఇద్దరు చిన్నారులను పోలీసు కానిస్టేబుల్ విష్ణు భావ్రావ్ బేలే సురక్షితంగా రక్షించారు. ఈ ఘటన జుహూలోని కోలివాడ జుహు బీచ్ లో చోటుచేసుకుంది.

‘రాహుల్ గాంధీ మీకింకా సమయం మించి పోలేదు, పెళ్లి చేసుకోండి’- పాట్నా సమావేశంలో లాలూ ప్రసాద్ యాదవ్.. వీడియో వైరల్

వివరాలు ఇలా ఉన్నాయి. సమీర్ పవార్ (10), భీమ్ కాలే (7) శుక్రవారం సాయంత్రం జుహు బీచ్ లోని జుహు కోలివాడ ల్యాండింగ్ పాయింట్ ఎండ్ నుంచి ఈత కొట్టేందుకు సముద్రంలోకి వెళ్లారు. కొంత సమయంలోనే సముద్రపు బలమైన ప్రవాహాల్లో చిక్కుకుకున్నారు. దీంతో వారు ఈతకొట్టలేకపోయారు. అందులోనే మునిగిపోవడం ప్రారంభించారు. 

అయ్యో.. మంత్రి కాన్వాయ్ అనుకొని.. కేరళ ప్రతిపక్ష నాయకుడి కారుపైకి దూసుకెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలు..

ఈ సమయంలో శాంటాక్రూజ్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ విష్ణు భౌరావ్ బేలే అక్కడే ఉన్నారు. పిల్లల పరిస్థితిని ఆయన వెంటనే అర్థం చేసుకున్నారు. క్షణాల్లో సముద్రంలోకి వెళ్లారు. మునిగిపోతున్న వారిద్దరి దగ్గరికి వెళ్లి, వారిని రక్షించారు. ఈ విషయాన్ని ముంబై పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. సముద్రంలో మునిగిపోతున్న చిన్నారుల వైపు కానిస్టేబుల్ నడుచుకుంటూ వెళ్తున్న వీడియోను కూడా వారు విడుదల చేశారు. అందులో ఇద్దరు చిన్నారులను కానిస్టేబుల్ బయటకు తీసుకురావడం కనిపిస్తోంది. 

Scroll to load tweet…

అనంతరం పిల్లలిద్దరినీ వారి తల్లిదండ్రులకు అప్పగించినట్లు ముంబై పోలీసులు తెలిపారు. కాగా..ప్రాణాలను ఫణంగా పెట్టి లోతైన నీటిలోకి దిగి పిల్లలను కాపాడిన పోలీసును సన్మానించాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇదిలావుండగా.. ముంబైలోని పలు ప్రాంతాల్లో శనివారం కురిసిన భారీ వర్షాలకు మురుగు కాలువలో కొట్టుకుపోయి ఇద్దరు మృతి చెందారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసు సిబ్బంది మృతదేహాలను వెలికితీశారు.