ఓ ఇంట్లో భారీ పేలుడు సంభవించడంతో ఓ 17 ఏళ్ల బాలుడు మరణించాడు. మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన బీహార్ లోని బాబర్ గంజ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. వెంటనే అగ్నిమాపక, పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. 

బీహార్ లోని భాగల్ పూర్ జిల్లా బాబర్ గంజ్ ప్రాంతంలోని ఓ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 17 ఏళ్ల బాలుడు మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే ఈ ప్రమాదం సిలిండర్ పేలడం వల్ల సంభవించిందా ? లేక మరేదైనా కారణం ఉందా ? అనే విషయాన్ని వారు ఇంకా ధృవీకరించలేదు. 

ప్రాణాలను ఫణంగా పెట్టి.. నీటిలో మునిగిపోతున్న చిన్నారులను కాపాడిన కానిస్టేబుల్.. జుహూ బీచ్ లో ఘటన

పేలుడుకు గల అసలు కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటన బాబర్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ‘‘ మాకు శనిరవాం సాయంత్రం సిలిండర్ పేలినట్లు మాకు సమాచారం అందింది. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్), అగ్నిమాపక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. పేలుడు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. శిథిలాల తొలగింపు కొనసాగుతోంది’’ అని భాగల్పూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పీ) ఆనంద్ కుమార్ తెలిపారు.

‘రాహుల్ గాంధీ మీకింకా సమయం మించి పోలేదు, పెళ్లి చేసుకోండి’- పాట్నా సమావేశంలో లాలూ ప్రసాద్ యాదవ్.. వీడియో వైరల్

ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా.. గత నెలలో పశ్చిమబెంగాల్ లో కూడా ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. మే 22వ తేదీన దక్షిణ 24 పరగణాలు జిల్లాలోని ఓ కాలనీలో ఓ ఇంట్లో పేలుడు సంభవించింది. అయితే దీనికి అక్రమ బాణసంచా తయారే కారణమని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ ఇంటి దగ్గరలో ఉండే 10 ఏళ్ల బాలిక కూడా గాయపడింది. ఈ ఘటనలో ఓ మహిళా, బాలిక అక్కడిక్కడే చనిపోగా.. మరో మహిళ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణించింది.