Asianet News TeluguAsianet News Telugu

గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా బీహార్ లో ప్రశాంత్ కిశోర్ భారీ పాద‌యాత్ర‌.. ఎన్ని వేల కిలో మీట‌ర్లంటే ?

బీహార్ రాజకీయాల్లోకి ఎంట్రీ కావాలని భావిస్తున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. నేటి నుంచి ఆ రాష్ట్రంలో పాదయాత్ర మొదలుపెట్టనున్నారు. ఇది ఏడాదికి పైగా కొనసాగనుంది. 

Prashant Kishore's huge walk in Bihar on the occasion of Gandhi Jayanti.. how many thousand kilometers?
Author
First Published Oct 2, 2022, 9:10 AM IST

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఆదివారం నుండి బీహార్ లో భారీ పాదయాత్రను ప్రారంభించనున్నారు. పశ్చిమ చంపారన్ జిల్లా నుంచి ప్రారంభ‌మ‌య్యే ఈ యాత్ర దాదాపు 12 నుంచి 18 నెల‌ల పాటు కొన‌సాగుతుంది. మొత్తంగా 3,500  కిలో మీట‌ర్ల పాటు ఈ యాత్ర చేప‌ట్ట‌నున్నారు. ఈ యాత్ర‌తో బీహార్ లో ప్ర‌శాంత్ కిశోర్ రాజ‌కీయ ఎంట్రీకి బ‌లం చేకూరుతుంద‌ని భావిస్తున్నారు. 

నా భార్య అసలు ఆడదే కాదు... నాలాగే ఓ పురుషుడు : ఆరేళ్ళ కాపురం తర్వాత బయటపెట్టిన భర్త

ప్రశాంత్ కిశోర్ ఇది వ‌ర‌కే చేప‌ట్టిన ‘జన్ సూరజ్’ ప్రచారంలో భాగంగా ఈ యాత్ర చేప‌డుతున్నారు. ఈ యాత్ర లో భాగంగా ఆయ‌న ఎలాంటి విరామ‌మూ లేకుండా ప్ర‌తీ పంచాయ‌తీ, బ్లాక్ కు చేరుకోవడానికి ప్రయత్నిస్తారు. అధికారిక విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న ప్ర‌కారం.. 1917 లో జాతిపిత తన మొదటి సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించిన భితిహార్వాలోని గాంధీ ఆశ్రమం నుండి పీకే త‌న ప్రయాణాన్ని ప్రారంభిస్తారు.

మూడు ప్ర‌ధాన ల‌క్ష్యాలే భాగంగా ఈ యాత్ర కొన‌సాగ‌నుంది. ఇందులో మొట్ట మొద‌టిది అట్టడుగున ఉన్న సరైన వ్యక్తులను గుర్తించడం, వారిని ప్రజాస్వామ్య వేదికపైకి తీసుకురావడం.విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, పరిశ్రమలతో పాటు వివిధ రంగాలలో నిపుణుల అభిప్రాయాలను తీసుకోవ‌డం. ఆ అభిప్రాయాల వ‌ల్ల రాష్ట్రానికి ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేయ‌డం వంటివి ల‌క్ష్యాల్లో ఉన్నాయి. 

ఇకపై ఆ స‌ర్టిఫికెట్ ఉంటేనే.. పెట్రోల్ .. డిజిల్ ..

కాగా. అంతకు ముందు సెప్టెంబర్ లో ఎన్నికల వ్యూహకర్త పీకే.. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను కలుసుకున్నారు. అందులో సీఎం నుంచి వ‌చ్చిన ఓ నిర్ధిష్ట ఆఫ‌ర్ ను తిర‌స్క‌రించిన‌ట్టు పేర్కొన్నారు. కుమార్ 2018 లో ప్రశాంత్ కిశోర్ ను పార్టీలోకి చేర్చుకున్నారు. కొన్ని వారాల్లోనే ఆయ‌నకు జాతీయ ఉపాధ్యక్ష పదవిని క‌ట్ట‌బెట్టారు. అయితే పీకే సీఏఏ-ఎన్పీఆర్-ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా బహిరంగంగానే మాట్లాడారు. దీంతో 2020 లో పీకేను కుమార్ పార్టీ నుంచి బ‌హిష్క‌రించారు. జేడీ(యూ) ఆ స‌మ‌యంలో ఎన్డీఏకు మిత్ర‌ప‌క్షంగా ఉంది.

మోస్ట్ క్లీన్‌ సిటీగా ఇండోర్.. వ‌రుస‌గా ఆరోసారి రికార్డు.. ఆ తరువాత స్థానంలో ..

దీంతో వెనువెంట‌నే కిషోర్ ‘బాత్ బీహార్ కి’ అనే ప్రచారాన్ని ప్రారంభించాడు, అది మేధో సంపత్తి హక్కుల చట్టపరమైన వివాదంలో పడింది. తరువాత దానిని నిలిపివేశారు. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా తాను మునుపటి ప్రాజెక్ట్‌ను వదులుకున్నానని పేర్కొన్న కిషోర్, 2021 అసెంబ్లీ ఎన్నికలలో పశ్చిమ బెంగాల్ సీఎంకు అండ‌గా నిల‌బ‌డ్డారు. ఆమెకు భారీ విజ‌యాన్ని చేకూర్చ‌డంలో కీల‌క పాత్ర పోషించారు. 

రాజ్యాంగాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉంది: స్టాలిన్

అయితే త‌రువాతి కాలంలో ఆయ‌న కాంగ్రెస్ లో చేరాలని భావించారు. త‌నకు పూర్తి స్థాయి స‌భ్య‌త్వం ఇచ్చి, స్వేచ్ఛ‌ను ఇస్తే పార్టీని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. ఈ క్ర‌మంలో ఆ పార్టీ హైక‌మాండ్ తో  సుదీర్ఘకాలంగా చర్చలు జ‌రిపారు. కానీ అవి విఫ‌లం అయ్యాయి. దీంతో ప్ర‌శాంత్ కిషోర్ ఈ ఏడాది మొద‌ట్లో ‘జన్ సురాజ్’ యాత్రను ప్రారంభించడానికి బీహర్ కు వచ్చారు. ఇక కేవ‌లం బీహార్ రాజ‌కీయాల‌పైనే దృష్టి పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios