Asianet News TeluguAsianet News Telugu

మోస్ట్ క్లీన్‌ సిటీగా ఇండోర్.. వ‌రుస‌గా ఆరోసారి రికార్డు..   ఆ తరువాత స్థానంలో ..

‘స్వచ్ఛ్ సర్వేక్షణ్ అవార్డ్స్ 2022’లో మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో నిలువగా, గుజరాత్‌, మహారాష్ట్ర తర్వాత స్థానాల్లో నిలిచాయి. పెద్ద నగరాల కేటగిరిలో ఇండోర్‌, సూరత్ వ‌రుస‌గా అగ్రస్థానంలో నిలువ‌గా.. గత ఏడాది మూడో స్థానంలో ఉన్న విజయవాడ దానిని కోల్పోయింది. ఆ స్థానాన్ని నవీ ముంబై దక్కించుకుంది.

Central Govt Annual Cleanliness Survey Madhya Pradesh Gets 1st Followed By Chhattisgarh And Maharashtra
Author
First Published Oct 2, 2022, 6:01 AM IST

దేశంలో అత్యంత‌ పరిశుభ్రమైన నగరంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ వరుసగా ఆరోసారి అగ్రస్థానంలో నిలిచింది. సూరత్‌, ముంబై వ‌రుస‌గా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌ సర్వే వివరాలను శనివారం విడుదల చేశారు. 'స్వచ్ఛ్ సర్వేక్షణ్ పురస్కార్ 2022'లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాల విభాగంలో మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో నిలవగా, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

స్వచ్ఛ్ సర్వేక్షణ్ ఏడవ ఎడిషన్ లో స్వచ్ఛ భారత్ మిషన్ (అర్బన్) పురోగతిని అధ్యయనం చేయడానికి,  వివిధ పారిశుద్ధ్య పారామితుల ఆధారంగా పట్టణ స్థానిక సంస్థలకు (యుఎల్‌బి) ర్యాంక్ ఇవ్వడానికి నిర్వహించబడింది. స్వచ్ఛ్ సర్వేక్షణ్ భాగంగా... 2016లో కేవలం 73 నగరాల్లో స‌ర్వే నిర్వ‌హించ‌గా.. ప్ర‌స్తుతం ఈ సంవత్సరం 4354 నగరాల (62 కంటోన్మెంట్ బోర్డులు,  91 గంగా పట్టణాలతో సహా)ల్లో స‌ర్వే నిర్వ‌హించింది. శనివారం న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తదితరులు పాల్గొన్నారు.

అలాగే.. సరిహద్దు పట్టణాల కేటాగిరిలో  పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ అత్యంత పరిశుభ్రమైన నగరంగా ప్ర‌థ‌మ స్థానంలో నిలువ‌గా.. అబోహర్ రెండవ స్థానంలో నిలిచింది.  1 నుంచి 10 లక్షల జనాభా ఉన్న నగరాల విభాగంలో రెండు న‌గ‌రాలు మాత్ర‌మే పోటీ పడ్డారు. అలాగే. ఫిరోజ్‌పూర్ దేశవ్యాప్త ర్యాంకింగ్స్‌లో కూడా.. తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది, గతేడాది 76వ స్థానం నుండి ఈ ఏడాది 6,000 మార్కులకు 4,645  పాయింట్లు సాధించి 64వ స్థానానికి చేరుకుంది. 

గ‌తేడాది.. పాటియాలా దేశంలో 58వ స్థానంలో ఉండ‌గా.. ఈ ఏడాది పంజాబ్‌లో అత్యంత పరిశుభ్రమైన  న‌గ‌రంగా ఎంపికైంది. అయితే ఈ ఏడాది రాయల్ సిటీ 117వ స్థానానికి దిగజారింది.  ఫిరోజ్‌పూర్ డిప్యూటీ కమిషనర్ (డీసీ) అమృత్ సింగ్ మాట్లాడుతూ.. ఈ ఘనత మున్సిపల్ కమిటీకి, నివాసితులకే దక్కుతుందని అన్నారు
 
50,000 నుండి 1 లక్ష మధ్య జనాభా ఉన్న నగరాల కేటగిరీలో.. ఉత్తర ప్రాంతంలో మండి గోవింద్‌గఢ్ అగ్రస్థానంలో ఉండగా, ఫజిల్కా మూడవ స్థానంలో మరియు రాజ్‌పురా నాల్గవ స్థానంలో నిలిచారు, ఆ తర్వాత జిరాక్‌పూర్ ఆరవ స్థానంలో, సమనా ఏడవ స్థానంలో మరియు ఖరార్ 10వ స్థానంలో నిలిచారు. గతేడాది ఈ విభాగంలో రాజ్‌పురా అగ్రస్థానంలో నిలిచింది.

అదేవిధంగా, 25,000 మరియు 50,000 మధ్య జనాభా ఉన్న నగరాల విభాగంలో ఉత్తర ప్రాంతంలో నవన్‌షహర్ అగ్రస్థానంలో ఉండగా, నంగల్ 2వ స్థానంలో, కురాలి 3వ స్థానంలో, జిరా 6వ స్థానంలో, పాత్రన్ 7వ స్థానంలో, రాయికోట్ 8వ స్థానంలో, జలాలాబాద్ 9వ స్థానంలో నిలిచాయి. 

నార్త్ జోన్‌లో 15,000 మరియు 25,000 మధ్య జనాభా ఉన్న పట్టణాల కేటగిరీలో మూనాక్ మొద‌టి స్థానంలో నిలువ‌గా.. ఆనంద్‌పూర్ సాహిబ్‌ 2వ స్థానాల్లో నిలిచింది. 

ఇండోర్  దేశంలోనే పరిశుభ్రమైన నగరంగా వరుసగా ఆరోసారి ఎన్నిక కావడం పట్ల మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్ నాథ్ శనివారం సంతోషం వ్యక్తం చేశారు. “స్వచ్ఛ్ సర్వేక్షణ్ 2022లో 100 కంటే ఎక్కువ నగరాలు పోటీ ప‌డ‌గా.. అత్యంత పరిశుభ్రమైన నగ‌రంగా ఇండోర్ గుర్తింపు పొందినందుకు మధ్యప్రదేశ్ ప్రజలకు హృదయపూర్వక అభినందనలు. పరిశుభ్రత యొక్క సంకల్పంపై ఎల్లప్పుడూ మాకు మార్గనిర్దేశం చేసిన గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీకి చాలా ధన్యవాదాలు అని ట్విట్ చేశారు. 

‘స్వచ్ఛ్ సర్వేక్షణ్ అవార్డ్స్ 2022’లో మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో నిలువగా, గుజరాత్‌, మహారాష్ట్ర తర్వాత స్థానాల్లో రాణించాయి. పెద్ద నగరాల కేటగిరిలో ఇండోర్‌, సూరత్‌ అగ్రస్థానంలో ఉన్నాయి. గత ఏడాది మూడో స్థానంలో ఉన్న విజయవాడ దానిని కోల్పోయింది. ఆ స్థానాన్ని నవీ ముంబై దక్కించుకుంది.

మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ట్వీట్ చేస్తూ.. "స్వచ్ఛ సర్వే-2022లో 100 కంటే ఎక్కువ నగరాలు పోటీ ప‌డ‌గా...ఇండోర్ ప్ర‌థ‌మ స్థానంలో నిలువ‌డం గ‌ర్వ‌కార‌ణం.. ప‌రిశుభ్ర‌త‌పై అవగాహన ఉన్న ప్రజలకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. మధ్యప్రదేశ్‌కు చెందిన సఫాయి మిత్రా దీనికి అర్హుడని, రాత్రింబవళ్లు కష్టపడి రాష్ట్రాన్ని ఈ స్థానాన్ని సాధించేలా చేసింది. స్వచ్ఛ సర్వేక్షణ్-2022లో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరం వరుసగా ఆరోసారి పరిశుభ్రతలో దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం మనందరికీ గర్వకారణమ‌ని ట్వీట్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios