Asianet News TeluguAsianet News Telugu

భారత తొలి ప్రైవేట్ రాకెట్ ‘విక్రమ్-ఎస్’ వాయిదా.. ఎందుకంటే ?

భారతదేశంలో మొట్టమొదటి సారిగా ఓ ప్రైవేట్ స్పేస్ కంపెనీ రూపొందించిన రాకెట్ ప్రయోగం వాయిదా పడింది. ఈ నెల 18వ తేదీన మళ్లీ దీనిని ప్రయోగించనున్నారు. 

Postponement of India's first private rocket 'Vikram-S'.. because?
Author
First Published Nov 15, 2022, 8:52 AM IST

హైదరాబాద్ కు చెందిన స్పేస్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ ‘విక్రమ్-ఎస్’ మంగళవారం ప్రయోగించాల్సి ఉండగా ప్రతికూల వాతావరణం వల్ల అది వాయిదా పడింది. మళ్లీ దీనిని నవంబర్ 18 న ఉదయం 11.30 గంటలకు ప్రయోగిస్తామని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రకటించింది.

మిజోరంలో కుప్పకూలిన స్టోన్ క్వారీ.. 12 మంది మృతి చెందినట్లు అనుమానాలు..!

ఆ సమయంలో కూడా బంగాళాఖాతం ఆగ్నేయంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడుతుందని ఐఎండీ చెప్పినప్పటికీ.. ఈ సారి ప్రయోగాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశమే కనిపిస్తోంది. గత 10 రోజులుగా శ్రీహరికోటలో మకాం వేసిన విక్రమ్-ఎస్ ను రూపొందించిన కంపెనీ స్కైరూట్ సహ వ్యవస్థాపకుడు పవన్ చందన మాట్లాడుతూ.. ‘‘ ఇస్రో ఇచ్చిన మా కొత్త ప్రయోగ విండో నవంబర్ 15 నుంచి 19 మధ్య ఉంటుంది. అయితే నవంబర్ 18న ప్రయోగం జరిగే అవకాశం ఉంది. మా వాహనం లైట్-వెయిట్ రాకెట్, ఏరోడైనమికల్ గా నడుస్తుంది. కాబట్టి గాలి వేగం ఇందులో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతానికి గాలులు పరిమితిలోనే ఉన్నాయి. ఇది రాకెట్ లాంచ్ చేయడానికి మంచి సమయం ’’అని తెలిపారని ‘ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్’ కథనం  నివేదించింది.

అమానుషం.. గోడకు మేకు కొట్టి.. కుక్క మెడకు తాడు కట్టి.. కిరాతకంగా ఉరితీసిన దుండగులు...

గత వారం లాంచ్ కోసం మా వెహికిల్ సంసిద్ధతను స్వతంత్రంగా తనిఖీ చేసిన ఐఎన్-స్పాస్ కమిటీ నుంచి తమకు టెక్నికల్ క్లియరెన్స్ లభించిందని పవన్ చెప్పారు. వెహికల్ ఆరోగ్యంగా ఉంది. ‘‘అన్ని క్లిష్టమైన చెక్ లను పాస్ చేసింది. రాబోయే శుక్రవారం మాకు ఒక పెద్ద రోజు అవుతుంది. ఇది మా మొదటి మిషన్, ఇది ఒక రకమైన ప్రయోగాత్మక విమానం. ఇది భవిష్యత్ కక్ష్యా మిషన్ల కోసం ఉపయోగించే అన్ని విమాన మాడ్యూల్స్ ను ధృవీకరిస్తుంది.’’ అని పేర్కొన్నారు.

హెలికాప్టర్ శబ్దానికి లక్షల విలువైన నా గేదె చనిపోయింది...పైలెట్ పై వృద్ధుడి ఫిర్యాదు... 

స్కైరూట్ టీంలోని కొందరు సభ్యులు నెల రోజులుగా శ్రీహరికోటలో మకాం వేశారు. అప్పటి నుంచి కీలకమైన తనిఖీలు నిర్వహించి, రాకెట్ ను ఇస్రో కమ్యూనికేషన్ నెట్ వర్క్ తో అనుసంధానం చేస్తున్నారు. కాగా.. విక్రమ్-ఎస్ రాకెట్ ఒక సింగిల్-స్టేజ్ సబ్-ఆర్బిటల్ వెహికల్, ఇద్దరు భారతీయ, ఒక విదేశీ వినియోగదారుల పేలోడ్లను తీసుకువెళుతుంది. ఈ మిషన్ ను విజయవంతంగా పూర్తి చేస్తే.. అంతరిక్షంలోకి రాకెట్ ను ప్రయోగించిన భారతదేశ మొట్టమొదటి ప్రైవేట్ స్పేస్ కంపెనీగా ‘స్కైరూట్’చరిత్ర సృష్టిస్తుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios