Asianet News TeluguAsianet News Telugu

అమానుషం.. గోడకు మేకు కొట్టి.. కుక్క మెడకు తాడు కట్టి.. కిరాతకంగా ఉరితీసిన దుండగులు...

ఓ ముగ్గురు యువకులు ఓ గోడకు మేకుకొట్టి.. దానికి తాడుకట్టి కుక్కమెడకు బిగించి.. చనిపోయేవరకు ఉరితీసిన ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. 

youth tie rope around dog's neck, hang till it dies in Uttar Pradesh
Author
First Published Nov 15, 2022, 7:06 AM IST

ఉత్తరప్రదేశ్ : ఉత్తరప్రదేశ్ లో ఓ అమానవీయ..అమానుష ఘటన జరిగింది. కొందరు దుండగులు ఓ కుక్కను ఉరితీసి అతికిరాతకంగా హతమార్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందులో ముగ్గురు వ్యక్తులున్నారు. ఇద్దరు వ్యక్తులు గోడకు మేకు కొట్టి కుక్క మెడకు తాడు కట్టి వేలాడదీశారు. మూడో వ్యక్తి అక్కడే నిల్చున్నాడు. ఎవరో ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిమీద జంతుప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఆటవిక చర్యకు పాల్పడిన వారిమీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

గతంలో ఇలాంటి ఘటనలు కూడా వైరల్ అయ్యాయి. కుక్కను కారుకు కట్టి దారుణంగా ఈడ్చుకెళ్లిన ఘటన రాజస్థాన్ లో వెలుగుచూసింది. ఆ పని చేసింది.. పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్న డాక్టర్. దీంతో అతని మీద జంతుహింస చట్టం కింద కేసు నమోదయ్యింది. ఇక ఓ యూట్యూబర్ హీలియం బెలూన్లకు కుక్కను కట్టి పైకి ఎగురవేయడం.. కూడా వీడియో వైరల్ అయ్యింది. దీంతో అతడి మీద కూడా ఇలాంటి కేసే నమోదయ్యింది. 

ఇదేం పైశాచిక‌త్వం.. కుక్క‌ను కారుకు క‌ట్టి ఈడ్చుకెళ్లిన డాక్ట‌ర్.. వీడియో వైర‌ల్.. ఎక్క‌డ జరిగిందంటే ?

ఇదిలా ఉండగా, మరోవైపు పెంపుడు కుక్కకంటే మనిషి ప్రాణాలు తక్కువగా కనిపించాయి.. అతనికి.. దానిమీది ప్రేమ.. అతడిని రాక్షసుడిని చేసింది. విచక్షణ మరిచిపోయి హంతకుడిగా మారేలా చేసింది. తన పెంపుడు కుక్కకి ఆహారం పెట్టడం విషయంలో ఆలస్యం చేసాడనే కోపంతో ఓ యువకుడు తనకు వరుసకు సోదరుడు అయ్యే బంధువును  కొట్టి చంపాడు. ఈ దారుణమైన ఘటన కేరళలోని పాలక్కడ్ లో  చోటు చేసుకుంది. కాగా నిందితుడు హాకీంను ఘటన జరిగిన రెండు రోజులకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

హకీం ఇక్కడ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడని పోలీసులు తెలిపారు. హాకీంతో పాటు  అతని బంధువు అర్షద్(21) కూడా అక్కడే ఉంటున్నాడని పేర్కొన్నారు. ఈ క్రమంలో తన కుక్కకి ఆహారం అందించే విషయంలో ఆలస్యం చేశాడని అతనిపై హకీమ్ దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన అర్షద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఆస్పత్రి సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios