Asianet News TeluguAsianet News Telugu

మిజోరంలో కుప్పకూలిన స్టోన్ క్వారీ.. 12 మంది మృతి చెందినట్లు అనుమానాలు..!

మిజోరంలో విషాద ఘటన వెలుగు చూసింది. ఓ ప్రైవేట్ స్టోన్ క్వారీ కుప్పకూలింది. క్వారీ కూలిన సమయంలో ఆ స్థలంలో 15 మంది ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

At least feared 12 dead in stone quarry collapse in Mizoram
Author
First Published Nov 15, 2022, 7:56 AM IST

మిజోరం : మిజోరంలోని హ్నాథియల్ జిల్లాలో సోమవారం ఓ  రాతి క్వారీ కూలిపోవడంతో కనీసం దానికింద 15 మంది చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. మధ్యాహ్నం 2.40 గంటల ప్రాంతంలో మౌదర్ గ్రామం వద్ద క్వారీ కూలిపోయింది. ఏబిసిఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన క్వారీలో కార్మికులు పనిచేస్తున్నప్పుడు ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.

క్వారీ కూలిపోయిన సమయంలో దాదాపు 15 మంది వ్యక్తులు ఆ ప్రదేశంలో ఉన్నట్లు భావిస్తున్నామని మిజోరాం విపత్తు నిర్వహణ, పునరావాస శాఖ అదనపు కార్యదర్శి లాల్‌హ్రియత్‌పుయా తెలిపారు. "రాత్రి 8 గంటల వరకు మృతదేహాలు ఏవీ వెలికితీయడం కుదరలేదు" అని జిల్లా నుండి వచ్చిన నివేదికలను ఉటంకిస్తూ అన్నారు. అంతేకాదు క్రూడ్ పద్ధతిలో క్వారీయింగ్ చేయడమే ఈ  విషాదానికి కారణమైందని ఆయన అన్నారు. ఘటనా స్థలంలో వైద్య బృందం ఉన్నట్లు జిల్లా అధికారులు తెలిపారు.

మిజోరాంలో సోమవారం విషాద ఘటన చోటుచేసుకుంది. హ్నాథియాల్ జిల్లా మౌదర్ లో ఓ ప్రైవేట్ కంపెనీ నిర్వహిస్తున్న క్వారీ ఉన్నట్టుంది కుప్పకూలింది. ఈ ఘటనలో 12మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. వీరంతా బీహార్కు చెందిన వారని సమాచారం. మధ్యాహ్నం భోజన విరామం పూర్తి చేసుకుని తిరిగి పని కోసం క్వారీలోకి వెళ్లిన సమయంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. 

అమానుషం.. గోడకు మేకు కొట్టి.. కుక్క మెడకు తాడు కట్టి.. కిరాతకంగా ఉరితీసిన దుండగులు...

కార్మికులతో పాటు ఐదు ఎక్స్ కవేటర్లు, డ్రిల్లింగ్ మిషన్ లు ఇతర సామాగ్రి శిథిలాల కింద ఉన్నట్లు తెలుసుకున్న స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై ఎస్ డీఆర్ఎఫ్, బిఎస్ఎఫ్ గ్రంథాలతోపాటు అస్సాం రైఫిల్స్ ను రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతుంది. కార్మికులను ప్రాణాలతో బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. క్వారీలో దాదాపు రెండున్నరేళ్లుగా  పనులు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా, నిరుడు జులైలో గుంటూరు జిల్లాలో ఇలాంటి ప్రమాదమే నలుగురిని బలి తీసుకుంది. ఏపీలోని ప్రతిపాడుకు చెందిన లంబు వంశీ (21), సిద్ధం శెట్టి వెంకటేష్  (21), జిల్లా సాయి ప్రకాష్ (23), వీర శంకర్ రెడ్డి (22), పాతపాటి యశ్వంత్, ఉదయగిరి హేమంత్ స్నేహితులు. ఆదివారం కావడంతో వీరంతా కలిసి రెండు ద్విచక్ర వాహనాలపై ప్రత్తిపాడు మండలం తుమ్మల పాలెం డైట్ కళాశాల సమీపంలోని కొండ క్వారీ వైపు వెళ్లారు. వర్షం పడటం వల్ల కొందరి కాళ్లకు బురద అయింది.

దీంతో కాళ్లు కడుక్కునేందుకు కొండల మధ్యన ఉన్న లోతైన క్వారీ గుంతలోకి ముందుగా శంకర్ రెడ్డి, సాయి దిగారు. రెండు మూడు అడుగులు ముందుకు వేసిన తర్వాత వారు పైకి రాలేక ఇబ్బంది పడుతుండడాన్ని గమనించిన వంశీ, వెంకటేష్ తాము కూడా దిగారు. స్నేహితులను కాపాడే క్రమంలో వారితో పాటు వీరిద్దరూ మునిగిపోయారు. అలా నలుగురు యువకులు గల్లంతు కావడంతో ఆ ప్రాంతమంతా బంధువుల రోదనలతో మిన్నంటి పోయింది. 

ఎన్డీఆర్ఎఫ్ బృందం అర్ధరాత్రి 12 గంటల వరకు క్వారీ లో గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలిస్తూనే ఉన్నారు. గుంటూరు సౌత్‌జోన్‌ డి ఎస్ పి జెస్సీ ప్రశాంతి, ఆర్డీవో భాస్కర్ రెడ్డి, ప్రత్తిపాడు ఎస్.ఐ అశోక్, తహసిల్దార్ ఏం. పూర్ణచంద్రరావుతో పాటు అధికార యంత్రాంగం అంతా అక్కడే ఉండి గాలింపు చర్యలు పర్యవేక్షిస్తున్నారు.ఓ దశలో సాయిప్రకాష్ చేతులు పైకి లేపి కాపాడండి అంటూ పెద్దగా అరవడంతో ఒడ్డున ఉన్న పాతపాటి యశ్వంత్‌ తనకు పెద్దగా ఈత రాకపోయినా స్నేహితుని కాపాడేందుకు నీళ్లలోకి చేయి అందించాడు. అతన్ని బయటకు లాగేందుకు శతవిధాలా యత్నించాడు చివరకు ఫలితం లేకపోవడంతో సాయి చేయి విడువక తప్పలేదని యశ్వంత్ కన్నీరుమున్నీరయ్యారు. 

Follow Us:
Download App:
  • android
  • ios