Asianet News TeluguAsianet News Telugu

పోర్నోగ్రఫీ కేసు.. శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాకు ముందస్తు బెయిల్ మంజూరు

పోర్నోగ్రఫి కేసులో నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాకు సుప్రీంకోర్టు మంగళవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆయనతో పాటు మరో నలుగురు నిందితులకు కూడా ముందస్తు బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

Pornography case.. Shilpa Shetty's husband Raj Kundra granted anticipatory bail
Author
First Published Dec 13, 2022, 12:35 PM IST

అశ్లీల చిత్రాలకు సంబంధించిన కేసులో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త అయిన రాజ్ కుంద్రాకు సుప్రీంకోర్టు మంగళవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆయనతో పాటు మరో నలుగురు నిందితులకు కూడా ధర్మాసనం బెయిల్ ఇచ్చింది.

చైనా రాయబార కార్యాలయం నుంచి డబ్బులు తీసుకుంది ఎవరు? : కాంగ్రెస్‌పై అమిత్ షా ఫైర్

అశ్లీల కంటెంట్‌ను పంపిణీ చేశారనే ఆరోపణలపై ముంబై పోలీసులు 2020లో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించిన కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు రాజ్ కుంద్రా చేసిన విజ్ఞప్తిని బాంబే హైకోర్టు నవంబర్ 25న తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

కర్ణాటకలో జికా వైరస్ కలకలం.. తొలిసారిగా ఐదేళ్ల బాలికకు సోకిన వ్యాధి

కాగా.. గత నెలలో మహారాష్ట్ర సైబర్ పోలీసులు రాజ్ కుంద్రా అశ్లీల కంటెంట్‌ను తయారు చేశారని ఆరోపిస్తూ ఛార్జిషీట్ దాఖలు చేశారు, దానిని ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు పంపిణీ చేశాయని తెలిపారు. షెర్లిన్ చోప్రా, పూనమ్ పాండే, సినీ నిర్మాత మీటా జున్‌జున్‌వాలా, కెమెరామెన్ రాజు దూబేతో కలిసి ఫైవ్‌స్టార్ హోటళ్లలో కుంద్రా అశ్లీల చిత్రాలు లేదా అశ్లీల వీడియోలు చిత్రీకరించినట్లు చార్జిషీట్‌ పేర్కొంది.

'ప్రధానమంత్రిని చంపడానికి సిద్ధంగా ఉండండి': వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత అరెస్ట్

అయితే ఈ కేసులో ఛార్జిషీట్‌ లో దాఖలైన అంశాలపై కుంద్రా తరపు న్యాయవాది ప్రశాంత్ పాటిల్ స్పందిస్తూ.. మీడియా నివేదికల ద్వారానే తనకు ఈ విషయం తెలిసిందని పేర్కొన్నారు. ఈ నేరంతో తన క్లయింట్‌కు ఎలాంటి సంబంధం లేదని కూడా చెప్పారు. “ముంబయి సైబర్ క్రైమ్ కోర్టు ముందు ఈ విషయంపై ఛార్జిషీట్ దాఖలైందని తమకు మీడియా ద్వారానే తెలిసింది. న్యాయపరమైన ప్రక్రియను అనుసరించి, చార్జిషీట్ కాపీని సేకరించేందుకు కోర్టు ముందు హాజరవుతాం” అని పాటిల్ చెప్పారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios