'ప్రధానమంత్రిని చంపడానికి సిద్ధంగా ఉండండి': వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత అరెస్ట్
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నేత రాజ పటేరియాను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోడీ.. మతం, కులం, భాష ప్రాతిపదికన ప్రజలను విభజిస్తున్నారనీ, దళితులు, గిరిజనులు, మైనారిటీల జీవితాలు ప్రమాదంలో ఉన్నాయనీ, రాజ్యాంగాన్ని కాపాడాలంటే మోడీని చంపేందుకు కార్యకర్తలు సిద్ధం కావాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.

మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్, మాజీ మంత్రి రాజా పటేరియాను దామోహ్‌లో పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి పాట్రియా మాట్లాడుతూ.. ‘ప్రధాని మోడీ.. మతం, కులం, భాష ప్రాతిపదికన ప్రజలను విభజిస్తున్నారు. దళితులు, గిరిజనులు, మైనారిటీల జీవితాలు ప్రమాదంలో ఉన్నాయి. రాజ్యాంగాన్ని కాపాడాలంటే మోడీని చంపేందుకు కార్యకర్తలు సిద్ధం కావాలి’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మధ్యప్రదేశ్ లో రాజకీయ ప్రకంపనాలు చేలారేగాయి. దీంతో బీజేపీ నేతలు కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. అలాగే పాట్రియాపై ఎన్‌ఎస్‌ఏ విధించాలని డిమాండ్ చేశారు. పటారియా వివాదాస్పద ప్రకటనపై పన్నాలో కేసు నమోదైంది. తాజాగా మాజీ మంత్రి రాజా పటారియాను దామోలోని ఆయన నివాసం నుంచి పన్నా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు ఈ విషయంపై విచారణ చేస్తున్నారు
పాట్రియా వివరణ
రాష్ట్రవ్యాప్తంగా వివాదం ముదరడంతో.. మాజీ మంత్రి రాజా పటారియా క్లారిటీ ఇచ్చారు. హత్యలు చేయడం అంటే ప్రధాని నరేంద్ర మోదీని ఎన్నికల్లో ఓడించడమేనని అన్నారు. తాను గాంధీ సిద్ధాంతాలను అనుసరించే వ్యక్తిని, ఎవరినీ చంపాలని ఆలోచించలేదనీ, తన ప్రకటనను వక్రీకరించారని అన్నారు. ఈ వ్యాఖ్యలు వివాదం చెలారేగడంతో ఈ మంత్రిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేసింది. పటారియా ప్రకటన తర్వాత.. ఎంపీ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. దీని తర్వాత.. ఎంపీ పోలీసులు పట్రియాపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పటారియాపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది.రాష్ట్రవ్యాప్తంగా పట్రియాకు వ్యతిరేకంగా బీజేపీ నిరసనలు చేపట్టింది.
పాట్రియా ఏమన్నారు ?
సోమవారం మధ్యాహ్నం పన్నా జిల్లా పొవైలో మాజీ మంత్రి రాజా పటారియా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. మోడీ ఎన్నికలను ముగుస్తుంది. మోడీ భారతదేశాన్ని మతం, కులం, భాష ప్రాతిపదికన విభజిస్తారని, దళితులు, గిరిజనులు, మైనారిటీల జీవితాలు ప్రమాదంలో ఉన్నాయని అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడాలంటే.. మోడీని చంపేందుకు సిద్ధంగా ఉండండని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.