ఆద్యంతం ఉత్కంఠభరితం.. నేడే చంద్రయాన్ - 3 ప్రయోగం.. శ్రీహరి కోట నుంచి నింగిలోకి.. పూర్తి వివరాలివే..
నేడు ఏపీలోని శ్రీహరి కోట నుంచి చంద్రయాన్ - 3 నింగిలోకి దూసుకెళ్లనుంది. చంద్రయాన్ -2 విఫలంకావడంతో ఈ తాజా ప్రయోగంపైనే దేశం మొత్తం దృష్టి పెట్టింది. ఈ ప్రయోగం విజయవంతం చేేసేందుకు ఇస్రో అనేక జాగ్రత్తలు తీసుకుంది.
యావత్ భారతదేశం ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న చంద్రయాన్-3 నేడు మధ్యాహ్నం 2.35 గంటలకు ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది. దేశం ఆశలను మోసుకెళ్తున్న ఈ ప్రయోగం విజయవంతమైతే చంద్రుడిపై అడుగుపెట్టిన నాలుగో దేశంగా భారత్ అవతరించనుంది.
భారతీయ విద్యార్థులకు శుభవార్త.. స్టడీ వీసాలపై ప్రధాని కీలక ప్రకటన..
బాహుబలి రాకెట్ గా పిలిచే జీఎస్ ఎల్ వీ మార్క్ 3 హెవీ లిఫ్ట్ లాంచ్ వెహికల్ పై ల్యాండర్ విక్రమ్ ను నింగిలోకి పంపనున్నారు. లాంచ్ వెహికల్ మార్క్ 3 (ఎల్ఎం-3)గా నామకరణం చేసిన జీఎస్ఎల్వీ ఎత్తు 43.5 మీటర్లు. ఈ వాహనం ప్రయాణానికి 40 రోజుల సమయం పడుతుంది. అంటే ఆగస్టు 23న వ్యోమనౌక చంద్రుడిపై దిగనుంది.
2019 జూలైలో చివరి చంద్ర మిషన్ విఫలం కావడంతో యావత్ దేశం నిరాశకు గురైంది. ‘‘గత చంద్రయాన్ -2 మిషన్ లో ఓ లోపం ఎదురైంది. సురక్షితంగా ల్యాండింగ్ అయ్యే పరిస్థితిని నౌక తట్టుకోలేకపోయింది’’ అని ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ ‘ఎన్డీటీవీ’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు.
'భారత్, ఫ్రాన్స్ మధ్య స్నేహం విడదీయలేనిది' : ప్రధాని మోడీ పారిస్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
నీటి అణువులు కనుగొన్న చంద్రుడి దక్షిణ ధ్రువంలో తొలిసారిగా భారత్ కు చెందిన మూన్ క్రాఫ్ట్ ల్యాండ్ కానుంది. 2008లో భారత్ చేపట్టిన తొలి మూన్ మిషన్ సందర్భంగా చేసిన ఈ పరిశోధన ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. విక్రమ్ సేఫ్, సాఫ్ట్ ల్యాండింగ్ ఉంటుంది. ఆ తర్వాత చంద్రుడి ఉపరితలంపై 14 రోజుల పాటు తిరిగే రోవర్ ప్రజ్ఞాన్ ను ల్యాండర్ విడుదల చేసి శాస్త్రీయ ప్రయోగాలు చేయనుంది.
చంద్రుడి ఉపరితలం చుట్టూ తిరిగే అక్కడి మట్టిని, ఆ గ్రహంపై సంభవించే భూకంపాలను కూడా విశ్లేషించాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. గత చంద్ర మిషన్ నుంచి పాఠాలు నేర్చుకున్న ఇస్రో ల్యాండర్ లోని ఇంజిన్ల సంఖ్యను ఐదు నుంచి నాలుగుకు తగ్గించి సాఫ్ట్ వేర్ ను అప్ డేట్ చేసింది. ప్రతీ ఇంజిన్ కు కఠినమైన పరీక్షలు నిర్వహించింది. కొన్ని అంశాలు విఫలమైనా విజయవంతంగా ల్యాండ్ అయ్యేలా కొత్త మిషన్ ను రూపొందించినట్లు సోమనాథ్ వివరించారు. సెన్సర్ ఫెయిల్యూర్, ఇంజిన్ ఫెయిల్యూర్, అల్గారిథమ్ ఫెయిల్యూర్, లెక్కింపు ఫెయిల్యూర్ వంటి అనేక సందర్భాలను పరిశీలించి వాటిని ఎదుర్కొనే చర్యలను అభివృద్ధి చేశారు.
కాశ్మీర్ లో ముగ్గురు స్థానికేతరులపై ఉగ్రవాదులు కాల్పులు
భారతదేశం తరఫున చంద్రుడికి పైకి 2008 అక్టోబర్ లో మొదటి మిషన్ చంద్రయాన్ -1 ను పంపించారు. అది 2009 ఆగస్టు వరకు పనిచేసింది. 2019లో చంద్రయాన్-2లోని ల్యాండర్ అనుకున్న మార్గం నుంచి పక్కకు తప్పి హ్యాండ్ ల్యాండింగ్ కు గురైంది. ఆర్బిటర్ ఇప్పటికీ చంద్రుడి చుట్టూ తిరుగుతూ డేటాను పంపుతోంది.