Asianet News TeluguAsianet News Telugu

వామ్మో.. పెళ్లై పిల్లలున్నా మళ్లీ వివాహాలు.. డబ్బు, నగలు తీసుకొని ఉడాయించడమే ఆమె పని..

పెళ్లి కాని యువకులే ఆమె టార్గెట్. వారిని ప్రేమిస్తున్నట్టు నమ్మించి, పెళ్లి చేసుకొని డబ్బు, నగలను తీసుకొని ఉడాయించడమే ఆమె ప్రవృత్తి. ఇలా నిత్యపెళ్లిళ్లు చేసుకుంటూ మోసానికి పాల్పడుతున్న మహిళను తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు.

Police arrested a woman who was married and had children and was remarrying again.
Author
First Published Dec 3, 2022, 9:37 AM IST

ఆమెకు పెళ్లయ్యింది. ఓ బాబు కూడా ఉన్నాడు. కానీ ఆ విషయాన్ని దాచి పెట్టి పెళ్లిళ్లు చేసుకోవడమే ఆమె పనిగా పెట్టుకుంది. ఇప్పటి వరకు ఇలా మొత్తంగా నాలుగు వివాహాలు చేసుకుంది. అయితే నాలుగో భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఆమెను అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఎన్నో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

తమిళనాడు ఆలయాల్లోకి ఇక సెల్ ఫోన్లు నో ఎంట్రీ.. మొబైల్స్ పై నిషేధం విధించిన మద్రాసు హైకోర్టు

వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడుకు చెందిన 25 ఏళ్ల నటరాజన్ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీలో పని చేస్తున్నాడు. అతడు తాంబారం  రంగనాథపురం అనే ప్రాంతంలో నివసించేవాడు. అయితే తాంబారంకు స్థానికంగా ఉన్న ఓ స్వీట్ హౌస్ లో పనిచేసే 28 ఏళ్ల అభినయ పరిచయం అయ్యింది. ఈ పరిచయం కొన్ని రోజుల తరువాత ప్రేమగా మారింది. అయితే ఈ ప్రేమను వారు తరువాతి దశకు తీసుకెళ్లాలని అనుకున్నారు. వారిద్ధరూ వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆమె తను పని చేసే స్వీట్ హౌస్ కు దగ్గరలో ఉన్న ఓ హాస్టల్ లో ఉంటోంది.

నటరాజన్, అభినయలు ఆగస్టు 29వ తేదీన రంగనాథపురం పెరుమాల్ గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లికి ఇరువైపుల పెద్దలు, కుటుంబ సభ్యులు, బంధువులు హాజరు అయ్యారు. అయితే పెళ్లి తరువాత వారి ఉద్యోగాలు మారారు. చెరో నగల దుకాణాల్లో పనికి కుదిరారు. కానీ అభినయ ఒకే రోజు ఉద్యోగానికి వెళ్లింది. తరువాతి నుంచి ఇంట్లోనే ఉండిపోయింది. అయితే అక్టోబర్ 19వ తేదీన ఆమె ఒక్క సారిగా కనిపించకుండా పోయింది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న 17 తులాల బంగారం, రూ.20 వేలు, కొత్త పట్టుచీరలు కూడా కనిపించలేదు. దీంతో నటరాజ్ కు అభినయపై అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

వివాదాస్పదంగా మారిన పరేష్ రావల్ ‘చేపల కూర’ కామెంట్స్.. సారీ చెప్పిన నటుడు...

అందులో భాగంతా  అభినయ ఆధార్‌కార్డును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న అడ్రెస్ ను తెలుసుకున్నారు. ఆమె  ఓ హాస్టల్ ఉందని కనుగొన్నారు. ఆ హాస్టల్ సెమ్మంచేరి యమమల్లపురం సాలైలో ఉంటుందని తెలుసుకున్నారు. వెంటనే అక్కడికి చేరుకుని నిందితురాలిని అరెస్టు చేశారు. ఆమె దగ్గర నుంచి నాలుగు తులాల బంగారాన్ని స్వాధీనపర్చుకున్నారు. పోలీసుల విచారణలో వారు ఆశ్చర్యపోయే విషయాలు తెలుసుకున్నారు. ఆమెకు అప్పటికే పెళ్లి అయ్యిందని, ఓ బాబు కూడా ఉన్నట్టు గుర్తించారు.

బీజేపీలో చేరిన కాంగ్రెస్ నేత జైవీర్ షెర్గిల్.. చేరిన రోజే కీలకపదవి...

కాగా.. కేవలం డబ్బు, నగల కోసమే నటరాజ్ ను ప్రేమించినట్టు నటించిందని పోలీసులు విచారణలో తెలుసుకున్నారు. వాటి కోసమే అతడిని పెళ్లి చేసుకుందని గుర్తించారు. నటరాజ్ తో పాటు నిందితురాలు మరో ముగ్గురిని కూడా ఇలాగే పెళ్లి చేసుకుందని తెలుసుకొని ఖంగుతిన్నారు. ఇలా వివాహాలు చేసుకున్న తరువాత నగదు, బంగారంతో అక్కడి నుంచి పారిపోతున్నట్టు గుర్తించారు. ఇలా చేయడంతో ఆమెకు సహకారం అందిస్తున్న సెంథిల్‌కుమార్‌ను అనే వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె 32 సిమ్ కార్డులు ఉపయోగిచిందని తెలుసుకున్నారు. కేసు విచారణ జరుపుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios