తమిళనాడు ఆలయాల్లోకి ఇక సెల్ ఫోన్లు నో ఎంట్రీ.. మొబైల్స్ పై నిషేధం విధించిన మద్రాసు హైకోర్టు
తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లోకి సెల్ ఫోన్ తీసుకురావడంపై నిషేధం విధిస్తున్నట్టు మద్రాస్ హైకోర్టు తెలిపింది. దీనిని అమలు చేయాలని హెచ్ఆర్ అండ్ సీఈ డిపార్ట్ మెంట్ కు ఆదేశాలు జారీ చేసింది.

స్వచ్ఛత, మతపరమైన పవిత్రతను కాపాడేందుకు తమిళనాడులోని అన్ని దేవాలయాలలో మొబైల్ ఫోన్‌ల వినియోగాన్ని నిషేధించాలని మద్రాస్ హైకోర్టు కోర్టు ఆదేశించింది. ఈ మేరకు హిందూ మత, ధర్మాదాయ శాఖ (హెచ్‌ఆర్ అండ్ సీఈ) డిపార్ట్‌మెంట్‌కు ఆదేశాలు జారీ చేసింది.
వివాదాస్పదంగా మారిన పరేష్ రావల్ ‘చేపల కూర’ కామెంట్స్.. సారీ చెప్పిన నటుడు...
టుటికోరిన్ జిల్లాలోని తిరుచెందూర్‌లోని సుబ్రమణ్య స్వామి ఆలయంలో మొబైల్ ఫోన్‌లను నిషేధించాలని కోరుతూ ఎం సీతారామన్ అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా కోర్టు ఈ తీర్పు వెలువరించింది. భక్తులు తమ ఫోన్లలో విగ్రహాలు, పూజల ఫొటోలు తీస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. ఇది ఆగమాలకు విరుద్ధం కాబట్టి తిరుచెందూర్ ఆలయంలో మొబైల్ ఫోన్ల వాడకాన్ని నిషేధించాలని పిటిషనర్ కోరారు.
బీజేపీలో చేరిన కాంగ్రెస్ నేత జైవీర్ షెర్గిల్.. చేరిన రోజే కీలకపదవి...
ఈ వ్యాజ్యాన్ని విచారించిన న్యాయమూర్తులు ఆర్.మహదేవన్, జస్టిస్ జె.సత్యనారాయణ ప్రసాద్ మాట్లాడుతూ.. భక్తుల భద్రతతో పాటు ఆలయ పవిత్రతను కాపాడేందుకు, ఆలయ ప్రాంగణం లోపల సెల్ ఫోన్ వాడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఫోన్లు, కెమెరాల వినియోగం భక్తుల దృష్టిని మరల్చుతోందని తెలిపారు.
తిరుచెందూర్‌లోని ఆలయ అధికారులు ప్రాంగణం లోపల ఇప్పటికే మొబైల్ ఫోన్ల నిషేధం విధించడంతో పాటు మంచి డ్రెస్ వేసుకునేలా కోడ్ రూపొందించి, దానిని విజయవంతంగా అమలు చేస్తున్నారని కోర్టు తెలిపింది. ఇదే విధానాన్ని తమిళనాడులోని అన్ని దేవాలయాలలో అమలు చేయాలని సూచించింది. కాగా.. దేశవ్యాప్తంగా ఉన్న అనేక దేవాలయాల్లో (గురువాయూర్‌లోని శ్రీకృష్ణ దేవాలయం, తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఆలయం) ఇప్పటికే ఈ సెల్ ఫోన్ నిషేధం అమలు చేస్తున్నారు.