Asianet News TeluguAsianet News Telugu

బీజేపీలో చేరిన కాంగ్రెస్ నేత జైవీర్ షెర్గిల్.. చేరిన రోజే కీలకపదవి...

పంజాబ్ లో కాంగ్రెస్ సీనియర్ నేతలు ఒక్కొక్కరిగా బీజేపీలోకి చేరుతున్నారు. వీరికి బీజేపీ కీలక పదవులు ఇచ్చి సత్కరిస్తుంది.

Congress leader Jaiveer Shergill Shergill joined BJP
Author
First Published Dec 3, 2022, 7:00 AM IST

 ఢిల్లీ : కాంగ్రెస్ మాజీ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ శుక్రవారం బిజెపిలో  చేరారు. పార్టీ మారిన వెంటనే.. ఆయనను బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా పదవి దక్కింది. బీజేపీలోకి  చేరిన రోజే జైవీర్ ను జాతీయ ప్రధాన అధికార ప్రతినిధిగా  నియమించారు. దీంతో, పార్టీలోకి వచ్చిన ఒక్కరోజులోనే ఈ బాధ్యతలు దక్కడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది కాంగ్రెస్ నుండి బీజేపీలోకి చేరిన సీనియర్ నేతలు అందరికీ  కమలం పార్టీలో కీలక పదవులు దక్కుతున్నాయి. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరిన కాంగ్రెస్ మాజీ సీనియర్ నేత సునీల్ కు జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీలో చోటు దక్కగా.. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కె.పి అమరేందర్ సింగ్ ను కూడా జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీ లోకి తీసుకున్నారు.

జైవీర్ షెర్గిల్ (39)  మూడు నెలల క్రితమే కాంగ్రెస్కు రాజీనామా చేశారు. కాంగ్రెస్ నేషనల్ మీడియా ప్యానలిస్ట్ లో చాలా చిన్న వయసు వ్యక్తి జైవీర్. సుప్రీంకోర్టులో లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. రాజకీయాల్లోకి కాంగ్రెస్ పార్టీతోనే ఎంట్రీ  ఇచ్చాడు. పంజాబ్ కాంగ్రెస్ కీలక నేతల్లో జైవీర్ షెర్గిల్ ఒకరు. ఈ ఏడు ఆగస్టులో  సొంతపార్టీ నేతలపైన విమర్శలు గుప్పించారు. దీంతో అతను బీజేపీలో చేరతారని ఊహాగానాలు వినిపించాయి. కాంగ్రెస్ పార్టీ కొందరి కోసం మాత్రమే పని చేస్తుందని గాంధీ కుటుంబంపై బహిరంగంగా ఆరోపణలు చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. 

ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోప‌ణ‌లు.. కాంగ్రెస్ ఓట‌మిని అంగీక‌రించింద‌న్న ప్ర‌ధాని మోడీ

ఊహాగానాలకు బలం చేకూరుస్తూ శుక్రవారంనాడు ఆయన బీజేపీలో చేరారు. చేరిన మొదటిరోజే జాతీయ అధికార ప్రతినిధి బాధ్యతలు తీసుకున్నారు.  కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరుతో కీలక నేతలు బీజేపీలోకి చేరుతున్నారు. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్, మాజీ పీసీసీ చీఫ్ సునీల్ జాఖడ్  అలా పార్టీ మారినవారే. వీరిద్దరినీ బిజెపి జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా నియమించింది. ఈ మేరకు  శుక్రవారంనాడు బిజెపి ఒక ప్రకటన విడుదల చేసింది. 

దశాబ్దకాలంపాటు పార్టీలో సేవలందించిన కెప్టెన్ అమరేందర్ సింగ్ నిరుడు కాంగ్రెస్కు రాజీనామా చేశారు. ఆ తరువాత పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరుతో సొంత పార్టీ ఏర్పాటు చేశారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే, అమరేందర్ సింగ్ పీఎల్సీ పార్టీ  పంజాబ్ లో  పంజాబ్ లో ఒక్క స్థానంలో విజయం సాధించలేదు. దీంతో ఈ ఏడాది సెప్టెంబర్లో అమరేందర్ సింగ్ బీజేపీలో చేరారు. పీఎస్ సీ పార్టీని బిజెపిలో విలీనం చేశారు.  ఇక, సునీల్ జాఖడ్ కూడా ఈ ఏడాది మే నెలలో  కాంగ్రెస్కు గుడ్బై చెప్పి  బిజెపిలో చేరారు. 

Follow Us:
Download App:
  • android
  • ios