‘భర్తను విడిచిపెట్టి వచ్చేయ్.. రూ.10 లక్షలైనా ఇవ్వు.. లేకపోతే మన ఇద్దరి ప్రైవేటు వీడియోలు రిలీజ్ చేస్తా’
పెళ్లయి భర్తతో సంతోషంగా ఉన్న తన స్నేహితురాలిని ఓ యువకుడు బ్లాక్ మెయిల్ చేశాడు. గతంలో తీసుకున్న ఫొటోలు, వీడియోలను ఆసరాగా చేసుకొని.. భర్తను వదలిసే తన దగ్గరకు రావాలని కోరాడు. రూ.10 లక్షలైనా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో విసిగిపోయిన ఆ వివాహిత ఏం చేసిందంటే ?
ఆమె ఓ ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పని చేస్తోంది. ఏడు సంవత్సరాల కిందట ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది స్నేహంగా మారింది. అప్పటి నుంచి వారి మధ్య సాన్నిహిత్యం కొనసాగుతోంది. రెండేళ్ల కిందట ఆమె ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే దీనిని ఆమె స్నేహితుడు జీర్ణించుకోలేకపోయాడు. స్నేహంగా ఉన్న సమయంలో ఉన్న తీసుకున్న ఫొటోలు, వీడియోలు రిలీజ్ చేస్తానని చెప్పి ఆమెను బ్లాక్ బెయిల్ చేశాడు. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
ధైర్యంగా ఉండండి.. న్యాయమే తప్పకుండా విజయం సాధిస్తుంది - టీడీపీ అభిమానులతో నారా భువనేశ్వరి
ఈ ఘటన కర్ణాటకలోని చామరాజనగర జిల్లా కొళ్లేగాల పట్టణంలో చోటు చేసుకుంది. రీనా అనే యువతి స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్ గా పని చేస్తోంది. అయితే ఆమెకు నూరుమొహల్లా గ్రామానికి చెందిన అబ్దుల్ ఆసీమ్‌తో ఏడు సంవత్సరాల కిందట పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కొంత కాలం తరువాత స్నేహంగా మారింది.
విజయశాంతి పయనం ఎటువైపు..? హాట్ టాపిక్ గా మారిన సుదీర్ఘ ట్వీట్..
ఆ సమయంలో వారు సన్నిహితంగా ఉండటంతో అందరిలాగే ఫొటోలు, వీడియోలు తీసుకున్నాయి. రెండు సంవత్సరాల కిందట రీనా.. ఓ టూరిస్టు బస్సు డ్రైవర్ తో ప్రేమలో పడింది. అతడిని తరువాత పెళ్లి చేసుకుంది. అయితే దీనిని అబ్దుల్ ఆసీమ్ తట్టుకోలేపోయాడు. తనతో స్నేహంగా ఉన్న పాపానికి రీనాను వేధించడం మొదలుపెట్టాడు.
ప్రేమించిన ప్రభాకర్ రెడ్డి కోసమే గోవా నుంచి డ్రగ్స్ - కస్టడీలో రోదిస్తూ చెప్పిన అనురాధ
భర్తను వదిలేసి తన దగ్గరకు రావాలని కోరేవాడు. అలా చేయకపోతే స్నేహంగా ఉన్న సమయంలో ప్రైవేటుగా తీసుకున్న ఫొటోలు, వీడియోలు బయటకు రిలీజ్ చేస్తానని బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడేవాడు. తన దగ్గరకు రావడం కుదరకపోతే రూ.10 లక్షలు అయినా ఇవ్వాలని డిమాండ్ చేసేవాడు. అతడు చేస్తున్న ఒత్తిడితో రీనా విసిగిపోయింది. మూడు రోజుల కిందట ఆమె చామరాజనగర సీఈఎన్ పోలీసులను ఆశ్రయించింది. తనకు ఎదురవుతున్న సమస్యను వారికి వివరించింది. అబ్దుల్ ఆసీమ్‌పై ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోక దిగిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అతడికి సాయం చేసిన మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు.