ప్రేమించిన ప్రభాకర్ రెడ్డి కోసమే గోవా నుంచి డ్రగ్స్ - కస్టడీలో రోదిస్తూ చెప్పిన అనురాధ
తాను ప్రేమించి ప్రభాకర్ రెడ్డి కోసమే డ్రగ్స్ దందా చేస్తున్నట్టు అనురాధ పోలీసులకు వెల్లడించింది. ఈ దందాలో ప్రమేయం ఉన్న మరి కొందరి పేర్లను కూడా ఆమె అధికారులకు తెలియజేసింది.
హైదరాబాద్ లో కలకలం రేకెత్తించిన డ్రగ్స్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. తాను ప్రేమించిన ప్రభాకర్ రెడ్డి (వరలక్ష్మి టిఫిన్ సెంటర్ యజమాని) కోసం తాను గోవా నుంచి డ్రగ్స్ తెప్పించి, ఈ దందా చేస్తున్నానంటూ ఈ కేసులో నిందితురాలు అనురాధ పోలీసు కస్టడీలో రోదిస్తూ చెప్పింది. ‘ఈనాడు’ కథనం ప్రకారం.. ఆమె స్వస్థలం కరీంనగర్ జిల్లాలోని గన్నేరువరం. పెళ్లయిన తరువాత ఆమె పలు కారణావల వల్ల భర్త నుంచి విడిగా ఉంటోంది.
విషాదం.. ఇంజెక్షన్ వికటించి రిటైర్డ్ కానిస్టేబుల్ మరణం..హన్మకొండలో ఘటన
ఈ క్రమంలో ఆమె డ్రగ్స్ కు అలవాటు పడ్డారు. ఈ క్రమంలో ప్రగతినగర్ లోని ఓ మిత్రుడి ద్వారా గోవాలో డ్రగ్స్ నెట్ వర్క్ సూత్రదారి జేమ్స్ తో పరిచయం ఏర్పడింది. అనంతరం అతడి సంబంధాలు పెంచుకున్నారు. కాగా.. ఐటీ కారిడార్ లో ప్రాంతంలో ఉన్న వరలక్ష్మి టిఫిన్ సెంటర్ ఓనర్ అయిన ప్రభాకర్ రెడ్డి పరిచయం కలిగింది. కొంత కాలం తరువాత వారిద్దరూ చాలా క్లోజ్ అయ్యారు. దీంతో ఆమె ప్రభాకర్ రెడ్డికి డ్రగ్స్ వినియోగం, సరఫరా తీరును వివరించింది. దీంతో ప్రభాకర్ రెడ్డి ఆమె ద్వారా డ్రగ్స్ హైదరాబాద్ కు తెప్పించేవాడు. అనంతరం తనకు తెలిసిన వారికి వాటిని అమ్మేవాడు.
'ఇదోక శుభ పరిణామం' : మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదంపై జనసేనాని హర్షం
ఈ కేసు వెలుగులోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల అనురాధ, ప్రభాకర్ ను రెండు రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. వారిని విచారించారు. ఈ సమయంలోనే వారు ఈ వివరాలన్నీ వెల్లడించారు. అందులో గోవాకు చెందిన డ్రగ్స్ సూత్రదారి అయిన జేమ్స్, అలాగే హర్షవర్దన్ రెడ్డి, వినీత్ రెడ్డి, రవి పేర్లను పోలీసులకు చెప్పారు. వీరి అడ్రెస్ ఏంటో తనకు తెలియదని, తాము కేవలం పబ్బులోనే కలిసేవారిమని అనురాధ పోలీసుల కష్టడీలో వెల్లడించింది.