ధైర్యంగా ఉండండి.. న్యాయమే తప్పకుండా విజయం సాధిస్తుంది - టీడీపీ అభిమానులతో నారా భువనేశ్వరి
టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలా జైలు నుంచి బయటకు వస్తారని నారా భువనేశ్వరి అన్నారు. కార్యకర్తలు, అభిమానులు ధైర్యంగా ఉండాలని సూచించారు. న్యాయం విజయం సాధిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
ధైర్యంగా ఉండాలని, తప్పకుండా న్యాయం విజయం సాధిస్తుందని టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడి సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలా జైలు నుంచి బయటకు వస్తారని ఆమె తనను కలిసేందుకు వచ్చిన టీడీపీ కార్యకర్తలతో ధైర్యం చెప్పారు. రాజమహేంద్రవరంలో ఉన్న శిబిరం దగ్గరకు తెలంగాణ, ఏపీకి చెందిన టీడీపీ నాయకులు బుధవారం చేరుకున్నారు. ఈ సందర్భంగా భువనేశ్వరి, బ్రాహ్మణీలను కలిసి మద్దతు తెలిపారు.
ప్రేమించిన ప్రభాకర్ రెడ్డి కోసమే గోవా నుంచి డ్రగ్స్ - కస్టడీలో రోదిస్తూ చెప్పిన అనురాధ
ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు ముందు చూపుతో వ్యవహరించారని కొనియాడారు. ఆయన భావితరాలకు ఆదర్శప్రాయుడు అని చెప్పారు. కాగా.. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ శిబిరం వద్దకు అనేక ప్రాంతాల నుంచి టీడీపీ అభిమానులు తరలివచ్చారు.
విషాదం.. ఇంజెక్షన్ వికటించి రిటైర్డ్ కానిస్టేబుల్ మరణం..హన్మకొండలో ఘటన
చంద్రబాబు నాయుడుపై తమకు ఉన్న అభిమానాన్ని భువనేశ్వరికి వివరించారు. వారితో ఆమె ఎంతో అభిమానంగా మాట్లాడుతూ.. వారు చెప్పేది ఎంతో ఓపికతో విన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నామని, కానీ పోలీసులు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కొందరు మహిళలు భువనేశ్వరికి తెలిపారు. ఒక్క పిలుపునిస్తే ఏం చేసేందుకు అయినా వెనకాడబోమని వారు ఆమెకు తెలిపారు. దీంతో ఆమె ఒక్క సారిగా భావోద్వేగానికి లోనయ్యారు.