న్యూఢిల్లీ: టెర్రరిజమ్ పై ప్రధాని నరేంద్రమోదీ కన్నెర్రజేశారు. 73వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వద్ద జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ శాంతి స్థాపన కోసం భారత్ కృషి చేస్తోందని తెలిపారు. 

జమ్ముకశ్మీర్ లో శాంతిని స్థాపించాలనే ఉద్దేశంతోనే జమ్ముకశ్మీర్ విభజన, ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ రద్దు చేసినట్లు తెలిపారు. శాంతి, రక్షణ నాణేనికి బొమ్మ-బొరుసులు అంటూ మోదీ చెప్పుకొచ్చారు. తీవ్రవాదంపై భారత్ పోరాటం చేస్తుందని తెలిపారు. 

భారత్ చేస్తున్న పోరాటానికి ప్రపంచ దేశాలు మద్దతు పలుకుతున్నాయని అందుకు సంతోషిస్తున్నట్లు తెలిపారు. టెర్రరిజాన్ని ఎగుమతి చేస్తున్న వారిపట్ల కఠినంగా ఉంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా త్రివిధ దళాలకు కలిపి చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ ను మోదీ ప్రకటించారు. 

ఈ సందర్భంగా జనాభా విస్ఫోటనంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మోదీ. జనాభా పెరుగుదల ఆందోళన కలిగిస్తుందన్నారు. పెరుగుతున్న జనాభా దేశాన్ని కష్టాల్లోకి నెడుతోందని తెలిపారు. కుటుంబ నియంత్రణ సందేశాన్నిదేశ ప్రజలందరికీ చేరవేయాలని కోరారు. 

ప్రజల ఆళోచన విధానం మారకుండా దేశం మారదని తెలిపారు. ప్రజల రోజువారీ జీవితంలో ప్రభుత్వం పాత్రను క్రమంగా తగ్గించాలి. ప్రజల జీవన విధానం మెరుగుపడాలని ఆకాంక్షించారు. జనాభా నియంత్రణతోనే దేశాభివృద్ధి సాధ్యమని మోదీ తెలిపారు. 

ఈ వార్తలు కూడా చదవండి

రాబోయే రెండేళ్లలో ప్రతీ ఒక్కరికీ ఇల్లు, 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థే టార్గెట్: మోదీ

ఒకే దేశం-ఒకే రాజ్యాంగం కల నెరవేరింది, త్వరలో వన్ నేషన్-వన్ పోల్: మోదీ

ఆర్టికల్ 370 రద్దుతో పటేల్ కల సాకారం చేశాం: జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ

త్రివర్ణపతాకాన్ని ఎగురవేసిన ప్రధాని మోదీ

రాజ్ ఘాట్ వద్ద ప్రధాని మోదీ నివాళి

రాజ్ నాథ్ సింగ్ అధికారిక నివాసంలో పంద్రాగష్టు వేడుకలు